NTR to Replace Ranveer: ఆ పాన్ ఇండియా మూవీలో రణ్‌వీర్‌ స్థానంలో తారక్..! ఎందులో అంటే? -jr ntr to replaces ranveer singh in the immortal ashwatthama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jr Ntr To Replaces Ranveer Singh In The Immortal Ashwatthama Movie

NTR to Replace Ranveer: ఆ పాన్ ఇండియా మూవీలో రణ్‌వీర్‌ స్థానంలో తారక్..! ఎందులో అంటే?

Maragani Govardhan HT Telugu
Apr 16, 2023 03:03 PM IST

NTR to Replace Ranveer: జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరింది. దీంతో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ చిత్రంలో రణ్‌వీర్ స్థానంలో తారక్ నటించనున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

రణ్ వీర్ స్థానంలో ఎన్టీఆర్
రణ్ వీర్ స్థానంలో ఎన్టీఆర్

NTR to Replace Ranveer: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) రేంజ్ ఇప్పుడు మనదేశంలోనే కాదు.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి బంపర్ హిట్‌ కావడం, ఆ మూవీకి ఆస్కార్ రావడంతో తారక్.. నటించబోయే మూవీస్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై వార్-2లో హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్న మన తారక్.. ప్రస్తుత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కు సంబంధించి బీటౌన్‌లో ఓ క్రేజీ వార్త హల్చల్ చేస్తుంది. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ(The Immortal Ashwatthama) అనే భారీ బడ్జెట్ చిత్రంలో లీడ్ రోల్‌లో నటించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‍ను(Ranveer Singh) హీరోగా అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ పాత్రకు సరైన న్యాయం ఎన్టీఆరే చేస్తాడని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో రణ్‌వీర్ స్థానంలో తారక్‌ను భర్తీ చేయాలని చూస్తున్నారట. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో యంగ్ టైగర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారట. ఒకవేళ తారక్ ఒప్పుకోకపోతే ఆ రోల్‌లో అల్లు అర్జున్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

రణ్‌వీర్ సింగ్ నటించిన 83 సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన జయేష్‌భాయ్ జోర్దార్, సర్కస్ తదితర చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో ఇమ్మోర్టల్ అశ్వత్థామ చిత్రంలో సౌత్ స్టార్స్ అయిన తారక్ లేదా అల్లు అర్జున్‌తో భర్తీ చేయాలని చూస్తున్నారట. ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో వీరిద్దరూ క్రేజ్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రంలో తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.

బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం వీరిద్దరీలో తారక్‌తోనే ఈ మూవీ చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోల్‌లో ఎన్టీఆర్ పర్ఫెక్టుగా సరిపోతాడని అనుకుంటున్నారట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

ప్రస్తుతం తారక్.. కొరటాల దర్శకత్వంలో NTR 30లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

IPL_Entry_Point

టాపిక్