Kalki 2989 Ad: అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆస్కార్ విన్నింగ్ మూవీని దాటేసిన ప్రభాస్ కల్కి - బుజ్జిని నడిపిన ఆనంద్ మహీంద్ర
Kalki 2989 Ad: ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆర్ఆర్‌ఆర్ రికార్డును ప్రభాస్ కల్కి 2898 ఏడీ బ్రేక్ చేసింది. అతి తక్కువ టైమ్‌లోనే వన్ మిలియన్ మార్కును దాటిన మూవీగా ప్రభాస్ కల్కి నిలిచింది.
Kalki 2989 Ad: ప్రభాస్ కల్కి మూవీ రికార్డుల వేట మొదలైంది. రిలీజ్‌కు మరో రెండు వారాల ముందే ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డును కల్కి బ్రేక్ చేసింది. కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్‌సీస్‌లో ఇటీవలే మొదలయ్యాయి. అమెరికాతో పాటు పలు దేశాల్లో హాట్‌కేకుల్లా ఈ మూవీ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కల్కి 2898 ఏడీ ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ అప్పుడే వన్ మిలియన్ మార్కును దాటేసింది.

అతి తక్కువ టైమ్‌లో...
అతి తక్కువ టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవర్‌సీస్‌లో వన్ మిలియన్ రాబట్టిన మూవీగా కల్కి నిలిచింది. గతంలో ఈ రికార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ పేరిట ఉంది. ఆర్ఆర్ఆర్ కంటే తక్కువ రోజుల్లోనే అడ్వాన్స్ బుకింగ్స్‌లో వన్ మిలియన్‌ను దాటేసిన కల్కి కొత్త రికార్డును నెలకొల్పింది.
రెండు మిలియన్ల మార్కు...
రిలీజ్ లోగా ఓవర్‌సీస్‌లో కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్ల మార్కును దాటేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టే ఇండియన్ మూవీగా కల్కి నిలవడం ఖాయమని చెబుతోన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 20 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
టికెట్ల రేట్లు పెరగనున్నాయా?
తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ కల్కి మూవీ టికెట్ల ధరలు పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ల రేట్లపై తుది నిర్ణయం వెల్లడైన తర్వాతే కల్కి అడ్వాన్స్ బుకింగ్స్‌పై ఓ క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బుజ్జి కోసం ఏడు కోట్లు...
కాగా కల్కి మూవీ ప్రమోషన్స్‌ను దేశవ్యాప్తంగా డిఫరెంట్‌గా చేస్తోన్నారు. కల్కిలో ప్రభాస్ ఉపయోగించే కారు కూడా సినిమాలో కీలకంగా నిలవబోతుంది. . దాదాపు ఏడు కోట్ల ఖర్చుతో ఈ కారును సినిమా యూనిట్ ప్రత్యేకంగా తయారు చేయించింది. ఈ కారుకు బుజ్జి అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాల్లో తిప్పుతూ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది యూనిట్.
ఈ స్పెషల్ కారును సినీ ప్రముఖులతో పాటు స్పోర్ట్స్ సెలిబ్రిటీస్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా బుజ్జిని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా నడిపారు. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్ర పేరుతో చిత్ర యూనిట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఈ బుజ్జి రూపకల్పనలో మహీంద్ర గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ ఇంజీనిర్లు కూడా సహాయం చేశారు నాగ్ అశ్విన్ గతంలో వెల్లడించారు.
దీపికా...దిశా పటానీ...
కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమెతో పాటు దిశా పటానీ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సూపర్ హీరో మూవీలో విలక్షణ నటుడు కమల్‌హాసన్ విలన్‌గా కనిపించబోతున్నాడు.
బాలీవుడ్ దిగ్గజ అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు అరు వందల కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మాత అశ్వనీదత్ తెరకెక్కించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాల్లో ఒకటిగా కల్కి నిలిచింది.