Tollywood Releases This Week: ఈ వారం రిలీజ‌య్యే తెలుగు సినిమాలు ఇవే - బాలీవుడ్‌లో టాలీవుడ్‌ హీరోల బాక్సాఫీస్ ఫైట్‌-here the list of telugu movies releasing in theatres this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /   Here The List Of Telugu Movies Releasing In Theatres This Week

Tollywood Releases This Week: ఈ వారం రిలీజ‌య్యే తెలుగు సినిమాలు ఇవే - బాలీవుడ్‌లో టాలీవుడ్‌ హీరోల బాక్సాఫీస్ ఫైట్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 17, 2023 06:25 AM IST

Tollywood Releases This Week: ఈ వారం థియేట‌ర్ల ద్వారా సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష‌తో పాటు మ‌రో మూడు చిన్న సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

సాయిధ‌ర‌మ్‌తేజ్
సాయిధ‌ర‌మ్‌తేజ్

మెగా హీరో వ‌ర్సెస్ మెగా హీరో

విరూపాక్ష(Virupaksha)సినిమాతో ఫ‌స్ట్ టైమ్ పాన్ ఇండియ‌న్ హీరోగా త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోబోతున్నాడు మెగా వార‌సుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.విరూపాక్ష సినిమాకు అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చారు.

రుద్ర‌వ‌నం అనే ఊరిలో జ‌రిగే అనూహ్య హ‌త్య‌ల వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించే యువ‌కుడిగా ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ క‌నిపించ‌బోతున్నాడు. సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ వారం టాలీవుడ్‌లో ఇదే పెద్ద సినిమా కావ‌డంతో సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు తెలుగులో ఎలాంటి పోటీ లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఏప్రిల్ 21న‌ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా రిలీజ్ అవుతోంది.

స‌ల్మాన్ ఖాన్ సినిమాకు పోటీగా హిందీలో విరూపాక్ష‌కు థియేట‌ర్ల‌కు దొర‌క‌డం చాలా క‌ష్ట‌మే. కిసి కా భాయ్ కిసీ కీ జాన్‌ సినిమాలో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ (Venkatesh) కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నారు. ఏంట‌మ్మా పాట‌లో గెస్ట్ రోల్‌లో రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) క‌నిపించ‌బోతున్నాడు. విరూపాక్ష‌తో బాలీవుడ్‌లో తెలుగు హీరోల‌తోనే సాయిధ‌ర‌మ్‌తేజ్ పోటీప‌డ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మూడు చిన్న సినిమాలు రిలీజ్‌

విరూపాక్ష‌తో పాటు ఈ వారం మూడు చిన్న సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. గార్గేయి ఎల్లా ప్ర‌గ‌డ హీరోయిన్‌గా సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కిన హ‌లో మీరా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు శ్రీనివాస్ కాక‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీకాంత్‌చౌట‌ప‌ల్లి, ప‌విత్రా నారాయ‌ణ‌న్ జంట‌గా న‌టించిన 10 రూపీస్ సినిమా ఏప్రిల్ 21న విడుద‌ల‌కాబోతుంది. ఈసినిమాకు ఆఫ్జ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వీటితో పాటుగా భ‌క్తి ప్ర‌ధాన సినిమా క‌లియుగ భ‌గ‌వాన్ ఈ వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.