Karthika deepam 2 serial today october 23rd episode: శౌర్య దీప కోసం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ దీపను తీసుకుని ఇంటికి వస్తాడు. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయావు, నేనేమైనా తప్పు చేశానా? నా మీద కోపం వచ్చిందా అని శౌర్య ఏడుస్తూ అడుగుతుంది. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లను అంటుంది.
నాకు నువ్వు, కార్తీక్ ఇద్దరూ కావాలి. మీలో ఎవరు లేకపోయిన ఏడుస్తానని అంటుంది. మాకేవారికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావని కాంచన అడుగుతుంది. దీప అత్త వాళ్ళఇంటికి వెళ్ళింది. జరిగింది ఈవిడ దృష్టిలో మహా పాపం కదా. జరిగిన దానికి ఎక్కడ తప్పుగా అనుకుంటారోనని క్షమించమని అడిగేందుకు వెళ్ళింది.
మనల్ని పద్దతిగా రావొద్దని చెప్పారు దీపను ఏకంగా గెంటేశారు. అయినా నువ్వు వాళ్ళను ఎందుకు క్షమాపణ అడగాలని కార్తీక్ అడుగుతాడు. మాట ఇచ్చి తప్పింది నేను. సుమిత్రమ్మ, జ్యోత్స్న, పారిజాతం అమ్మగారికి మీకు జ్యోత్స్నకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను.
మోసం చేసిన మనిషిలా మిగిలిపోయాను. సూటిగా వాళ్ళ మొహాలు కూడా చూడలేకపోతున్నానని బాధపడుతుంది. నువ్వు అంత తప్పు ఏం చేయలేదు నేను నా స్వార్థానికి నేనే నీ మెడలో తాళి కట్టాను. నా ఫ్రెండ్ శౌర్య బాగుండాలనే స్వార్థం నాది. అది కోరుకునే తండ్రి కావాలని అనుకున్నాను.
నా స్వార్థం తప్పు అయితే నేనే తప్పు చేశాను. క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తే నేనే చెప్పుకుంటాను. నువ్వు ఈ ఇంటి మనిషివి నువ్వు ఎవరి ముందో తలదించుకుంటే నాకు అవమానం. నా పరువే నీ పరువు. నీ మర్యాద నా మర్యాద అని అంటాడు. వద్దు మీ మర్యాదలో నాకు భాగం ఉండవచ్చు కానీ నాతో పాటు మిమ్మల్ని కలుపుకుని మీ పరువు తీయలేను.
ఆస్తి లేకపోయిన ఆత్మాభిమానంతో బతికాను. కానీ అది చచ్చిపోయింది. మీకు మీ ఆదర్శాలకు ఒక నమస్కారం. ఈ జన్మకు ఈ శిక్ష చాలు ఇక నాకు సెలవు ఇప్పించండి నేను బయల్దేరతాను అంటుంది. దీప నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. అత్తగారిగా చెప్తున్నా నువ్వు ఈ ఇంటి గడప దాటడానికి వీల్లేదు.
నువ్వు గడప దాటాలని అనుకుంటే నీ కూతురు, భర్తతో పాటు నేను గడప ముందు నిలబడతానని కాంచన అంటుంది. వద్దు నేను సాధారణ వంట మనిషిని నా దారిన నన్ను పోనివ్వండి అని దీప ఏడుస్తుంది. నీ మెడలో మూడు ముళ్ళు పడింది నిన్ను ఒంటరిగా వదిలేయడానికి కాదు.
అమ్మవారు నీకు ఈ అదృష్టం ఇచ్చారు. దాన్ని వద్దని అనుకుని పోవద్దని అనసూయ సర్ది చెప్పేందుకు చూస్తుంది. మేనత్తగా, ఆడదానిగా చెప్తున్నా నీ జీవితానికి ఇది నవ వసంతం. కాలిపోయిన తాళితోనే నీ గతం కూడా కాలిపోయింది. నీ బతుకులో మళ్ళీ నీ చేతులతో దీపాలు వెలిగించుకో.
నీ నవ వసంతాన్ని శివుడి ముందు పెట్టె కార్తీకదీపాన్ని చేసుకో అని అనసూయ హితబోధ చేస్తుంది. శౌర్య వచ్చి కార్తీక్, దీప చేతులను పట్టుకుని మా అమ్మానాన్న ఇద్దరు నాతోనే ఉంటారని సంతోషంగా చెప్తుంది. నీ కూతురు దేవుడి లాంటి మనిషిని తండ్రిగా తీసుకొచ్చి తల్లికి భర్తను చేసిందని మెచ్చుకుంటుంది.
అనసూయ మాటలకు కాంచన కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. మనం అంతా ఒక కుటుంబం ఈ ఇంట్లోనే అందరూ కలిసి ఉంటున్నామని కాంచన చెప్తుంది. పసి దాని కోసమైన మారమని అనసూయ చెప్తుంది. ఏ జన్మలోనే తీర్చుకోలేకపోయిన రుణం ఏమో ఈ జన్మలో శౌర్య ద్వారా కలిశాం. మనం కలిసే ఉండాలని కార్తీక్ అంటాడు.
కావేరి స్వప్నకు ఫోన్ చేసి దీపను దూరం పెట్టమని చెప్తుంది. అలాంటి వాళ్ళను దూరంగా ఉంచాలని అంటుంది. నీకు అసలు బుద్ధి ఉందా మమ్మీ మీ పెళ్లి విషయం బయట పడుతుందని నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. నా ప్రేమను అర్థం చేసుకుని మా పెళ్లి చేసిందని నాలుగు తిట్లు తిడుతుంది.
దీప ఇప్పుడు నా వదిన అని గట్టిగా చెప్తుంది. మనం అందరం వెళ్ళి కొత్త జంటను విష్ చేద్దామని స్వప్న దాసుతో చెప్తుంది. దీప జరిగిన సంగతులు అన్నీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. అటు కాంచన, అనసూయ దీప కార్తీక్ ని కలపడం గురించి ఆలోచిస్తారు.
దీపకు మన మీద ప్రేమ ఉంది. జరిగింది మర్చిపోయి తను ఈ ఇంటి కోడలు అవాలని తానే అనుకోవాలని అంటుంది. మీరు చెప్పింది నిజమే కానీ దీప మన మాట వినదని అంటుంది. అప్పుడే కిచెన్ లో పని చేసుకుంటూ అనసూయ చెయ్యి కాల్చుకుంటుంది.
వెంటనే దీప పరుగున వస్తుంది. నువ్వు ఏదో జరిగిపోయినట్టు కూర్చున్నావ్ ఆకలి వేస్తుంది కదా అందుకే వంట చేసుకుందామని వచ్చామని అంటుంది. కాంచన కావాలని పాలు పొంగించి కాఫీ పెట్టమని దీపకు చెప్తుంది. శౌర్య కార్తీక్ గది బయట నిలబడి తనని నాన్న అని పిలుస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్