Kalki 2898 AD OST: ఎట్టకేలకు కల్కి 2898 ఏడీ మూవీ ఓఎస్‍టీ వచ్చేసింది
Kalki 2898 AD OST: కల్కి 2898 ఏడీ మూవీ నుంచి ఓఎస్‍టీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో కూడిన ఓ సౌండ్‍ట్రాక్ వచ్చేసింది.
కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 15 రోజుల్లోనే రూ.1,000 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటి రికార్డు సృష్టించింది. ఈ మూవీ జోరు ఇంకా కొనసాగుతోంది. కల్కి 2898 ఏడీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం కూడా హైలైట్‍గా నిలిచింది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో కూడిన ఓఎస్‍టీని రిలీజ్ చేయనున్నట్టు సంతోష్ ఇటీవలే ప్రకటించినా.. ఆలస్యమైంది. అయితే, ఎట్టకేలకు నేడు (జూలై 12) ఈ ఓఎస్‍టీ వచ్చేసింది.
సుమారు 2 గంటలు
కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST)ని మూవీ టీమ్ నేడు తీసుకొచ్చింది. రెండు ట్రాక్‍ల్లో యూట్యూబ్‍లో ఈ ఓఎస్‍టీని రిలీజ్ చేసింది. కల్కి చిత్రంలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లతో కూడిన ఈ ఓఎస్‍టీ రెండు కలిపి సుమారు రెండు గంటల నిడివి ఉన్నాయి.
కల్కి చిత్రంలో కొన్ని చోట్ల బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. క్లైమాక్స్, మహాభారతం సీన్లు సహా కొన్ని సీన్లకు సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. దీంతో ఈ మూవీ ఓఎస్టీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అప్‍డేట్ ప్రకారం రెండు రోజుల క్రితమే రావాల్సి ఉన్నా.. ఆలస్యమవటంతో నిరాశ చెందారు. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఓఎస్టీ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో అన్ని పాటలను కూడా మ్యూజిక్ ప్లాట్‍ఫామ్‍ల్లో మూవీ టీమ్ అందుబాటులోకి తెచ్చింది.
రూ.1,000 కోట్లతో ప్రభాస్ రికార్డు
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. భారీ కలెక్షన్లను సాధించింది. 15 రోజుల్లోనే ఈ చిత్రం రూ.1,000 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. బాహుబలి 2 తర్వాత వేగంగా రూ.1000 కోట్ల మార్క్ చేరిన భారతీయ మూవీగా కల్కి రికార్డు సృష్టించింది. రెండు రూ.1,000 కోట్ల సినిమాలు సాధించిన ఏకైక దక్షిణాది నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. బాలీవుడ్‍లో షారూఖ్ ఖాన్ ఒక్కరే రెండు రూ.1,000 కోట్ల చిత్రాలను కలిగి ఉన్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. మహాభారతం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. కొత్త తరహా నరేషన్, అద్భుతమైన విజువల్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి చాలా మంది ప్రముఖుల వరకు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‍తో నిర్మించారు అశ్వినీదత్. ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే కల్కి 2 పనుల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఉన్నారు.