Karthika Deepam Today December 7th: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న-karthika deepam today episode december 7 shivanarayana warns karthik jyothsna plans works deepa cries star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today December 7th: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న

Karthika Deepam Today December 7th: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 07, 2024 07:14 AM IST

Karthika Deepam 2 Today Episode December 7th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చాడు శివన్నారాయణ. కాంచన, దీప కంటతడి పెట్టారు. అవమానంతో రగిలిపోతున్న శివన్నారాయణకు మరింత నూరిపోసింది జ్యోత్స్న. దాసుపై కాశీకి అనుమానం వచ్చింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam Today December 7: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు గట్టి వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న
Karthika Deepam Today December 7: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు గట్టి వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప లేకుండా మీ ఇంటికి వచ్చేది లేదని తాత శివన్నారాయణకు కార్తీక్ తెగేసి చెప్పేశాడు. తాను ఎక్కడికి వెళ్లినా భార్య దీప, కూతురు శౌర్యతోనే వస్తానని, వదిలేసి రానని తేల్చేశాడు. “దీప మీ ఇంట్లో అడుగుపెట్టడం ఇష్టం లేదంటే.. మీరే మా ఇంట్లో వచ్చి ఉండండి. మా ఇల్లు చిన్నదే అయినా మా మనసులు చాలా విశాలంగా ఉంటాయి. అందులో మీకే కాదు అందరికీ చోటు ఉంటుంది” అని కార్తీక్ అంటాడు. వస్తారా లేదా అని కాంచనను శివన్నారాయణ ప్రశ్నిస్తాడు.

yearly horoscope entry point

కార్తీక్ ఫైర్.. శివన్నారాయణ వార్నింగ్

కోడలు లేకుండా రాలేం నాన్న అని శివన్నారాయణతో కాంచన కూడా చెప్పేస్తుంది. కూతురిగా నీకు పాస్ మార్కులు రాకపోయినా.. అత్తకు వందకు వంద మార్కులు పడ్డాయయని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. తగ్గి మీ ఇంటికి వచ్చానని తల పొగరుతో మాట్లాడుతున్నావంటూ ఆగ్రహిస్తాడు. అర్థం లేని కోరికలు కోరినప్పుడు నా సమాధానం నీకు తలపొగరుగానే కనిపిస్తుంది తాత అని కార్తీక్ ఆగ్రహిస్తాడు. కార్తీక్ వస్తే భార్య, కూతురితోనే వస్తాడు, విడిగా రాడని మీ నాన్నతో చెప్పు అని కాంచనతో కార్తీక్ అంటాడు. అందరం కలిసే వస్తామని కాంచన కూడా అంటుంది.

మనవరాలి కోసం పట్టుదలను వదిలి మీ గుమ్మంలో అడుగుపెట్టినందుకు మంచి మర్యాదే చేశావంటూ శివన్నారాయణ కోపంగా అంటాడు. “రేయ్ దీనికి నువ్వు ఫలితం అనుభవిస్తావు రా” అని కార్తీక్‍కు వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఏం శాపనార్థాలు పెడుతున్నావా అని కార్తీక్ అంటాడు. నీ మనరాలిని ఇక్కడికి తీసుకొస్తే ప్రేమగా చూసుకుంటామని చెబుతాడు. దీంతో శివన్నారాయణ ఆగ్రహిస్తాడు. తన జీవితానికి ఇంత కంటే అవమానం మరొకటి లేదని అంటాడు.

అందరినీ ఏడిపిస్తూ సంతోషంగా ఉండు

తాతయ్య అని దీప అంటే.. అలా పిలవొద్దు అని గట్టిగా అంటాడు శివన్నారాయణ. కూతురిని, మనవడిని నాకు దూరం చేసి సంతోషంగా ఉన్నావంటూ వెంటకారంగా మాట్లాడతాడు. అందరినీ ఏడిపిస్తూ సంతోషంగా ఉండు అని అంటాడు. పద్ధతి ఉంటే ఇంటి కోడలిని అవమానించవంటూ కార్తీక్ గట్టిగా సమాధానం చెబుతాడు. ఇది తన లోపల ఉన్న బాధ, నొప్పి అని శివన్నారాయణ అంటాడు. “ఈ యాక్షన్‍కు రియాక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో” అని కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శివన్నారాయణ.

