తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 25th Episode: అమ్మానాన్న మధ్యలో శౌర్య ఫుల్ ఖుష్ - ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిలా మారిన జ్యోత్స్న

Karthika deepam october 25th episode: అమ్మానాన్న మధ్యలో శౌర్య ఫుల్ ఖుష్ - ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిలా మారిన జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu

25 October 2024, 7:05 IST

google News
    • Karthika deepam 2 serial today october 25th episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపను ఒక్కటి చేసేందుకు కాంచన ప్రయత్నిస్తుంది. అటు శౌర్య కూడా వాళ్ళిద్దరినీ కలిపేందుకు చూస్తుంది. అమ్మానాన్న పక్కన పడుకోవాలని దీపను బలవంతంగా కార్తీక్ గదికి తీసుకెళ్తుంది. 
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial today october 25th episode: దశరథ, సుమిత్ర కూతురి దగ్గరకు వస్తారు. క్షమించమని అడిగి పెళ్లి చేసుకోమని అడుగుతారు. కానీ జ్యోత్స్న మాత్రం క్షమించను అంటుంది. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా అని సుమిత్ర అంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది మమ్మీ. దీప నాకు మాట ఇచ్చింది బావకు నాకు పెళ్లి చేస్తానని.

నరసింహ సినిమాలో నీలాంబరిలా జ్యోత్స్న

తాళి కట్టించుకునేటప్పుడు ఆ మాట గుర్తుకు రాలేదేమో. నరసింహ సినిమాలో రమ్యకృష్ణకు కనిపించినట్టు వాళ్ళు నాకు ఎక్కడ చూసిన కనిపిస్తూ ఎగతాళి చేసినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైమ్ కావాలని అంటుంది. జ్యోత్స్న బాధలో ఉంది తను కోలుకోవడానికి టైమ్ ఇవ్వాలని దశరథ అంటాడు.

కార్తీక్ నువ్వు దీప మెడలో తాళి కట్టే ముందు నువ్వు నా గురించైనా ఆలోచించాల్సిందని సుమిత్ర బాధపడుతుంది. కాంచన, అనసూయ దీప వాళ్ళ గురించి ఆలోచిస్తారు. దీప, కార్తీక్ ని కలపడంలో మనం రెండు అడుగులు ముందుకు వేశాం. ఇప్పుడు మనం ఇంకొక పని చేయాలని కాంచన వాళ్ళు కార్తీక్ దగ్గరకు వెళతారు.

వ్రతం చేయాలి

శౌర్య కోసం దీప మెడలో తాళి కట్టావని మాకు తెలుసు. ఎంత కాదని అనుకున్నా మీరిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు. కలిసి కొత్త జీవితం మొదలుపెట్టాలి. నీ గదిలో నువ్వు, తన గదిలో తను ఉండటం కాదు కదా జీవితం. పాపకు ప్రేమ పంచాలంటే ముందు మీ ఇద్దరి మనసులు కలవాలి.

మీ భార్యాభర్తలిద్దరితో సత్యనారాయణ వ్రతం చేయించాలని అనుకుంటున్నాను. నీకేం అభ్యంతరం లేదు కదాని అడుగుతుంది. లేదు కానీ దీపను ఇబ్బంది పెట్టొద్దని అంటాడు. కొడుకు ఒప్పుకున్నందుకు కాంచన సంతోషపడుతుంది. భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుంటే మనసులో కూడా భార్యాభర్తలు అవుతారని అనసూయ సంతోషంగా అంటుంది.

బాధలో దీప

దీపను ఒప్పించమని కాంచన అనసూయకు బాధ్యత అప్పగిస్తుంది. దీప తండ్రి ఫోటో ముందు నిలబడి గతం అంతా గుర్తు చేసుకుంటుంది. బావ కోసమే పుట్టి బావ మీద ఆశలు పెట్టుకుని బతుకుతున్న జ్యోత్స్న మెడలో పడాల్సిన తాళి నా మెడలో పడింది.

ఇందులో నా తప్పు లేదు అలాగని తాళి తెంపలేను. నన్ను ఆదరించిన సుమిత్రమ్మకు కూతురు, అల్లుడికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇక మీదట నా జీవితాన్ని కాలం నడపబోతుందో కూడా అర్థం కావడం లేదని బాధపడుతుంది.

నాన్న గదిలో పడుకుందాం

అప్పుడే శౌర్య వచ్చి నిద్ర వస్తుందని అంటుంది. పడుకోబెడతా రమ్మని అంటే మనం ఇక్కడ పడుకోకూడదు నాన్న గదిలో పడుకోవాలని శౌర్య చెప్తుంది. దీప వద్దని చెప్పినా శౌర్య వినిపించుకోకుండా అలుగుతుంది. మా ఫ్రెండ్స్ అమ్మానాన్నతో కలిసి ఒకే గదిలో పడుకుంటారంట, నాన్న మంచి కథలు చెప్తారంట.

నాకు నాన్న ఉంటే బాగుండేదని అనిపించింది. మన ముత్యాలమ్మ తల్లి అమ్మగా నిన్ను, కార్తీక్ ని నాన్నగా ఇచ్చింది. మీరిద్దరితో కలిసి పడుకోవాలని ఉందని శౌర్య అంటుంది. అనసూయ వచ్చి పసి దాని మనసు అర్థం చేసుకోమని చెప్తుంది. పిల్ల ముద్దు ముచ్చట తీర్చమని అనసూయ అంటుంది.

అమ్మానాన్న మధ్యలో శౌర్య

శౌర్య దీపను బలవంతంగా కార్తీక్ గదికి తీసుకుని వెళ్తుంది. ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ అంటే కాదు మనం ముగ్గురం ఒకే గదిలో పడుకోవడానికని శౌర్య చెప్తుంది. దీప ఇబ్బంది పడుతుంటే కనీసం శౌర్య నిద్రపోయే వరకు అన్నా పడుకోమని కార్తీక్ నచ్చజెప్తాడు.

శౌర్య అమ్మానాన్న మధ్యలో పడుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అమ్మానాన్న మధ్యలో శౌర్య బాగుందని ఆనందపడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ప్రోమో

దీప గుడిలో కూర్చుని ఏడుస్తుంది. అదే గుడికి సుమిత్ర వస్తుంది. అనుకోకుండా దీపను కలుస్తుంది. నా కూతురి మెడలో పడాల్సిన తాళి నీ మెడలో పడింది. కార్తీక్ ని నువ్వు భర్తగా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. పూజారి తన కూతురి కోసం ఇచ్చిన ప్రసాదాన్ని ఇప్పుడు జ్యోత్స్న కంటే నీకే ఎక్కువ అవసరంగా ఉందని తన చేతిలో పెడుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం