OTT Comedy Movie: ఆ సినిమా ఎక్కడ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ను నిలదీసిన నెటిజన్లు.. స్ట్రీమింగ్ డేట్‌పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్
Netflix OTT: ఖేల్ ఖేల్ మే సినిమా నేడు స్ట్రీమింగ్కు రావాల్సింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కనిపించలేదు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినా స్ట్రీమింగ్కు మాత్రం ఆ ఓటీటీ తీసుకురాలేదు. దీంతో నెటిజన్లు ప్రశ్నించారు. కొత్త స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ కామెడీ డ్రామా మూవీకి కలెక్షన్లు అంతమాత్రమే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ప్రజ్యా జైస్వాల్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అయినా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఖేల్ ఖేల్ మే సినిమా పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇప్పుడు, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలోనూ కన్ఫ్యూజ్ నెలకొంది. అయితే, మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
మూవీ ఎక్కడ అంటూ..
ఖేల్ ఖేల్ మే సినిమాను నేడు (అక్టోబర్ 9) స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ మూవీని చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు రెడీ అయ్యారు. అయితే, ఈ చిత్రం నేడు స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ మూవీ ఎక్కడ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఖేల్ ఖేల్ మే సినిమాను స్ట్రీమింగ్కు తీసుకురాకపోవటంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫీషియల్‌గా చెప్పిన రోజు కూడా తీసుకురాకపోతే ఎలా అంటూ రాసుకొస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం కోసం ఎదురుచూసిన కొందరికి నిరాశ ఎదురైంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని నిలదీశారు.
అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఓ రోజు ఆలస్యం
ఖేల్ ఖేల్ మే సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రేపు (అక్టోబర్ 10) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు వస్తుందని సోషల్ మీడియాలో టీ సిరీస్ వెల్లడించింది. దీంతో ఓ రోజు ఆలస్యంగా రేపు ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టనుంది. నెటిజన్లు ప్రశ్నించటంతో మేకర్స్ త్వరగా స్పందించి అప్డేట్ ఇచ్చారు.
ఖేల్ ఖేల్ మే మూవీకి ముదాసర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. అయితే, అనుకున్న స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాప్సి, ఫర్దీన్, ప్రగ్యాతో పాటు వాణికపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ఇషిత అరుణ్, కిరణ్ కుమార్, అల్కా కౌశల్ కీలకపాత్రలు పోషించారు.
ఖేల్ ఖేల్ మే కలెక్షన్లు
ఖేల్ ఖేల్ మే సినిమా సుమారు రూ.100కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. అయితే, ఈ మూవీకి దాదాపు రూ.56కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే దక్కాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, వాకావూ ఫిల్మ్స్, వైట్ వరల్డ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, విపు డీ షా, శశికాంత్ సిన్హా, అశ్విన్ వార్దే, రాజేశ్ బహ్ల్ ప్రొడ్యూజ్ చేశారు.
కాగా, తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ‘మత్తువదలరా 2’ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ శుక్రవారం అక్టోబర్ 11వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రితేశ్ రాణా దర్శకత్వం వహించారు. థియేటర్లలో సెప్టెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.