Horror Movie OTT: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ.. తెలుగు నటి నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?-horror movie ott avanthika vandanapu starrer tarot now streaming on amazon prime video in telugu and tamil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Movie Ott: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ.. తెలుగు నటి నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?

Horror Movie OTT: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ.. తెలుగు నటి నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Sep 09, 2024 05:22 PM IST

Horror Movie OTT: సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. నాలుగు నెలల కిందట థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ.. తెలుగు నటి నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?
తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ అమెరికన్ హారర్ మూవీ.. తెలుగు నటి నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?

Horror Movie OTT: ఓటీటీలోకి మరో హారర్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇదొక అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ. ఈ సినిమా పేరు టారట్ (Taort). ఈ ఏడాది మే 3న రిలీజైన ఈ సినిమా నాలుగు నెలల తర్వాత తెలుగు, తమిళం భాషల్లోనూ రావడం విశేషం. ఇప్పటికే ఇంగ్లిష్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

తెలుగులో వచ్చిన టారట్

హారర్ మూవీ టారట్ తెలుగులోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మూవీ ఫ్రీగా చూసే అవకాశం లేదు. తెలుగులో చూడాలంటే మాత్రం రూ.119 రెంట్ చెల్లించాల్సిందే.

ఇంగ్లిష్ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. తెలుగుతోపాటు తమిళంలోనూ సోమవారం (సెప్టెంబర్ 9) నుంచి ఈ టారట్ మూవీ చూసే వీలు కల్పించారు.

టారట్ మూవీ ఎలా ఉందంటే?

టారట్ ఓ సూపర్ నేచురల్ హారర్ మూవీ. ఈ సినిమా ఈ ఏడాది మే 3న రిలీజైంది. 8 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన టారట్ మూవీ.. ఏకంగా 49 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. స్పెన్సర్ కోహెన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హారియెట్ స్లేటర్, అడైన్ బ్రాడ్లీ, అవంతిక వందనపు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

1992లో వచ్చిన హారర్‌స్కోప్ నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి ఓ మ్యాన్షన్‌కు వెళ్లిన కొందరు కాలేజీ ఫ్రెండ్స్.. అక్కడి టారట్ కార్డులతో తమ భవిష్యత్తు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అనూహ్యంగా ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుంటారు. వాళ్లు అసలు అలా ఎందుకు కన్ను మూస్తున్నారు? ఈ మిస్టరీని మిగిలిన వాళ్లు ఛేదించారు అన్నది ఈ మూవీలో చూడొచ్చు.

ఈ హారర్ మూవీలో భారత సంతతికి చెందిన అమెరికన్ నటి అవంతిక వందనపు కూడా నటించింది. 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె.. ఈ టారట్ మూవీలో పేజ్ అనే పాత్రలో కనిపించింది.