Horror Mystery OTT: నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న హారర్ మిస్టరీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
10 September 2024, 8:43 IST
- Horror Mystery OTT: ఓటీటీలోకి నాలుగేళ్ల తర్వాత ఓ హారర్ మిస్టరీ మూవీ రాబోతుండటం విశేషం. 2020లో రిలీజైన ఈ ఇంగ్లిష్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్లలో అంతంతమాత్రమే ఆడిన ఈ సినిమాకు ఓటీటీలో ఎంతమేర ఆదరణ దక్కుతుందో చూడాలి.
నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న హారర్ మిస్టరీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Horror Mystery OTT: హారర్ జానర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి మరో సినిమా వచ్చేస్తోంది. నిజానికి థియేటర్లలో రిలీజైన నాలుగేళ్ల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. హారర్ కు మిస్టరీని జోడించి వచ్చిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
ది రెంటల్ ఓటీటీ రిలీజ్ డేట్
ఈ హాలీవుడ్ హారర్ మిస్టరీ మూవీ పేరు ది రెంటల్. ఈ సినిమా 2020లో రిలీజై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ సినిమా వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు పెద్దగా తెలియని, ప్రత్యేకమైన సినిమాలను తన ఓటీటీలోకి తీసుకొస్తుందని ఈ లయన్స్‌గేట్ ప్లేకు పేరుంది.
ఇప్పుడు ది రెంటల్ మూవీతో అదే నిరూపించింది. నాలుగేళ్ల కిందట రిలీజైనా.. ఈ హారర్ మిస్టరీ మూవీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. జెరెమీ అలెన్ వైట్, అలీసన్ బ్రీ, డాన్ స్టీవెన్స్, షీలా వాండ్, ఆంథోనీ మొలినరీ నటించారు.
ది రెంటల్ స్టోరీ ఏంటి?
ది రెంటల్ మూవీ రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. తమ బిజీ జీవితాల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వీళ్లు అందరికీ దూరంగా ఓ కొండపై ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటారు. అయితే తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవడానికి అక్కడికి వెళ్లిన వాళ్లకు ఊహించని ఘటనలు సవాలుగా మారతాయి.
ఆ వెకేషన్ కాస్తా ఓ పీడకలగా మారిపోతుంది. దాన్నుంచి వాళ్లు తప్పించుకుంటారా లేదా? చివరికి ఏం జరుగుతుంది అన్నది మూవీలో చూడొచ్చు. డేవ్ ఫ్రాంకో డైరెక్ట్ చేసిన ఈ సినిమా నాలుగేళ్ల కిందట కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజైంది. అయితే ఇప్పుడు లయన్స్ గేట్ ప్లే ద్వారా మరింత హారర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకుల దగ్గరికి చేరనుంది.
ఓటీటీలోకి మరో హారర్ మూవీ
ఓటీటీలోకి మరో హారర్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇదొక అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ. ఈ సినిమా పేరు టారట్ (Taort). ఈ ఏడాది మే 3న రిలీజైన ఈ సినిమా నాలుగు నెలల తర్వాత తెలుగు, తమిళం భాషల్లోనూ రావడం విశేషం. ఇప్పటికే ఇంగ్లిష్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
తెలుగులోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మూవీ ఫ్రీగా చూసే అవకాశం లేదు. తెలుగులో చూడాలంటే మాత్రం రూ.119 రెంట్ చెల్లించాల్సిందే. ఇంగ్లిష్ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. తెలుగుతోపాటు తమిళంలోనూ సోమవారం (సెప్టెంబర్ 9) నుంచి ఈ టారట్ మూవీ చూసే వీలు కల్పించారు.