Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప పుట్టిన రోజు జరిపించిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్
20 April 2024, 7:07 IST
- Karthika deepam 2 serial april 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న పుట్టినరోజు నాడే దీప పుట్టినరోజు అని కార్తీక్ సుమిత్రకి చెప్తాడు. దీంతో తన కూతురి పుట్టినరోజు వేడుకలు చేస్తుంది.
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్
Karthika deepam 2 serial april 20th episode: శౌర్య పూలు కోయబోతుంటే బంటు వచ్చి వద్దని అంటాడు. అమ్మమ్మకి చెప్తాను అనేసరికి పారిజాతం వచ్చి ఇంతకముందు ఒకసారి పూల విషయంలో గొడవ జరిగిందని అంటుంది. ఇప్పుడున్న గొడవలు చాలు కొత్తవి తెచ్చిపెట్టకు అనేసి బంటుని తీసుకుని వెళ్ళిపోతుంది.
కార్తీక్ ని ఇరికించిన పారిజాతం
జ్యోత్స్న పుట్టినరోజు సందర్భంగా అందరూ విసెష్ చెప్తారు. త్వరగా తన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి అని కాంచన జ్యోత్స్నతో అంటుంది. పారు వైపు కార్తీక్ కోపంగా చూస్తాడు. బావని తన కోసం ఏ గిఫ్ట్ తీసుకురాలేదా అంటుంది.
పారిజాతం ఎవరికీ తెలియకుండా కార్తీక్ చేతిలో ఎర్ర గులాబీ పెడుతుంది. అది జ్యోత్స్న చూసి నా బర్త్ డేకి నీ ప్రేమ గిఫ్ట్ గా ఇస్తున్నావా అని మురిసిపోతుంది. ఇక సుమిత్రకు కార్తీక్ దీప పుట్టినరోజు కూడా ఈరోజే అని చెప్తాడు. జ్యోత్స్నతో కేక్ కట్ చేయిద్దాం రమ్మని పారిజాతం పిలుస్తుంది.
సుమిత్ర దీపను రమ్మని పిలుస్తుంది. తను ఎందుకులే అందరం ఇక్కడే ఉన్నాం కదాని పారిజాతం అంటే దీప కూడా ఈ ఇంటి మనిషేనని శివనారాయణ అంటాడు. అదేదో సొంత మనవరాలు అయినట్టు అది ఎందుకని పారు తిట్టుకుంటుంది. దీప రాగానే ఈరోజు జ్యోత్స్న పుట్టినరోజు మాత్రమే కాదు దీప పుట్టినరోజు కూడా అని సుమిత్ర చెప్తుంది.
కేక్ చూసి ఆశ్చర్యపోయిన శౌర్య
పారిజాతం గతంలో బిడ్డని మార్చినది గుర్తు చేసుకుంటుంది. ఇంట్లో అందరూ దీపకు పుట్టినరోజు విసెష్ చెప్తారు. దీప కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. మా ఊర్లో అమ్మ పుట్టినరోజుకి నేను తప్ప ఎవరూ శుభాకాంక్షలు చెప్పరు, కానీ ఇక్కడ ఎంత మంది చెప్పారో అని శౌర్య ఆశ్చర్యపోతుంది.
ఏ కారణంగానైనా నీ జీవితంలోకి సంతోషం తీసుకురావాలనే నా తాపత్రయం అని కార్తీక్ అనుకుంటాడు. కేక్ చూసి పుట్టినరోజుకి ఇది కాదు కదా కట్ చేయాల్సింది అని శౌర్య బన్ తెచ్చి చూపెడుతుంది. బర్త్ డే కేక్ అంటే ఇదని అమాయకంగా అంటుంది.
నా పుట్టినరోజుకి మా అమ్మ నాతో ఇదే కట్ చేయిస్తుందని చెప్పేసరికి అందరూ తనవైపు జాలిగా చూస్తారు. అమ్మ పుట్టినరోజుకి నేను తప్ప ఎవరూ లేరు కదా అందుకే మా అమ్మ కోసం ఈ బన్ కొని తెచ్చానని చెప్తుంది. అప్పుడు కార్తీక్ శౌర్య బన్ కొన్న విషయం గుర్తు చేసుకుంటాడు.
దీప కూడ నా కూతురే
మీ అమ్మకు ఊర్లో నువ్వు ఒక్కదానివి ఉన్నావ్ ఏమో ఇక్కడ ఒక కుటుంబమే ఉంది. అనాథలా అవుట్ హౌస్ లో బర్త్ డే చేసుకుందామని అనుకున్నారా? అని దీపని సుమిత్ర ప్రేమగా పిలుస్తుంది. జ్యోత్స్నతో పాటు కేక్ కట్ చేయమని సుమిత్ర చెప్తుంది.
ఎంత ఇద్దరిది ఒకేరోజు పుట్టినరోజు అయితే మాత్రం ఒకేసారి కట్ చేయించడం ఎందుకని పారిజాతం అంటుంది. తనకి ఇద్దరూ సమానమేనని అంటుంది. దీప కూడా తన కూతురేనని దశరథ కూడా చెప్తాడు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. దీప శౌర్య తెచ్చిన బన్ కూడా కట్ చేసి తనకి తినిపిస్తుంది.
వెళ్లిపోతానన్న దీప
కార్తీక్ కి కూడా తినిపించమని శౌర్య అనేసరికి అందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు. బావకి నేను పెడతానని జ్యోత్స్న అంటుంది. శౌర్యని ఇక్కడ స్కూల్ లో చేర్పించాలని అనుకుంటున్నామని దీపని కూడా ఇక్కడే ఉండిపొమ్మని దశరథ అడుగుతాడు. జ్యోత్స్న పుట్టినరోజని ఆగాను లేదంటే వెళ్లిపోయేదాన్ని అని చెప్తుంది.
దీపక్క నిన్ను పంపించాలని మేము అనుకోవడం లేదు. నువ్వు ఇక్కడే ఉండీ నీకు నచ్చిన పని చేస్తూ ఉండవచ్చని జ్యోత్స్న కూడా చెప్తుంది. కానీ దీప మాత్రం వెళ్లాల్సిందేనని అంటుంది. అందరూ కలిసి గుడికి వెళతారు. నరసింహ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
దీపని పంపించేయాల్సిందే
శోభ తన బతుకు సెకండ్ హ్యాండ్ చేశావని నరసింహని తిడుతుంది. దీప రాకపోయినా నీ కూతురు వస్తే నా పరిస్థితి ఏంటని నిలదీస్తుంది. దీప ఎక్కడ ఉందో వెతికి దాన్ని ఊరు పంపించి ఇంటికి రా లేదంటే అమ్మని పిలుస్తానని బెదిరిస్తుంది. ఆ బుడ్డది నీ కూతురు కాదని నా అనుమానం పోయి వాడిని అడుగు చెప్తాడు ఏమోనని రెచ్చగొడుతుంది.
మల్లేష్ పంచాయతీ పెడతాడు. అప్పు తీరుస్తానని వెళ్ళి దీప ఇంకా రాలేదు. అందుకే నీ ఇల్లు జప్తు చేస్తున్నాం దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని ప్రెసిడెంట్ చెప్తాడు. కానీ ఇది తన తమ్ముడు ఇల్లు అమ్మొద్దు అని చెప్పి అనసూయ బతిమలాడుతుంది.
టాపిక్