Kalki 2898 AD: క‌ల్కి 2898 ఏడీ ఫ‌స్ట్ టికెట్‌ను 500ల‌కు కొన్న అమితాబ్ - క‌మ‌ల్‌హాస‌న్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన బిగ్‌బీ-amitabh bachchan buys kalki 2898 ad first ticket for 500 rupees prabhas deepika padukone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: క‌ల్కి 2898 ఏడీ ఫ‌స్ట్ టికెట్‌ను 500ల‌కు కొన్న అమితాబ్ - క‌మ‌ల్‌హాస‌న్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన బిగ్‌బీ

Kalki 2898 AD: క‌ల్కి 2898 ఏడీ ఫ‌స్ట్ టికెట్‌ను 500ల‌కు కొన్న అమితాబ్ - క‌మ‌ల్‌హాస‌న్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన బిగ్‌బీ

Nelki Naresh Kumar HT Telugu
Jun 20, 2024 09:59 AM IST

Kalki 2898 AD: ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ ఫ‌స్ట్ టికెట్‌ను నిర్మాత అశ్వ‌నీద‌త్ నుంచి అమితాబ్‌బ‌చ్చ‌న్ 500 రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు. ఈ ఫ‌స్ట్ టికెట్‌ను క‌మ‌ల్‌హాస‌న్‌కు అమితాబ్ బ‌హుమ‌తిగా అంద‌జేశారు.

క‌ల్కి 2898 ఏడీ మూవీ ఫ‌స్ట్ టికెట్‌
క‌ల్కి 2898 ఏడీ మూవీ ఫ‌స్ట్ టికెట్‌

Kalki 2898 AD: ప్ర‌భాస్ హీరోగా న‌టించిన క‌ల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తోన్నారు. దీపికా ప‌దుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

క‌ల్కి 2898 ఏడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధ‌వారం ముంబాయిలో జ‌రిగింది. ఈ వేడుక‌లో క‌ల్కి మొద‌టి టికెట్‌ను నిర్మాత అశ్వ‌నీద‌త్ నుంచి బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్ 500 రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు. ఈ ఫ‌స్ట్ టికెట్‌ను క‌మ‌ల్‌హాస‌న్‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ గిఫ్ట్‌గా ఇచ్చారు.

నిర్మాత కాళ్ల‌కు న‌మ‌స్కారం...

క‌ల్కి ఫ‌స్ట్ టికెట్ కొన్న అనంత‌రం అశ్వ‌నీద‌త్ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేశారు అమితాబ్‌బ‌చ్చ‌న్‌. అశ్వ‌నీద‌త్ లాంటి ప్రొడ్యూస‌ర్‌ను తాను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేద‌ని, క‌ల్కి మూవీ షూటింగ్‌లో అంద‌రి కంటే ముందు సెట్స్‌కు అశ్వ‌నీద‌త్ వ‌చ్చేవార‌ని, ఎప్పుడు సెట్స్‌లోనే ఉండేవార‌ని అమితాబ్‌బ‌చ్చ‌న్ అన్నాడు. ఆయ‌న లాంటి గొప్ప నిర్మాత‌ను చూడ‌లేద‌ని అన్నాడు. అమితాబ్ త‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌గానే తిరిగి...అమితాబ్ పాదాల‌కు అశ్వ‌నీద‌త్ న‌మ‌స్కారం చేశారు.

క‌మ‌ల్‌కు ఫ‌స్ట్ టికెట్ గిఫ్ట్‌...

క‌ల్కి ఫ‌స్ట్ టికెట్‌ను అమితాబ్ నుంచి తీసుకున్న క‌మ‌ల్‌హాస‌న్ ఎగ్జైటింగ్‌గా ఫీల‌య్యారు. అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన షోలే మూవీ టికెట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురుచూసిన సంగ‌తుల్ని గుర్తుచేసుకున్నారు.

త‌క్కువ‌గా మాట్లాడిన ప్ర‌భాస్‌...

క‌ల్కి 2898 ఏడీ ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌భాస్ చాలా త‌క్కువ‌గా మాట్లాడారు. అత‌డిపై దీపికా ప‌దుకోణ్‌తో పాటు అమితాబ్‌, రానా సెటైర్స్ వేస్తూ ఈ ఈవెంట్‌లో క‌నిపించారు. ప్ర‌భాస్ రెండు లైన్స్ మాట్లాడ‌టాన్ని మ‌నం సెల‌బ్రేట్ చేసుకోవాల్సిందే అంటూ పంచ్‌లు వేసి న‌వ్వించింది.

వీడియో కాల్‌లో ద్వారా క‌థ విన్న దీపిక‌...

క‌ల్కి క‌థ‌ను త‌న‌కు లాక్‌డౌన్ టైమ్‌లో వీడియో కాల్ ద్వారా నాగ్ అశ్విన్ వినిపించాడ‌ని దీపికా ప‌దుకోణ్ అన్న‌ది. ఈ సినిమాలో తాను త‌ల్లి క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. క‌ల్కి త‌ర్వాత అవ‌కాశాలు వ‌స్తే త‌ప్ప‌కుండా మ‌రిన్ని తెలుగు సినిమాలు చేస్తాన‌ని దీపికా ప‌దుకోణ్ ఈ ప్రీ రిలీజ్ వేడుక‌లో చెప్పింది.

విల‌న్ రోల్‌పై క్లారిటీ...

క‌ల్కి 2898 ఏడీలో విల‌న్ రోల్‌లో న‌టించ‌డంపై క‌మ‌ల్‌హాస‌న్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ పేరును ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క‌మ‌ల్ హాస‌న్ రివీల్ చేశాడు. సుప్రీమ్ యాస్కిన్ అనే క్యారెక్ట‌ర్‌తాను తాను క‌నిపించ‌బోతున్న‌ట్లు క‌మ‌ల్ తెలిపాడు. ఇందులో మంచి ప‌నులు చేసే చెడ్డ‌వాడిగా తాను క‌నిపిస్తాన‌ని ఇన్‌డైరెక్ట్‌గా విల‌న్ రోల్‌పై క‌మ‌ల్‌హాస‌న్ హింట్ ఇచ్చాడు. కాంప్లెక్స్ వ‌ర‌ల్డ్‌కు అధిప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ఈ మూవీలో క‌నిపిస్తాడ‌ని, అత‌డి పాత్ర నిడివి ఇర‌వై నిమిషాల లోపే ఉంటుంద‌ని స‌మాచారం.

క‌ల్కి క్యారెక్ట‌ర్‌లోనే...

క‌ల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీపికా ప‌దుకోణ్‌న్‌పై రానా చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుక‌కు బేబీ బంప్‌తో దీపికా హాజ‌రైంది. క‌ల్కి మూవీలో దీపికా ప‌దుకోణ్ ప్రెగ్నెంట్ ఉమెన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. షూటింగ్ పూర్త‌యినా క‌ల్కి క్యారెక్ట‌ర్‌లోనే దీపికా ప‌దుకోణ్ ఉంద‌ని ఫ‌న్నీగా కామెంట్స్ చేశాడు.

WhatsApp channel