కాంచన, దీప కన్నీరు

మీరు ఆయనతో వెళ్లొచ్చు కదా అని దీప అంటే.. కార్తీక్ కోప్పడతాడు. ఆయన ఉద్దేశమేంటో అర్థం కావట్లేదా అని అంటాడు. మీరైనా వస్తాను అనొచ్చు కదమ్మా అని కాంచనతో దీప చెబుతుంది. కోడలిని అన్ని మాటలు అంటే ఎవరు సహిస్తారని అనసూయ అంటుంది. మనం ఆగిపోతే ఏమైనా నష్టమా అని చెబుతుంది. శివన్నారాయణకు అర్థమయ్యేలా చెప్పాల్సిందని అంటుంది. తన మాట ఎవరూ వినరని దీప ఏడుస్తుంది. దీప బాధపడటంతో కాంచన కూడా కన్నీరు పెట్టుకుంటుంది.

మరింత నూరిపోసిన జ్యోత్స్న, పారిజాతం

కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ అవమానంతో రగిపోతుంటాడు శివన్నారాయణ. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న మరింతగా నూరిపోస్తారు. కార్తీక్ అంత అవమానించాడా అని పారిజాతం అంటే.. ఒక్కడే కాదు అందరూ కలిసి అవమానించారని శివన్నారాయణ చెబుతాడు. నువ్వు అత్త ఇంటికి ఎందుకు వెళ్లావు తాత అని జ్యోత్స్న అంటే.. నీ కోసమే.. నీ ఆనందం కోసమే, నువ్వు ఏమైపోతావో అనే భయంతో వెళ్లానని శివన్నారాయణ చెబుతాడు. కార్తీక్‍ను దీప ఎంత మార్చేసిందో అర్థం చేసుకోవాలని పారిజాతం అంటుంది.

పగ తీర్చుకుంటాా.. తాత పర్మిషన్

ఇంటికి వచ్చిన తండ్రిని అత్త ఇంతలా అవమానిస్తారా అని జ్యోత్స్న అంటుంది. అసలు అత్త ఏముకుంటుంది, బావ ఏమనుకుంటాడు అని చెబుతుంది. దీప ఎలా ఆడిస్తే అలా ఆదుతున్నారంటూ శివన్నారాయణకు మరింత నూరిపోస్తుంది జ్యోత్స్న. పారిజాతం కూడా మరిన్ని మాటలు అంటుంది. తన భర్తను అవమానించడం ఏంటి అంటుంది. వాళ్లను ఎందుకు క్షమించాలంటూ శివన్నారాయణ కోపాన్ని పెంచుతుంది. దీపను ఊరికే వదలకూడదు అని అంటుంది.

“తాత ఈ అవమానాన్ని తట్టుకోలేను. దీనికి కౌంటర్‌గా ఏదైనా చేయాలని అనుకుంటున్నా. నువ్వు ఏమీ అనుకోవుగా” అని జ్యోత్స్న అంటే.. అనుకోను అని శివన్నారాయణ పర్మిషన్ ఇస్తాడు. నీ ఇష్టం.. నువ్వు ఏమనుకుంటే అది చెయ్ అంటాడు. నిన్ను బాధ పెట్టిన వారిని వదిలిపెట్టను అని జ్యోత్స్న అంటుంది. దీంతో తమ ప్లాన్ వర్కౌట్ అయిందని జ్యోత్స్న, పారిజాతం సంతోషిస్తారు. దీప మీద పగ తీర్చుకునేందుకు తాత వద్దే పర్మిషన్ తీసుకున్నావంటూ పారిజాతం అంటుంది. ముందు దీపను బావకు దూరం చేయాలని, ఏం చేస్తే వారి మధ్య దూరం పెరుగుతుందో ఆలోచించాలని జ్యోత్స్న అంటుంది. దీప గతంలో ఇచ్చిన వార్నింగ్‍ను గుర్తు చేసుకుంటుంది. దీప బుర్ర పని చేయకుండా దెబ్బ కొట్టాలని జ్యోత్స్న అంటుంది.

కార్తీక్, దీప పేర్లపై రెస్టాంట్ ప్లాన్

గత నెల ఇంటి ఖర్చులు అంటూ కాశీకి చెబుతుంది స్వప్న. రూ.25వేలు అయిందంటుంది. దీంతో కాశీ షాక్ అవుతాడు. ఇల్లు కొనుక్కోవాలంటే డౌన్ పేమెంట్ కూడా లేదంటాడు. ఇలా డబ్బు గురించి మాట్లాడుకుంటారు. బిజినెస్ చేస్తానన్నావ్ కదా అని స్వప్నను కాశీ అడుగుతాడు. పెట్టుబడి లేదని స్వప్న అంటే.. సాయం చేసేందుకు బావ ఉన్నాడు కదా అని కాశీ చెప్పాడు. అక్కాబావల సాయంతో ఫుడ్ కోర్ట్ పెడదామంటాడు. వదిన వంటలకు తిరుగులేదు కాబట్టి త్వరగా సక్సెస్ అవుతామని స్వప్న కూడా సంతోషిస్తుంది. కార్తీక్, దీప పేర్ల మీదే ఫుడ్ కోర్ట్ పెట్టాలని మాట్లాడుకుంటారు.

