Prasanth Varma: రాముడిగా ఆయనైతే బాగుంటుందనుకుంటున్నా: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-tollywood news thinking about mahesh babu for lord rama character says hanuman director prasanth varma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma: రాముడిగా ఆయనైతే బాగుంటుందనుకుంటున్నా: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Prasanth Varma: రాముడిగా ఆయనైతే బాగుంటుందనుకుంటున్నా: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 30, 2024 06:40 PM IST

HanuMan Director Prasanth Varma: హనుమాన్ సినిమా సీక్వెల్‍లో శ్రీరాముడి పాత్ర కోసం ఏ హీరో అయితే బాగుంటుందో చెప్పారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అలాగే, ఆంజనేయ స్వామిగా చిరంజీవి నటించడంపై కూడా ఆయన స్పందించారు. ఆ వివరాలివే..

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ

Jai HanuMan Movie: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వచ్చిన ఈ సూపర్ హీరో సినిమా ఇప్పటి వరకు రూ.270 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. ఇంకా హనుమాన్‍కు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. కాగా, హనుమాన్ చిత్రానికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ మూవీ రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

జై హనుమాన్ చిత్రంలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి. దీంతో ఈ చిత్రంలో శ్రీరాముడు, హనుమంతుడుగా ఎవరు నటిస్తారోనన్న ఉత్కంఠ ఉంది. ఈ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే, శ్రీరాముడి పాత్రకు ఏ హీరో అయితే బాగుంటుందని తాను అనుకున్నారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు.

జై హనుమాన్ మూవీలో శ్రీరాముడి పాత్రకు సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే బాగుంటుందని తాను అనుకుంటున్నట్టు గ్రేట్ఆంధ్రా యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

“రాముడి క్యారెక్టర్ నాకు మహేశ్ బాబుతో చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. నాకు ఆ విషయం మైండ్‍లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి” అని ప్రశాంత్ వర్మ చెప్పారు. మహేశ్ బాబు రాముడిగా ఎలా ఉంటారో తాము కూడా గ్రాఫిక్స్‌లో చూశామని ఆయన తెలిపారు.

హనుంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉందని ప్రశాంత్ వర్మ చెప్పారు. పద్మ విభూషణ్ తర్వాత చిరంజీవి బిజీగా ఉంటున్నారని, ఆయనకు వీలున్నప్పుడు కలుస్తానని తెలిపారు. ఇటీవల చిరంజీవికి భారత రెండో అత్యుత్తమ అవార్డు పద్మవిభూషణ్‍ను కేంద్రం ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలుపుతున్నారు.

మహేశ్.. సాధ్యమేనా?

మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో గ్లోబల్ రేంజ్‍లో సినిమా (SSMB 29) చేయనున్నారు. త్వరలోనే ఈ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ షూటింగ్ మొదలుకానుంది. దీంతో ‘జై హనుమాన్’లో మహేశ్ నటించే అవకాశాలు తక్కువే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరోవైపు, హనుమాన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కూడా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మొదట్లో థియేటర్లు అనుకున్న స్థాయిలో దొరకకపోయినా కంటెంట్ బాగుంటే మూవీ హిట్ అవుతుందని టీమ్‍కు ధైర్యం చెప్పారు. చిరూ చెప్పినట్టే హనుమాన్ చిత్రం సూపర్ హిట్ అయింది. అందులోనూ ఆంజనేయ స్వామికి చిరంజీవి పరమ భక్తులు. దీంతో హనుమంతుడి పాత్రను ఆయన అంగీకరిస్తారనే అంచనాలు ఉన్నాయి. విశ్వంభర షూటింగ్‍తో బిజీగా ఉండి.. ఒకవేళ చిరంజీవి చేయకపోతే దగ్గుబాటి రానాను కూడా హనుమంతుడి పాత్రకు మూవీ టీమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

హనుమాన్ కలెక్షన్లు

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు రూ.272 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. టాలీవుడ్‍లో సంక్రాంతికి రిలీజై అత్యధిక గ్రాస్ కలెక్షన్లను దక్కించుకున్న మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బయ్యర్లకు సుమారు ఐదు రెట్ల వరకు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. నార్త్ అమెరికాలో హనుమాన్ చిత్రం 5 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఈ మూవీకి సీక్వెల్‍ ‘జై హనుమాన్’ మూవీలో తేజ సజ్జా కూడా ఉంటారని.. అయితే హనుమంతుడు, శ్రీరాముడి పాత్రలో స్టార్ హీరోలు నటిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవలే చెప్పారు. జై హనుమాన్‍ను 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

IPL_Entry_Point