OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు హిందీ సినిమాలు.. ఓ బ్లాక్‍బస్టర్, మూడు డిజాస్టర్లు
11 October 2024, 21:05 IST
- OTT Movies: ఈవారం ఓటీటీల్లోకి నాలుగు హిందీ చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. డిఫరెంట్ జానర్లలో అడుగుపెట్టాయి. అందులో ఓ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. మరో మూడు కలెక్షన్లను సరిగా దక్కించుకోలేకపోయాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీల్లోకి వచ్చాయంటే..
OTT Bollywood Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు బాలీవుడ్ సినిమాలు.. హారర్ నుంచి యాక్షన్ వరకు డిఫరెంట్ జానర్లలో..
ఓటీటీల్లో నయా బాలీవుడ్ చిత్రాలు చూడాలనుకుంటున్నారా.. ఈ వారం నాలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. దసరా పండుగ ఉన్న ఈ వారంలో ఈ చిత్రాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘స్త్రీ’ చిత్రం రెంట్ తొలగిపోయి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు ఈ వారమే వచ్చింది. ఈ హారర్ కామెడీ మూవీతో పాటు మరో మూడు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి డిఫరెంట్ జానర్లలో ఉన్నాయి. ఈ వారం (అక్టోబర్ 2వ వారం) ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు హిందీ సినిమాలు ఏవి.. ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
స్త్రీ 2
బాలీవుడ్ స్టార్స్ శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రలు హారర్ కామెడీ మూవీ ‘స్త్రీ 2’ భారీ కలెక్షన్లతో రికార్డులను బద్దలుకొట్టింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.860కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అంచనాలకు మించి అద్భుతం చేసింది. స్త్రీ 2 చిత్రం ఈ గురువారం (అక్టోబర్ 10) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంతకు ముందే ప్రైమ్ వీడియోలోకి వచ్చినా రెంట్ ఉండేది. ఇప్పుడు రెంట్ తొలగిపోయి మామూలుగా స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. దీంతో ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరూ స్త్రీ2 మూవీని చూడొచ్చు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.
సర్ఫిరా
మంచి ప్రశంసలు అందుకున్న తమిళ సినిమా సురారై పోట్రు (తెలుగులో ఆకాశమే హద్దురా)కు హిందీ రీమేక్‍గా సర్ఫిరా’ చిత్రం రూపొందింది. ఈ డ్రామా మూవీలో అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, రాధికా మదన్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుధా కొంగరనే హిందీలో సర్ఫిరాను కూడా తెరకెక్కించారు. థియేటర్లలో జూలై 12న ఈ మూవీ రిలీజైంది. అయితే, సుమారు రూ.30కోట్ల కలెక్షన్లనే దక్కించుకొని ప్లాఫ్ అయింది. సర్ఫిరా చిత్రం నేడు (అక్టోబర్ 11) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
వేదా
జాన్ అబ్రహాం హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ వేదా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సుమారు రూ.26కోట్ల వసూళ్లే రాబట్టి నిరాశపరిచింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి రాగా మిక్స్డ్ టాక్ దక్కించుకొని.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకోలేదు. వేదా సినిమా అక్టోబర్ 10న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ఖేల్ ఖేల్ మే
కామెడీ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’ అక్టోబర్ 10న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ప్రజ్యా జైస్వాల్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీకి ముదాసర్ అలీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రూ.100కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఖేల్ ఖేల్ మే చిత్రం సుమారు రూ.56 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.