Kalki 2898 AD Release Date: ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్-nag ashwin interesting update on prabhas kalki 2898 ad release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nag Ashwin Interesting Update On Prabhas Kalki 2898 Ad Release Date

Kalki 2898 AD Release Date: ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Hari Prasad S HT Telugu
Aug 07, 2023 08:40 PM IST

Kalki 2898 AD Release Date: ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఓ నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలీజ్ డేట్ పై అతడు సరదాగా స్పందించాడు.

ప్రభాస్ కల్కి గ్లింప్స్
ప్రభాస్ కల్కి గ్లింప్స్ (twitter)

Kalki 2898 AD Release Date: ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ సమయానికే రిలీజ్ అవుతుందా? ముందు చెప్పినదాని ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ ఆలస్యం అవుతున్నాయని.. దీంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైజయంతీ మూవీస్ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. అప్పుడెప్పుడో 34 ఏళ్ల కిందట జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ మే 9 రిలీజ్ కావడంతో అదే తేదీకి కల్కి మూవీని రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించాడు. ఓ నేషనల్ మీడియా హౌస్ తో మాట్లాడిన అతడు.. రిలీజ్ డేట్ పై సరదాగా స్పందించాడు.

మే 9నే ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రశ్నించగా.. "నేను దాని కోసం జ్యోతిష్యం చూడాలి. గ్రహాల కదలికలను బట్టే రిలీజ్ డేట్ నిర్ణయం తీసుకుంటా" అని నాగ్ అశ్విన్ అనడం విశేషం. ఆ లెక్కన సినిమా రిలీజ్ తేదీపై స్పష్టత రానట్లే. వచ్చే ఏడాది సంక్రాంతికే కాదు.. మే నెలలోనూ కల్కి 2898 ఏడీ రిలీజ్ కావడం అనుమానంగానే మారింది.

మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పటి నుంచీ ప్రాజెక్ట్ కేగా పిలవగా.. ఈ మధ్యే శాన్ డీగో కామిక్ కాన్ లో సినిమా పేరును కల్కి 2898 ఏడీగా అనౌన్స్ చేయడంతోపాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటం చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇది ఒకరకంగా ఇన్నాళ్లూ సినిమాపై ఉన్న అంచనాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీలాంటి నటీనటులు ఉండటంతో ఈ కల్కి మూవీ పాన్ వరల్డ్ లెవల్లో ఆసక్తి రేపుతోంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి ఓ కారణంగా చెప్పొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

IPL_Entry_Point