K-Dramas in Telugu OTT: ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో తెలుగులో అందుబాటులో ఉన్న కొరియన్ డ్రామాస్ ఇవే
02 October 2024, 20:47 IST
- K-Dramas in Telugu OTT: కొరియన్ డ్రామాస్ ఎన్నో ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ కేవలం తెలుగు కంటెంట్ అందించే ఆహా వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కే-డ్రామాస్ ఏవో ఇక్కడ చూడండి.
ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో తెలుగులో అందుబాటులో ఉన్న కొరియన్ డ్రామాస్ ఇవే
K-Dramas in Telugu OTT: కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ కు ఇక్కడి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ఇంగ్లిష్ తోపాటు తెలుగులాంటి ఎన్నో భారతీయ భాషల్లోనూ డబ్ చేస్తున్నారు. కొరియా నుంచి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ఎన్నో ఇప్పటికే ఆహా వీడియో, ఈటీవీ విన్, ఎంఎక్స్ ప్లేయర్ లాంటి ఓటీటీల్లో తెలుగులో ఉన్నాయి.
తెలుగులో ఉన్న కొరియన్ డ్రామాస్
కొరియన్ డ్రామాస్ సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీలాంటి జానర్ల కొరియన్ కంటెంట్ కు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. మరి అలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ తెలుగు కంటెంట్ అందించే ఆహా వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో ఏమున్నాయో చూడండి.
యూత్ ఆఫ్ మే - ఆహా వీడియో
యూత్ ఆఫ్ మే 2021లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. ఇదొక రొమాంటిక్ డ్రామా. 1980ల నేపథ్యంలో తెరకెక్కింది. ఓ మెడికల్ స్టూడెంట్, నర్స్ పెళ్లి, వాళ్ల రిలేషన్షిప్ చుట్టూ తిరిగే కథ. ప్రస్తుతం తెలుగులో ఆహా వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కు ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ ఉంది.
ఫైట్ ఫర్ మై వే - ఆహా వీడియో
2017లో వచ్చిన కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఈ ఫైట్ ఫర్ మై వే. జీవితంలో సెటిలవడానికి ప్రయత్నిస్తూనే ప్రేమలో పడిపోయే చిన్ననాటి ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ తెలుగులో ఆహా వీడియోలో ఉంది.
స్కూల్ 2017 - ఆహా వీడియో
స్కూల్ 2017 కూడా ఓ యూత్‌ఫుల్ రొమాంటిక్ వెబ్ సిరీసే. కొందరు హైస్కూల్ స్టూడెంట్స్, పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలన్న ఒత్తిడిని అధిగమించేందుకు వాళ్లు పడే తంటాలు చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది. తెలుగులో ఆహా వీడియోలో అందుబాటులో ఉంది.
ఐయామ్ నాట్ ఎ రోబో - ఈటీవీ విన్
ఐయామ్ నాట్ ఎ రోబో ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. 2017-18లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో 8.0 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ ను తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.
వెల్‌కమ్ 2 లైఫ్ - ఈటీవీ విన్
వెల్‌కమ్ 2 లైఫ్ గత నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. ఇదొక స్వార్థపరమైన లాయర్ చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రమాదం తర్వాత తాను అప్పటి వరకూ చేసిన పాపపు పనులను పక్కన పెట్టి నిజాయతీగా బతకాలను అనుకుంటాడు. ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉన్న సిరీస్ ఇది.
ఇవే కాకుండా ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో అయితే ఎన్నో తెలుగులోకి డబ్ అయిన కొరియన్ డ్రామాస్ చూడొచ్చు. సస్పిషియస్ పార్ట్‌నర్, ది లాస్ట్ ఎంప్రెస్, డు యు లైక్ బ్రహ్మ్స్, ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ మై సెక్రటరీ, ది ఫియరీ ప్రీస్ట్, యాంగ్ పాల్, ఐ వానా హియర్ యువర్ సాంగ్ లాంటి సిరీస్ లన్నీ తెలుగులో డబ్ అయి అందుబాటులో ఉన్నాయి.