Avantika Vandanapu: సమంత-నాగ చైతన్యపై బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక కామెంట్స్.. నెపోటిజంపై యుద్ధం చేయాలంటూ!-mean girls actress avantika vandanapu comments on samantha naga chaitanya and nepotism colourism in bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avantika Vandanapu: సమంత-నాగ చైతన్యపై బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక కామెంట్స్.. నెపోటిజంపై యుద్ధం చేయాలంటూ!

Avantika Vandanapu: సమంత-నాగ చైతన్యపై బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక కామెంట్స్.. నెపోటిజంపై యుద్ధం చేయాలంటూ!

Sanjiv Kumar HT Telugu

Avantika Vandanapu About Samantha Naga Chaitanya: బ్రహ్మోత్సవం సినిమాతో పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది. ఇటీవల ఓ ఇంటరివ్యూలో నెపోటిజం, కలర్‌పై వివక్షతతోపాటు సమంత, నాగ చైతన్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది అవంతిక వందనపు.

సమంత, నాగ చైతన్యపై హాలీవుడ్ స్టార్ అవంతిక కామెంట్స్.. నెపోటిజం, కలరిజంతో యుద్ధం చేయాలంటూ!

Avantika Vandanapu About Nepotism: దాదాపు సౌత్ ఆసియాల నటించే వారందకు భారతీయ సంతతికి చెందినవారే ఉంటారు. బ్రిడ్జర్టన్, వన్ డే, సిటాడెల్ వంటి గ్లోబల్ రేంజ్ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన సిమోన్ ఆషేలీ, అంబికా మోడ్, ప్రియాంక చోప్రా తర్వాత మరోసారి భారత్‌కు చెందిన అమ్మాయి పేరు మారుమోగిపోతుంది. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన అవంతిక కుందనపు ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది.

అమెరికన్ టీనేజ్ కామెడీ సిరీస్ మీన్ గర్ల్స్‌లో కరెన్ శెట్టిగా నటించి అవంతిక వందనపు మంచి పేరు తెచ్చుకుంది. కాలిఫోర్నియాలోని భారతీయ కుటుంబంలో జన్మించిన 19 ఏళ్ల అవంతిక తెలుగులో 2016లో బ్రహ్మోత్సవంతో ఎంట్రీ ఇచ్చి ప్రేమమ్, భూమిక అనే సినిమాల్లో నటించింది. ఇప్పుడు హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా జోనాస్ (సిటాడెల్), సిమోన్ ఆషేలీ (బ్రిడ్జర్టన్), అంబికా మోడ్ (వన్ డే) వంటి భారత సంతతికి చెందిన మహిళా నటీమణుల్లో ఒకరిగా పేరుకెక్కింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవంతిక వందను ఆసక్తికర కామెంట్స్ చేసింది. "అందం, ప్రతిభ ఉన్న మహిళలు వచ్చి చాలా కాలం అయింది. మనమంతా 1.5 బిలియన్ల జనాభా కలిగిన మన దేశాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పే సమయం వచ్చింది. భారతీయ మహిళలు హాలీవుడ్‌లో స్టార్స్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ జాబితాలో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. మాటిల్డ నాకు సినిమాలపై ఆసక్తి కలిగేలా చేసింది. 3 ఇడియట్స్‌ ఒక క్లాసిక్. నా దృష్టిలో అది చాలా పెద్ద సినిమా" అని అవంతిక తెలిపింది.

తనకు మీన్ గర్ల్స్ అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన అవంతిక మహేష్ బాబు బ్రహ్మోత్సవంతోపాటు తెలుగులో చేసిన ప్రేమమ్, మనమంతా, తమిళంలోని భూమిక సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. భూమిక సినిమా సమయంలో తనకు పదేళ్లు అని, అప్పుడు జరిగిన విషయాలు అంతగా గుర్తు లేవని అవంతిక తెలిపింది. కానీ, బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలు తెలిపింది అవంతిక వందనపు.

సమంత, కాజల్ అగర్వాల్, నాగ చైతన్య (ప్రేమమ్) తనను ఎప్పుడు సపోర్ట్ చేసేవారని అవంతిక చెప్పింది. "సమంత, కాజల్ అగర్వాల్ ఎంతో లవ్లీ, చాలా మంచివారు. అప్పుడే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ యువతి పట్ల సమంత చూపిన ప్రేమ, అభిమానం చాలా గొప్పది. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆమె నాపై చూపించిన ఆప్యాయత నాకు ఎంతో అపారమైనది. సమంత ఇప్పుడు చాలా గొప్ప పనులు చేస్తుంది. కాజల్ కూడా అలాగే. వారిని సక్సెస్ చాలా స్ఫూర్తిదాయకం" అని అవంతిక తెలిపింది.

"సెట్‌లో నాగ చైతన్య గారు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. అది నాకు బాగా గుర్తు ఉంది" అని అవంతిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే అవంతిక వందనపు ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిరీస్ ఎ క్రౌన్ ఆఫ్ విషెస్, అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న నిత్యా మెహ్రా బిగ్ గర్ల్స్ డోంట్ క్రై చేస్తున్నట్లు అవంతిక తెలిపింది. దీంతో హిందీలోకి అవంతిక ఎంట్రీ ఇవ్వనుంది.

"భారతదేశంలో పనిచేయడానికి 100 శాతం ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఇది భిన్నమైంది. నెపోటిజం, కలరిజం (వర్ణవాదం) వంటి వాటితో ప్రతిభకు మించి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది నాకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను కొన్ని వారాల్లో బిగ్ గర్ల్స్ డోంట్ క్రై పేరుతో నిత్యా మెహ్రా ద్వారా అమెజాన్ ప్రైమ్ షోతో రాబోతున్నాను. అది OTTలో ఉన్నప్పటికీ బాలీవుడ్‌లో నా అరంగేట్రం అవుతుందని ఆశిస్తున్నాను" అని అవంతిక చెప్పుకొచ్చింది. కాగా గత నెలలో భారతీయ థియేటర్లలో మీన్ గర్ల్స్‌ని విడుదల చేసింది పారామౌంట్ పిక్చర్స్ సంస్థ.