తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman 23 Days Collections: కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్న హనుమాన్.. రూ.300కోట్లకు చేరువలో..

HanuMan 23 Days Collections: కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్న హనుమాన్.. రూ.300కోట్లకు చేరువలో..

04 February 2024, 15:54 IST

google News
    • HanuMan 23 Days Box office Collections: హనుమాన్ సినిమాకు వసూళ్ల జోరు కొనసాగుతోంది. రికార్డులను సృష్టిస్తూ ఈ మూవీ ముందుకు సాగుతోంది. 23 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందంటే..
HanuMan 23 Days Collections: కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్న హనుమాన్.. రూ.300కోట్లకు చేరువలో..
HanuMan 23 Days Collections: కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్న హనుమాన్.. రూ.300కోట్లకు చేరువలో..

HanuMan 23 Days Collections: కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్న హనుమాన్.. రూ.300కోట్లకు చేరువలో..

HanuMan 23 Days Box office Collections: తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ (హను-మాన్) చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారం దాటినా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొదటి నుంచి పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. రికార్డులను నెలకొల్పుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతూనే ఉంది.

హనుమాన్ సినిమా 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.290 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 23వ రోజైన శనివారం ఈ చిత్రానికి సుమారు రూ.6.83 కోట్ల వసూళ్లు వచ్చాయి. 20 రోజులు దాటినా ఇంకా ఈ చిత్రం స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది.

రూ.300 కోట్లకు చేరువలో..

హనుమాన్ సినిమా రూ.300 కోట్ల మార్కుకు చేరువైంది. హనుమాన్ మూవీ 23 రోజుల కలెక్షన్ల వివరాలను ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. థర్డ్ సెంచరీకి ఈ చిత్రం దగ్గర్లో ఉందని రాసుకొచ్చారు.

సంక్రాంతి సీజన్‍లో రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా హనుమాన్ మూవీ ఇటీవలే చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆల్‍లైమ్ సంక్రాంతి బ్లాక్‍బాస్టర్ ‘హనుమాన్’ అంటూ ఇటీవలే మూవీ టీమ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

హనుమాన్ మూవీకి భారత్‍లోనే ఇప్పటి వరకు సుమారు రూ.225 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.140 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. హిందీలో సుమారు రూ.59 కోట్ల వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అలాగే, ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇంకా కలెక్షన్ల హోరు కొనసాగిస్తోంది. అమెరికాలో ఈ మూవీ 5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.

ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగ చిత్రాలు పోటీగా ఉన్నా హనుమాన్ మాత్రం అదగొట్టింది. అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ బ్లాక్‍బాస్టర్‌గా కొనసాగుతోంది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

అమెరికాలో టీమ్

హనుమాన్ మూవీ టీమ్ ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉంది. అమెరికాలో 5 మిలియన్ డాలర్ల మార్క్ దాటడంతో అక్కడి ప్రేక్షకులను కలిసేందుకు వెళ్లింది. హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరోయిన్ అమృత అయ్యర్, నిర్మాత నిరంజన్ రెడ్డి.. అమెరికాలోని వర్జినియాలో ఆడియన్స్‌ను కలిశారు.

హనుమంతుడి నుంచి ఉద్భవించిన రుధిర మణి వల్ల అతీత శక్తులు పొందే యువకుడు హనుమంతు పాత్రలో ఈ చిత్రంలో నటించారు తేజ సజ్జా. ఆ మణిని దక్కించుకునేందుకు వచ్చే విలన్‍ను అతడు ఎలా అడ్డుకున్నాడన్నదే ఈ మూవీలో ప్రధాన అంశం. ఈ చిత్రంలో ఆంజనేయుడిని దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించిన తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ప్రొడ్యూజ్ చేశారు. హనుమాన్‍కు సీక్వెల్‍ జై హనుమాన్ మూవీ 2025లో వస్తుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

తదుపరి వ్యాసం