Telugu News  /  Sports  /  Katrina Kaif Vs Habhajan Singh As The Bollywood Beauty Hit A Six In Bhajjis Bowing
బ్యాట్ పట్టుకున్న కత్రినా కైఫ్
బ్యాట్ పట్టుకున్న కత్రినా కైఫ్

Katrina Kaif vs Habhajan Singh: హర్భజన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన కత్రినా కైఫ్

31 October 2022, 18:47 ISTHari Prasad S
31 October 2022, 18:47 IST

Katrina Kaif vs Habhajan Singh: హర్భజన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టింది బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌. అది కూడా గెలవాలంటే చివరి బంతికి సిక్స్‌ కొట్టాల్సిన సమయంలో భారీ షాట్‌ ఆడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Katrina Kaif vs Habhajan Singh: బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ బ్యాట్‌ పట్టుకుంది. అంతేకాదు స్టార్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లోనే సిక్స్‌ కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆమె సిక్స్‌ కొట్టింది క్రికెట్‌ ఫీల్డ్‌లో కాదు. స్టార్‌స్పోర్ట్స్‌ స్టూడియోలో. ఆదివారం (అక్టోబర్‌ 30) ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌ సందర్భంగా స్టూడియోకు గెస్ట్‌గా వచ్చిన కత్రినా కైఫ్‌.. సరదాగా క్రికెట్‌ ఆడింది. ఆమెతోపాటు బాలీవుడ్‌ నటుడు ఇషాన్ ఖట్టర్‌ కూడా వచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

తన నెక్ట్స్‌ మూవీ ఫోన్‌ బూత్‌ ప్రమోషన్లలో భాగంగా ఆమె స్టూడియోకి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పిచ్‌పై ఆమె క్రికెట్‌ ఆడింది. ఈ సందర్భంగా భజ్జీ బౌలింగ్ చేయగా.. కత్రినా బ్యాటింగ్‌ చేసింది. తొలి మూడు బాల్స్‌కు మామూలు షాట్లు ఆడిన ఆమె.. నాలుగో బంతికి ఫోర్‌ కొట్టింది. ఇక చివరి బాల్‌కు సిక్స్‌ కొడితే గెలుస్తావని భజ్జీ అన్నాడు.

అతడు అన్నట్లుగానే చివరి బాల్‌కు భారీ షాట్‌ ఆడింది. స్టూడియోలో సరదాగా సాగిన ఈ ఆటలో కత్రినా తన క్రికెటింగ్‌ స్కిల్స్‌ చూపించింది. ఈ వీడియోను స్టార్‌స్పోర్ట్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసింది. మా దగ్గర ఓ కొత్త క్రికెట్‌ స్టార్‌ ఉంది అనే క్యాప్షన్‌తో స్టార్‌స్పోర్ట్స్‌ ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌ మొదలయ్యే ముందు షోలో కత్రినా సందడి చేసింది. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే ఇందులో 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే. ఈ లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో మొదట సూర్యకుమార్‌ మెరుపు హాఫ్ సెంచరీతో ఇండియా 133 రన్స్‌ చేయగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది. మార్‌క్రమ్‌, మిల్లర్‌ హాఫ్ సెంచరీలు చేశారు.