Ileana Baby Bump : మెుదటిసారి తన బేబీ బంప్ వీడియో షేర్ చేసిన ఇలియానా
04 May 2023, 15:49 IST
- Ileana Baby Bump : తాను తల్లి కాబోతున్నానంటూ.. హీరోయిన్ ఇలియానా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి తన బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది.
ఇలియానా
కొన్ని రోజుల క్రితం తల్లిని కాబోతున్నానని హీరోయిన్ ఇలియానా(Ileana) షాక్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది నమ్మితే.. ఎక్కువ మంది మాత్రం.. అదేం లేదన్నట్టుగా లైట్ తీసుకున్నారు. తాజాగా తన బేబీ బంప్(Baby Bump) వీడియోను షేర్ చేసింది ఇలియానా. తాను తల్లి కాబోతున్నానని... ఇలియానా ప్రకటించింది. అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో ఈ వార్త కూడా బాగా వైరల్ అయింది. సోషల్ మీడియా(Social Media)లో అందరూ తండ్రి ఎవరు అంటు ప్రశ్నిస్తున్నారు.
ఏప్రిల్ 18న తల్లి కాబోతున్నాని ఇలియానా ప్రకటించింది. చిన్నారి డ్రెస్ ను సోషల్ మీడియాలో పెట్టి.. ఈ విషయాన్ని వెల్లడించింది. తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. తన చిన్నారి డార్లింగ్ ను కలిసేందుకు ఎదురుచూడటం తన వల్ల కావడం లేదని చెప్పుకొచ్చింది. ఈ వార్త బాగా వైరల్ అయింది. ఇలియానా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలుసు. పెళ్లికాకుండా పిల్లలు ప్లాన్ చేసిందా అని చర్చించుకున్నారు. కనీసం తండ్రి ఎవరో చెప్పాలని సోషల్ మీడియాలో ట్రోల్స్(Trolls) చేశారు. కానీ ఈ విషయాన్ని ఇలియానా పెద్దగా పట్టించుకోలేదు.
మెుదట్లో ఇలియానా పెట్టిన ఫొటోను ఏదో సినిమా ప్రమోషన్ కోసం అని అనుకున్నారు. కానీ తాజాగా వీడియోను షేర్ చేసేసరికి ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టైంది. తన బేబీ బంప్(Ileana Baby Bump)ని చూపిస్తూ.. వీడియోను రికార్డు చేసినట్టుగా ఉంది. పక్కనే పెంపుడు కుక్క పడుకుని ఉండగా.. ఇలియానా తన చేతిలో కాఫీ కప్పును పట్టుకుని.. తన బేబీ బంప్ ను ప్రదర్శించింది. ఇదంతా సరే.. కానీ బిడ్డకు తండ్రి ఎవరనే దానిపై మాత్రం చర్చ నడుస్తూనే ఉంది. గతంలో ఆస్ట్రేలియా ఫొటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసిన ఇలియానా, ఆ తర్వాత విడిపోయింది.
ఈ మధ్య నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఇలియానా రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ కలిసి ... కత్రినా, విక్కీ తదితరులతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. ఇలియానా మాత్రం.. తన రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. కానీ బేబీ బంప్ షేర్ చేయడంపై మాత్రం చర్చ నడుస్తూనే ఉంది.
రామ్ పోతినేని సరసన దేవదాసు చిత్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో(Telugu Cinema Industry) ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. చాలా రోజులపాటు అగ్ర హీరోయిన్ గా నిలిచింది. స్టార్ హీరోలు, యువ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్ వెళ్లింది.