HanuMan OTT: ‘సమ్‍థింగ్ ఫన్’ అంటూ ఓటీటీ ప్రమోషన్లకు రెడీ అయిన హనుమాన్ హీరో తేజ సజ్జా
HanuMan Movie OTT Release: హనుమాన్ సినిమా ఓటీటీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓటీటీ ప్రమోషన్ల కోసం హీరో తేజా సజ్జా రెడీ అయ్యారు. ఈ విషయంపై ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు.
HanuMan Movie OTT: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషించి సూపర్ హీరో మూవీ హను-మాన్’ బ్లాక్ బస్టర్ అయింది. జనవరి 12వ తేదీన రిలీజై బంపర్ వసూళ్లను దక్కించుకుంది. తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. హనుమాన్ మూవీ టీమ్‍పై భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. హిందీ వెర్షన్ ఓటీటీ డేట్ ఖరారైనా.. ఇతర భాషల విషయంలో ఇంకా ఉత్కంఠ నెలకొంది.
హిందీ వెర్షన్ ప్రమోషన్ల కోసం తేజ
హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డేట్, టైమ్ ఇప్పటికే ఖరారయ్యాయి. హనుమాన్ హిందీలో మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. మార్చి 16వ తేదీనే హనుమాన్ హిందీలో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో, హిందీ వెర్షన్ ఓటీటీ కోసం ప్రమోషన్లను చేసేందుకు హీరో తేజ సజ్జా రెడీ అయ్యారు.
హనుమాన్ హిందీ వెర్షన్ ఓటీటీ ప్రమోషన్ల కోసం ముంబై చేరుకున్నారు తేజ సజ్జా. ఈ విషయాన్ని నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. “సమ్‍థింగ్ ఫన్ రానుంది” అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అఫీషియల్ జియో సినిమా అంటూ ట్యాగ్ చేశారు. దీంతో హనుమాన్ హిందీ ఓటీటీ వెర్షన్ కోసం ప్రమోషన్లను ఆయన రెడీ అయ్యారని తెలుస్తోంది. హిందీ వెర్షన్ ప్రీమియర్ గురించి వీడియోలు చేసే ఛాన్స్ ఉంది.
జీ5లో స్ట్రీమింగ్‍పై కొనసాగుతున్న ఉత్కంఠ
హనుమాన్ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రావాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు ఈ స్ట్రీమింగ్ డేట్ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ అప్‍డేట్ ఇచ్చారు. కానీ, ఇంకా జీ5లో స్ట్రీమింగ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. మార్చి 15న లేదా 16న ఈ సినిమా జీ5లో అడుగుపెడుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే, అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
హనుమాన్ మూవీ టీమ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 12) సమావేశం అయింది. తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. అమిత్ షాను హైదరాబాద్‍లో కలిశారు.
హనుమాన్ గురించి..
హనుమాన్ సినిమాలో హనుమంతు పాత్రలో తేజ సజ్జా నటించారు. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్, హనుమంతుడిని చూపించిన విధానం అందరినీ మెప్పించాయి. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు.