Netflix Crime Thriller Movie: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Netflix Crime Thriller: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. 12th ఫెయిల్ మూవీ హీరో నటించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మూవీపై ఎంతో ఆసక్తి రేపేలా ఉంది.
Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఓ సీరియల్ కిల్లర్, పోలీస్ అధికారి చుట్టూ తిరిగే ఈ కథ వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 12th ఫెయిల్ మూవీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విక్రాంత్ మస్సీ నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. మూవీ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది.
సెక్టార్ 36 స్ట్రీమింగ్ డేట్
నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న ఈ సినిమా పేరు సెక్టార్ 36. వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. గత వారమే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 12th ఫెయిల్ మూవీలో ఐఏఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ పాత్రలో జీవించేసిన విక్రాంత్.. ఈ తాజాగా మూవీలో ఓ సీరియల్ కిల్లర్ గా పూర్తి భిన్నమైన పాత్ర పోషించాడు.
ఆదిత్య నింబాల్కర్ ఈ సెక్టార్ 36 మూవీని డైరెక్ట్ చేశాడు. మ్యాడక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. ట్రైలర్ తోనే ఎంతో ఆసక్తి రేపిన ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో దీపక్ దోబ్రియాల్ పోలీస్ అధికారిగా నటించాడు.
సీరియల్ కిల్లర్ మూవీ
సీరియల్ కిల్లర్ పాత్రతో వచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా వస్తున్న సెక్టార్ 36 మూవీ కూడా నిఠారీ కేస్ ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీలో సీరియల్ కిల్లర్ గా విక్రాంత్ మస్సీ నటించగా.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ పాండే పాత్రలో దీపక్ దోబ్రియాల్ కనిపించాడు.
ఉత్తర భారతంలోని ఓ స్లమ్ ఏరియాలో వరుసగా పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్లను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరుకుతుంటాడా సీరియల్ కిల్లర్. ఈ సవాలును పోలీసులు ఎలా తీసుకున్నారు? చివరికి ఆ కిల్లర్ ను ఎలా పట్టుకున్నారన్నది ఈ మూవీ స్టోరీ.
నిఠారీ కేస్ ఏంటి?
భారతదేశ క్రైమ్ చరిత్రలో ఎంతో భయానకమైనది ఈ నిఠారీ కేస్. 2006లో జరిగిన ఈ ఘటన మొత్తం దేశాన్ని భయంతో వణికించింది. నోయిడా సమీపంలోని నిఠారీ అనే ఊళ్లో ఎన్నో అస్తిపంజరాలు దొరకడం అప్పట్లో సంచలనం రేపింది. అవి అప్పటి వరకూ తప్పిపోయినట్లు కేసు నమోదు అయిన చిన్నారలవే అని తర్వాత తేలింది.
ప్రముఖ వ్యాపారవేత్త మొనిందర్ సింగ్, అతని ఇంట్లో పని చేసే సురీందర్ కోలీ ఇళ్ల దగ్గరి నాలాలో ఆ పిల్లలకు చెందిన ఎముకలు దొరికాయి. వాళ్లపై లైంగిక దాడి చేసి తర్వాత హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అలాంటి కేసును ఇప్పుడు సెక్టార్ 36 పేరుతో సినిమాగా రూపొందించారు. ఇందులో ప్రేమ్ సింగ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో అతడు నటించాడు.
ఇప్పుడీ సెక్టార్ 36 క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ నెలకు రూ.199 కనీస సబ్‌స్క్రిప్షన్ తో అందుబాటులో ఉంది.