తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott Streaming: ఓటీటీలోకి హనుమాన్.. ఫ్యాన్స్‌కు మాత్రం తీవ్ర నిరాశే.. ఇదీ కారణం

Hanuman OTT Streaming: ఓటీటీలోకి హనుమాన్.. ఫ్యాన్స్‌కు మాత్రం తీవ్ర నిరాశే.. ఇదీ కారణం

Hari Prasad S HT Telugu

18 March 2024, 8:08 IST

google News
    • Hanuman OTT Streaming: హనుమాన్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అభిమానులు మాత్రం కాస్త అసంత‌ృప్తితోనే ఉన్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
ఓటీటీలోకి హనుమాన్.. ఫ్యాన్స్‌కు మాత్రం తీవ్ర నిరాశే.. ఇదీ కారణం
ఓటీటీలోకి హనుమాన్.. ఫ్యాన్స్‌కు మాత్రం తీవ్ర నిరాశే.. ఇదీ కారణం

ఓటీటీలోకి హనుమాన్.. ఫ్యాన్స్‌కు మాత్రం తీవ్ర నిరాశే.. ఇదీ కారణం

Hanuman OTT Streaming: రెండు నెలల నిరీక్షణ ఫలించి మొత్తానికి హనుమాన్ మూవీ ఆదివారం (మార్చి 17) ఉదయం నుంచి జీ5 (ZEE5) ఓటీటీలోకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చినా.. వాళ్లు మాత్రం నిరాశగానే ఉన్నారు. జీ5 ఓటీటీతోపాటు మేకర్స్ పైనా మండిపడుతున్నారు.

ఓటీటీలోకి హనుమాన్ కానీ..

హనుమాన్ మూవీ అయితే ఓటీటీలోకి వచ్చింది కానీ.. ఈ మూవీ రన్ టైమ్ థియేటర్లలో కంటే తక్కువగా ఉండటం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. థియేటర్లలో ఈ సినిమా సుమారు 2 గంటల 38 నిమిషాలుగా ఉంది. కానీ జీ5 ఓటీటీలో మాత్రం 2 గంటల 30 నిమిషాలే ఉండటం గమనార్హం. అంటే 8 నిమిషాల సినిమాను కట్ చేశారా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

నిజానికి థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే డిలీటెడ్ సీన్స్ సహా సినిమాలు వస్తుంటాయి. హనుమాన్ కూడా అలాగే రాబోతోందని వార్తలు వచ్చాయి. చివరికి చూస్తే థియేటర్లలో కంటే తక్కువ సమయంతో ఓటీటీలో రిలీజైంది. ఇక మూవీ సౌండ్ క్వాలిటీ విషయంలోనూ పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. ఆడియో క్వాలిటీ సరిగా లేదని కొందరు వాపోయారు.

డైలాగ్స్ సరిగా వినిపించకపోవడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సడెన్ గా ఎక్కువ సౌండ్ తో రావడంలాంటివి జరిగాయి. దీంతో సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేసినట్లుగా ఓటీటీల్లో చేయలేకపోతున్నామని అంటున్నారు. అంతేకాదు తెలుగు వెర్షన్ తో పోలిస్తే జియో సినిమాలోని హిందీ వెర్షన్ చాలా మెరుగ్గా ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు.

హనుమాన్ హిందీ వెర్షన్ శనివారమే (మార్చి 16) జియో సినిమాలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. అదే రోజు కలర్స్ సినీప్లెక్స్ లో కూడా టీవీ ప్రీమియర్ ముగిసింది. మరుసటి రోజు అంటే ఆదివారం (మార్చి 17) సడెన్ గా తెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి జీ5 ఓటీటీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాతే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయడం కూడా ఒక రకంగా అభిమానులను నిరాశకు గురి చేసింది.

టాప్ ట్రెండింగ్స్‌లో హనుమాన్

హనుమాన్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12 రిలీజైంది. అప్పుడు థియేటర్లలోకి వచ్చిన సమయంలో ఎంతలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యులు వచ్చాయో.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా అదే కనిపిస్తోంది. రెండు రోజులుగా సోషల్ మీడియా ఎక్స్ టాప్ ట్రెండింగ్స్ లో హనుమాన్ కూడా ఉంది. ఎంత అద్భుతమైన సినిమా ఇది అంటూ హనుమాన్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓటీటీలో చూసిన కొందరు ఇది కచ్చితంగా థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా అంటున్నారు. అసలు ఇలాంటి సూపర్ హీరో మూవీ ఇంతకు ముందెప్పుడూ రాలేదని ఒకరు అనగా.. ఇందులో తేజ సజ్జ నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని మరొకరు.. మూవీలో గూస్ బంప్స్ ఇచ్చే సీన్ ఇదే అని ఇంకొకరు తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు.

తదుపరి వ్యాసం