తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 24th Episode: దీప, కార్తీక్ తో శౌర్య ఫ్యామిలీ ఫోటో- ఇంకా బావే నా మొగుడు అంటున్న జ్యోత్స్న

Karthika deepam october 24th episode: దీప, కార్తీక్ తో శౌర్య ఫ్యామిలీ ఫోటో- ఇంకా బావే నా మొగుడు అంటున్న జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu

24 October 2024, 7:05 IST

google News
    • Karthika deepam 2 serial today october 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ లను ఒక్కటి చేసేందుకు శౌర్య ప్రయత్నిస్తుంది. వాళ్లిద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఫ్యామిలీ ఫోటో దిగుతుంది. అది చూసి కాంచన మురిసిపోతుంది.
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial: శౌర్య కార్తీక్ ని నాన్న అని పిలుస్తుంది. కానీ పలకడు. తర్వాత మళ్ళీ కార్తీక్ అని పిలవగానే పలుకుతాడు. నిన్ను నాన్న అని పిలవాలని ఉంది పిలవొచ్చా అని అడుగుతుంది. పిలువు అంటే శౌర్య ప్రేమగా నాన్న అంటుంది. కార్తీక్ తనని ప్రేమగా హగ్ చేసుకుంటాడు.

నాన్న అని పిలిచిన శౌర్య 

కాంచన, అనసూయ వాళ్ళను చూసి ఎమోషనల్ అవుతారు. నిన్ను నాన్న అని పిలిస్తే చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. నువ్వు ఎంత ఆనందంగా ఉంటే అంత సంతోషంగా బతుకుతావు అందుకే నేను మీ అమ్మ మెడలో తాళి కట్టానని కార్తీక్ అనుకుంటాడు. నాకు నీ సంతోషం తప్ప ఇంకేమీ అవసరం లేదని కాంచన అనుకుంటుంది.

నువ్వు ఇక మీదట నన్ను నాన్న అనే పిలవమని చెప్తాడు. అనసూయ, కాంచన కలిసి శౌర్యతో అమ్మానాన్నను కలపాలి కదా అని చెప్తారు. శౌర్య వెంటనే గదిలో పని చేసుకుంటున్న కార్తీక్ ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. అటు కిచెన్ లో ఉన్న దీపను కూడా తీసుకొచ్చి కార్తీక్ పక్కన కూర్చోబెడుతుంది.

ఫ్యామిలీ ఫోటో 

దీప మొహం ఇష్టం లేనట్టుగా పెడితే అలా పెట్టొద్దు అది బాధపడుతుందని కార్తీక్ అంటాడు. ఇద్దరినీ దగ్గరకు జరిపి వారితో కలిసి ఫోటో దిగుతుంది. చక్కగా ఫ్యామిలీ ఫోటో దిగుతారు. జంటను చూసి అనసూయ చాలా సంతోషపడుతుంది. శౌర్య ఫోటో దీపకు చూపించబోతే అయిష్టంగా ఉంటుంది.

అప్పుడే దాసు కొడుకు, కోడలితో కలిసి ఇంటికి వస్తారు. శౌర్య నేను మా అమ్మానాన్న ఫోటో తీయించుకున్నామని చూపిస్తుంది. జరిగింది విన్నాం సంతోషంగా అనిపించింది. దీప బాబాయ్ అని పిలిచి ఎప్పుడో కూతురు అయిపోయింది. పైగా మీరిద్దరూ చాలా మంచి వాళ్ళు.

అన్ని మర్చిపో దీప 

ఇద్దరు మంచి వాళ్ళు ఒకటి కావడం చాలా సంతోషంగా ఉందని దాసు అంటాడు. స్వప్న దీపను వదిన అని పిలిచి కంగ్రాట్స్ చెప్తుంది. కానీ దీప మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కిచెన్ లోకి వెళ్ళి దీప కారాలు మిరియాలు నూరుతుంది. ఇలా జరిగింది ఏంటి అని నేను బాధపడుతుంటే సంతోషంగా లడ్డూలు పెడతారా అని తిట్టుకుంటుంది.

శౌర్య వచ్చి పలకరిస్తే దీప కోపంగా మాట్లాడుతుంది. కార్తీక్ నీ మెడలో తాళి కట్టాడు కదా తాతయ్య, అమ్మమ్మ ఎలా ఉంటారో అలా ఉండాలి కదా అంటుంది. కానీ దీప మాత్రం కోపంగా వెళ్లిపొమ్మంటే కార్తీక్ వస్తాడు. ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి బతికేయడానికి ప్రేమలు చాలు అన్నావ్.

తల్లిని మెచ్చుకున్న కార్తీక్ 

ఇప్పుడు నీ బాధ మర్చిపోవడానికి నీ చుట్టూ చాలా ప్రేమలు ఉన్నాయి. మనసు తెరిచి చూస్తే అర్థం అవుతుందని అంటాడు. నీతో ఒక్క మాట చెప్పకుండా దీప మెడలో తాళి కడితే అటు నన్ను, ఇటు కోడలిగా దీపను అర్థం చేసుకున్నావమ్మ అని కార్తీక్ తల్లిని మెచ్చుకుంటాడు.

జ్యోత్స్న కోపంగా ఉంటే సుమిత్ర, దశరథ వస్తారు. పెళ్లి గురించి మాట్లాడాలని అంటారు. నా పెళ్లి ఎప్పుడో బావతో అయిపోయింది కదా అంటుంది. అది మా తప్పు నా చెల్లెలు అడిగిందని మాట ఇచ్చాము. అది తప్పినందుకు క్షమించమని సుమిత్ర అడుగుతుంది.

మిమ్మల్ని నేను ఎలా క్షమిస్తాను. క్షమించడం అంటే బావను మనసులో నుంచి తీసేసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే. నీకోక పెళ్లి సంబంధం చూశాము. నువ్వు ఊ అంటే రేపు పెళ్లి చూపులకు వస్తాము అని చెప్తారు అంతే కదాని గట్టిగా అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ఎపిసోడ్ ప్రోమో

శౌర్య దీప దగ్గరకు వచ్చి నిద్ర వస్తుందని అంటుంది. సరే పడుకోబెడతాను అంటే మనం ఇక్కడ కాదు పడుకునేది నాన్న గదిలో అని చెప్తుంది. దీపను బలవంతంగా కార్తీక్ గదికి తీసుకెళ్తుంది. నాతో ఏమైనా మాట్లాడాలా అంటే కాదు మనం ముగ్గురం ఒకే గదిలో పడుకోవడానికని శౌర్య చెప్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం