Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా సీక్వెల్‍పై నాగ్ అశ్విన్ కామెంట్.. ప్రభాస్‍ను అందుకే ఎంపిక చేసుకున్నా!-director nag ashwin comment on kalki 2898 ad sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: ‘కల్కి’ సినిమా సీక్వెల్‍పై నాగ్ అశ్విన్ కామెంట్.. ప్రభాస్‍ను అందుకే ఎంపిక చేసుకున్నా!

Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా సీక్వెల్‍పై నాగ్ అశ్విన్ కామెంట్.. ప్రభాస్‍ను అందుకే ఎంపిక చేసుకున్నా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 26, 2023 02:58 PM IST

Kalki 2898 AD: కల్కి 2898 మూవీ సీక్వెల్ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. అలాగే, ప్రభాస్‍ను హీరోగా ఎంపిక చేసుకోవడం గురించి కూడా మాట్లాడారు.

నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్

Kalki 2898 AD: స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న గ్లోబల్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. హాలీవుడ్ రేంజ్‍లో టేకింగ్, మేకింగ్ ఉండడంతో ఆసక్తి అధికమైంది. భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. అయితే, కల్కి 2898 ఏడీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, ఫ్రాంచైజీగా వస్తుందని కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అలాగే కల్కి చిత్రానికి ప్రభాస్‍ను ఎందుకు ఎంపిక చేసుకున్నారన్నది వెల్లడించారు.

‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సీక్వెల్ గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పారు. ‘కల్కి’ సీక్వెల్, ఫ్రాంచైజీ గురించి ఇప్పటి వరకు ప్లాన్ చేయలేదని అన్నారు. అయితే, ఈ సినిమాలో కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్లు, లొకేషన్లు, వెహికల్స్‌తో యానిమేటెడ్ షోస్ తీయవచ్చని నాగ్ అశ్విన్ చెప్పారు.

‘కల్కి 2898 ఏడీ’ కథ రాసుకునేటప్పుడే హీరోగా ఎవరుండాలని తాను ఆలోచించానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. ఆ సమయంలో ఆ పాత్రలో తాను ప్రభాస్‍ను ఊహించుకున్నానని ఆయన తెలిపారు. ప్రభాస్‍ను ఊహించుకొనే తాను ఈ కథ రాసుకున్నానని వెల్లడించారు. ఈ కథ కోసం తన మైండ్‍లో ప్రభాస్ మాత్రమే వచ్చాడని, అందుకే అతడిని హీరోగా ఎంపిక చేసుకున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ ఈవెంట్‍లో గ్లింప్స్ రిలీజ్ చేసిన తొలి భారతీయ చిత్రంగా ఈ మూవీ ఘనత దక్కించుకుంది. హీరో ప్రభాస్, సీనియర్ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ సహా మరికొందరు ఈ ఈవెంట్‍లో వెళ్లారు. స్టార్ హీరో రానా కూడా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తరఫున ఈవెంట్‍లో పాల్గొన్నారు. గ్లింప్స్ తర్వాత ఇండియాతో పాటు హాలీవుడ్‍లోనూ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై ఆసక్తి పెరిగింది.

‘కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అశ్వినీదత్. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా.. మే నెలకు వాయిదా పడుతుందని తెలుస్తోంది.

IPL_Entry_Point