తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Kanguva: అఫీషియ‌ల్ - సూర్య కంగువ రిలీజ్ 2025 కాదు… 2024లోనే - స్టోరీపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Suriya Kanguva: అఫీషియ‌ల్ - సూర్య కంగువ రిలీజ్ 2025 కాదు… 2024లోనే - స్టోరీపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌

14 April 2024, 18:22 IST

  • Suriya Kanguva: సూర్య కంగువ మూవీ రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ ఆదివారం క్లారిటీ ఇచ్చారు. 2024లోనే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొత్త పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

సూర్య కంగువ మూవీ
సూర్య కంగువ మూవీ

సూర్య కంగువ మూవీ

Suriya Kanguva:సూర్య కంగువ మూవీ 2025లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు కొన్నాళ్లుగా కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ గాసిప్స్‌పై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మేక‌ర్స్ ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చారు. 2024లోనే కంగువ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ఆదివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. . అయితే మూవీ రిలీజ్ డేట్‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నెల‌లో కంగువ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Flashback OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ అన‌సూయ త‌మిళ్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

Srikanth Box Office Collections: దుమ్మురేపుతున్న శ్రీకాంత్ మూవీ.. మన పారిశ్రామికవేత్త బయోపిక్ బాలీవుడ్‌లో సూపర్ హిట్

Godzilla x Kong The New Empire OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ

Jai Ganesh OTT: ఓటీటీలోకి భాగ‌మ‌తి హీరో మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్‌

సూర్య కొత్త పోస్ట‌ర్‌...

ఆదివారం మేక‌ర్స్ కంగువ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో రెండు డిఫ‌రెంట్ లుక్స్‌ల‌లో సూర్య క‌నిపిస్తున్నాడు. ఓ వైపు ఆట‌విక ప్ర‌జ‌లు ధ‌రించే దుస్తుల్లో చేతిలో క‌త్తి ప‌ట్టుకొని ఉన్న సూర్య లుక్ ఆస‌క్తిని పంచుతోంది. ఒంటిపై ప‌చ్చ‌బొట్టు, మెడ‌లో పుర్రెల‌తో కూడి దండ‌లు ఉన్నాయి. అత‌డి వెనుక అడ‌వి త‌గ‌ల‌బ‌డుతోన్న‌ట్లుగా చూపించారు.

మ‌రోవైపు ఉన్న పోస్ట‌ర్‌లో సూట్ ధ‌రించి చేతిలో గ‌న్ ప‌ట్టుకొని మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపిస్తోన్నాడు. అత‌డి వెన‌కాల‌ ఉన్న బిల్డింగ్‌లు త‌గ‌ల‌బ‌డిపోతున్న‌ట్లుగా పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే గ‌తం, వ‌ర్త‌మాన కాల‌ల్లో కంగువ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎక్క‌డైతే గ‌తం, వ‌ర్త‌మానం ఒక‌దానికొక‌టి త‌ల‌ప‌డ‌తాయో అక్క‌డే కొత్త భ‌విష్య‌త్తు ఉద్భ‌విస్తుంది అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

మూడు వంద‌ల యాభై కోట్ల బ‌డ్జెట్‌...

కంగువ మూవీకి సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ కోలీవుడ్‌ మూవీలో బాలీవుడ్ న‌టుడు, యానిమ‌ల్ ఫేమ్ బాబీ డియోల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 300 నుంచి 350 కోట్ల బ‌డ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీతోనే యూవీ క్రియేష‌న్స్ సంస్థ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల్లో ఒక‌టిగా కంగువ తెర‌కెక్కుతోంది. త‌మిళ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్‌గా 38 భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. ఇటీవ‌ల కంగువ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది.

500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌

లాంగ్ హెయిర్‌తో ఇంటెన్స్ గెటప్‍తో ఈ టీజ‌ర్‌లో సూర్య క‌నిపించాడు. సూర్య‌కు ధీటుగా బాబీడియోల్ విల‌నిజాన్ని టీజ‌ర్‌లో చూపించారు. కంగువ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

కంగువ ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్ల‌కుపైనే జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే హిందీ డ‌బ్బింగ్ శాటిలైట్, థియేట్రిక‌ల్ హ‌క్కులు క‌లిపి వంద కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అమెజాన్ చేతికి ఓటీటీ హక్కులు

కంగువ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను కూడా ఖరారు చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. ఎన‌భై కోట్ల‌కు కంగువ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగులు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం