తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Wife: చార్మినార్ దగ్గర రంజాన్ షాపింగ్ చేసిన తారక్ భార్య.. ఫొటో వైరల్

Jr NTR Wife: చార్మినార్ దగ్గర రంజాన్ షాపింగ్ చేసిన తారక్ భార్య.. ఫొటో వైరల్

Hari Prasad S HT Telugu

18 April 2023, 15:30 IST

google News
    • Jr NTR Wife: చార్మినార్ దగ్గర రంజాన్ షాపింగ్ చేసింది తారక్ భార్య లక్ష్మీ ప్రణతి. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటో తెగ చెక్కర్లు కొడుతోంది.
చార్మినార్ ప్రాంతంలో లక్ష్మీ ప్రణతి షాపింగ్
చార్మినార్ ప్రాంతంలో లక్ష్మీ ప్రణతి షాపింగ్

చార్మినార్ ప్రాంతంలో లక్ష్మీ ప్రణతి షాపింగ్

Jr NTR Wife: రంజాన్ పండుగకు మరికొన్ని రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతం మొత్తం ముస్లిం సోదరుల షాపింగ్ తో కిక్కిరిసిపోయి ఉంటుంది. అయితే ఆ షాపింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోమవారం (ఏప్రిల్ 17) రాత్రి ఆమె చార్మినార్ ప్రాంతంలో షాపింగ్ చేస్తూ కనిపించింది. కొందరు స్నేహితులతో కలిసి వచ్చిన ఆమె.. చార్మినార్ వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం విశేషం. తారక్ భార్య కావడంతో చాలా మంది ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ కెమెరాలకు పని చెప్పారు. ఆ వెంటనే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

తారక్ భార్య లక్ష్మీ ప్రణతి రంజాన్ షాపింగ్ చేస్తోందంటూ ఈ ఫొటోలను కొందరు షేర్ చేశారు. నిజానికి చార్మినార్ అంటే గాజులకు కూడా చాలా ఫేమస్. దీంతో సాధారణ జనంతోపాటు సెలబ్రిటీలు కూడా ఇక్కడి గాజులు కొనుగోలు చేయడానికి వస్తుంటారు. ఇక రంజాన్ సమయంలో ఇక్కడి వీధులకు మొత్తం పండగ కళ వస్తుంది. దానిని చూడటానికి కూడా ఇలా ఎంతో మంది వస్తుంటారు.

హైదరాబాద్ లో రంజాన్ ను చాలా ఘనంగా జరుపుకుంటారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు నెల మొత్తం ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. ఇక హైదరాబాద్ సంస్కృతిని బాగా ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్.. రంజాన్ సమయంలో దొరికే హలీమ్ ను కూడా తాను చాలా ఇష్టంగా తింటానని గతంలో చెప్పాడు. స్టార్ హీరోగా ఎదగక ముందు అతడు రెగ్యులర్ గా చార్మినార్ ప్రాంతానికి వచ్చి అక్కడి నోరూరించే వంటలను టేస్ట్ చేసేవాడు.

తదుపరి వ్యాసం