Sarfira Day 1 Box office: అక్షయ్ కుమార్ సినిమాకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు.. నేషనల్ అవార్డ్ మూవీని రీమేక్ చేసినా..-sarfira day 1 box office collections akshay kumar movie makes very slow start ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarfira Day 1 Box Office: అక్షయ్ కుమార్ సినిమాకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు.. నేషనల్ అవార్డ్ మూవీని రీమేక్ చేసినా..

Sarfira Day 1 Box office: అక్షయ్ కుమార్ సినిమాకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు.. నేషనల్ అవార్డ్ మూవీని రీమేక్ చేసినా..

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 13, 2024 02:20 PM IST

Sarfira Day 1 Box office Collections: సర్ఫిరా సినిమాకు ఊహించని ఓపెనింగ్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీకి తొలి రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..

Sarfira Day 1 Box office: అక్షయ్ కుమార్ సినిమాకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు.. నేషనల్ అవార్డ్ మూవీని రీమేక్ చేసినా..
Sarfira Day 1 Box office: అక్షయ్ కుమార్ సినిమాకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు.. నేషనల్ అవార్డ్ మూవీని రీమేక్ చేసినా..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సర్ఫిరా చిత్రం ఈ శుక్రవారం (జూలై 12) థియేటర్లలో రిలీజ్ అయింది. జాతీయ అవార్డు దక్కించుకున్న సురారై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకు హిందీ రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కింది. ఆ మూవీని రూపొందించిన డైరెక్టర్ సుధా కొంగరనే సర్ఫిరాకు కూడా దర్శకత్వం వహించారు. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, సర్ఫిరా మూవీకి తొలి రోజు అనుకున్న విధంగా కలెక్షన్లు రాలేదు. బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది.

తొలి రోజు వసూళ్లు ఇవే

సర్ఫిరా చిత్రానికి ఇండియా మొత్తంలో తొలి రోజు కేవలం రూ.2.50 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ మూవీకి ఇలాంటి ఓపెనింగ్ రావడం షాకింగ్‍గా అనిపించింది. బుకింగ్స్ కూడా చాలా మందకొడిగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఈ మూవీకి ఫస్ట్ డే రూ.4కోట్ల వసూళ్లు వచ్చాయని అంచనా. 

సర్ఫిరా చిత్రానికి తొలి రోజు సగటున థియేటర్లలో ఆక్యుపెన్సీ 20 శాతం లోపే నమోదైంది. అయితే, ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు పుంజుకుంటాయని మూవీ టీమ్ ఆశిస్తోంది. ఒకవేళ వసూళ్లలో వృద్ధి రాకపోతే అక్షయ్ ఖాతాలో మరో ప్లాఫ్ పడుతుంది. ఇండియన్ 2 (హిందీలో హిందుస్థానీ 2) కూడా సర్ఫిరాకు పోటీగా శుక్రవారమే విడుదలైంది.

కల్కి 15వ రోజు కంటే తక్కువే..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రానికి 15వ రోజు ఇండియాలో సుమారు రూ.4 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే, సర్ఫిరా చిత్రానికి మాత్రం భారత్‍లో తొలి రోజు కేవలం రూ.2.50 కోట్ల నెట్ వసూళ్లే వచ్చాయి. దీంతో కల్కి తన 15వ రోజు సాధించిన వసూళ్లను కూడా ఫస్ట్ డే దక్కించుకోలేకపోయింది సర్ఫిరా. కాగా, కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1,000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది.

నేషనల్ అవార్డు మూవీకి రీమేక్‍గా..

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్ర పోషించిన సురారై పోట్రూ చిత్రం 2020లో నేరుగా ఓటీటీలోకే వచ్చినా చాలా ప్రశంసలను దక్కించుకుంది. అందరికీ అందుబాటు ధరల్లోకి విమాన ప్రయాణ ధరలను తీసుకొచ్చేందుకు కృషి చేసి ఓ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించిన జీఆర్.గోపీనాథ్ జీవితంపై ఈ చిత్రాన్ని సుధ కొంగర తెరకెక్కించారు. ఈ మూవీకి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడిగా సూర్యకు, ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళికి నేషనల్ అవార్డులు లభించాయి. ఈ మూవీకి రీమేక్‍గా సర్ఫిరా తెరకెక్కింది.

సర్ఫిరా చిత్రంలో అక్షయ్ కుమార్, రాధిక మదన్, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. సీమా బిస్వాస్, ఆర్.శరత్ కుమార్, సౌరభ్ గోయల్, కృష్ణకుమార్, ఐరావత్ హర్షే మాయాదేవ్, ప్రకాశ్ బెలావాడీ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి సుధ కొంగరనే డైరెక్షన్ చేశారు. ఈ మూవీని అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సూర్య, జ్యోతికి సంయుక్తంగా నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్, తనిష్క బాగ్చి, సుహిత్ అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు తీస్తుండగా.. వాటిలో ఎక్కువ శాతం ప్లాఫ్‍లుగా నిలుస్తున్నాయి. గతేడాది ఓఎంజీ 2 మినహా మిగిలిన చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది వచ్చిన బడే మియా చోటే మియా చిత్రం డిజాస్టర్ అయింది.

Whats_app_banner