Indian 2 Twitter Review: ఇండియన్ 2 ట్విట్టర్ రివ్యూ - కమల్ సినిమాకు నెగెటివ్ టాక్ - అవుట్‌డేటెడ్ సీక్వెల్
12 July 2024, 6:13 IST
Indian 2 Twitter Review: కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కలయికలో వచ్చిన ఇండియన్ 2 మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఇండియన్ 2 ట్విట్టర్ రివ్యూ
Indian 2 Twitter Review: విలక్షణ నటుడు కమల్‌హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 1996లో రిలీజైన ఇండియన్‌కు సీక్వెల్‌గా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ 2లో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్ కీలక పాత్రలు పోషించారు. దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత కమల్‌హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? కల్కి తర్వాత వచ్చిన ఈ మూవీతో కమల్‌హాసన్ హిట్ కొట్టాడా? లేదా? అంటే?
నెగెటివ్ టాక్...
కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీకి ఊహించని విధంగా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి నెగెటివ్ టాక్ వస్తోంది. సినిమా మొత్తం రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రెడిక్టబుల్‌గా ఉందని ఓవర్‌సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ పెడుతోన్నారు. శంకర్ ఓల్డ్ స్కూల్ మూవీ ఇదని, ఓ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను జోడించి ఈ మూవీని తెరకెక్కించాడని అంటున్నారు.
అవుట్‌డేటెడ్ అండ్ బోరింగ్...
మంచి ఎమోషనల్ సీన్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుందని చెబుతున్నారు. సమకాలీన సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలను ఆలోచనాత్మకంగా ఓపెనింగ్ ఎపిసోడ్స్ లో శంకర్ చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. సేనాపతి ఎంట్రీ తర్వాతే కథలో వేగం తగ్గుతుందని, సినిమా మొత్తం బోరింగ్, అవుట్‌డేటెడ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని చెబుతోన్నారు. డైలాగ్స్, ఎమోషన్స్ ఆర్టిఫీషియల్ గా సాగిన ఫీలింగ్ కలుగుతుందని, ఇండియన్ లోని సోల్ సీక్వెల్ లో మిస్సయిందని ట్వీట్స్ చేస్తోన్నారు.
వింటేజ్ కమల్...
సేనాపతిగా కమల్‌హాసన్ మాత్రం తన యాక్టింగ్‌తో ఇరగదీశాడని అంటున్నారు. కమల్ లుక్, మ్యానరిజమ్స్‌తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వింటేజ్ కమల్‌ను మరోసారి ఈ మూవీతో శంకర్ గుర్తుచేశాడని చెబుతోన్నారు. ఇండియన్ 3 పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్ ట్విస్ట్ ను శంకర్ బాగా రాసుకున్నాడని అంటున్నారు.
విజువల్‌గా గ్రాండియర్...
విజువల్‌గా మాత్రం ఇండియన్ 2 చాలా గ్రాండియర్‌గా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతోన్నారు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని, బీజీఎమ్, పాటలు ఆకట్టుకోవని ట్వీట్స్ పెడుతోన్నారు. సినిమాలో కొన్ని చోట్ల భారతీయుడు సినిమా థీమ్ మ్యూజిక్, పాటలను ఉపయోగించారని ఆ సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు.
కమల్‌హాసన్‌తో పోలిస్తే ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కమల్ హాసన్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయని పేర్కొంటున్నారు. రకుల్, బాబీసింహా, సముద్రఖనితో పాటు మిగిలిన వారు మెప్పించారని చెబుతున్నారు.