ఆలోచనలో దాసు

దీపే వారసురాలంటూ జ్యోత్స్నతో తాను చెప్పిన విషయాలను దాసు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజం చెప్పనని జ్యోత్స్నకు ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తుంటాడు. అన్నయ్య కూతురు ఎక్కడుందో కనిపెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలిసినా చెప్పలేని పరిస్థితి అంటూ సుదీర్ఘంగా ఆలోచిస్తాడు. దీపనే చంపాలని జ్యోత్స్న అనుకుంటోందని మనసులో అనుకుంటాడు.

దాసుపై కాశీ అనుమానం

అంత సీరియస్‍గా ఏం ఆలోచిస్తున్నావ్ నాన్న అని దాసును కాశీ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న అక్కతో ఏమైనా సమస్య ఉందా అని అడుగుతాడు. ఏమీ లేదని దాసు అంటాడు. అయితే, ఆసుపత్రిలో ఎందుకు బెదిరించావని, తాను ఆ విషయం చూశానని కాశీ చెబుతాడు. వేలి చూపించి మరీ బెదిరించావని, నాన్న జ్యోత్స్నకు వార్నింగ్ ఎందుకిస్తున్నాడా అని అనుకున్నానని అడుగుతాడు. జాగ్రత్తలు చెబుతున్నానని దాసు అంటే.. జ్యోత్స్న ఒకరు చెబితే వినే రకం కాదులే అని కాశీ అంటాడు. కానీ దీన్ని కాశీ నమ్మడు. మాట మార్చి చెబుతున్నావా అని అంటాడు. అక్క ఏమైనా తప్పు చేసిందా అని అడిగినా.. దాసు చెప్పడు. దీంతో నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడని అనుమానిస్తాడు కాశీ.

తప్పు చేశారు బాబు..

శివన్నారాయణ అన్న మాటలను గుర్తుచేసుకొని ఏడుస్తూ ఉంటుంది దీప. దీంతో అక్కడికి కార్తీక్ వస్తాడు. అసలు ఎందుకు బాధపడుతున్నావని, ఎవరు అన్న మాటలకు ఏడుస్తున్నావని అడుగుతాడు. “మీరు తప్పు చేశారు బాబు” అని దీప అంటుంది. అవును దీప.. మా తాతతో అంత ఓపికగా మాట్లాడడం నా తప్పే అని వెటకారంగా అంటాడు కార్తీక్. “మీరు మనుషులను కొంచెం కూడా అర్థం చేసుకోరా.. మీ కుటుంబాల మధ్య గొడవలు మన పెళ్లితో రెట్టింపు అయ్యాయి. ఈ తాళి జ్యోత్స్న మెడలో పడి ఉంటే ఇన్ని గొడవలు ఉండేవా బాబు” అని దీప అంటుంది. అందుకు కారణం నువ్వు కాదు కదా అంటాడు కార్తీక్. మా నాన్న రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈ గొడవలు మొదలయ్యేవే కాదని, జ్యోత్స్న మన జోలికి రాకపోయినా ఈ గొడవలు ఉండేవి కాదని అని కార్తీక్ అంటాడు.

“తప్పులు చేసేది వాళ్లు. నిందలు వేసేది వాళ్లు. అలాంటి వాళ్ల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు” అని కార్తీక్ అంటాడు. దీంతో అంత మొండిపట్టుదల ఎందుకు కార్తీక్ బాబు.. తాతయ్య రమ్మన్నప్పుడు రెండు రోజులు ఉండి రావొచ్చ కదా అని అంటుంది. వదిలేసి నువ్వు వెళతావా అని నా ప్రశ్న నాకే వేసి.. సమాధానం నా నోటితోనే చెప్పించారంటూ బాధపడుతుంది. గొడవల తర్వాత తాత మళ్లీ అవకాశం ఇచ్చినా.. మీ అమ్మకు పుట్టింటిని దూరం చేశారని దీప అంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner