తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

Sanjiv Kumar HT Telugu

20 May 2024, 8:12 IST

google News
  • Guppedantha Manasu Serial May 20th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 20వ తేది ఎపిసోడ్‌లో జైలు నుంచి తప్పించుకున్నట్లు రాజీవ్ చెబుతాడు. నమ్మకద్రోహం చేశావంటూ శైలేంద్రకు గన్ గురి పెట్టి చంపేస్తానంటాడు రాజీవ్. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 20వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 20వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 20వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌ ఇంకా మౌనంగా ఉంటారేంటీ మేడమ్ అని వసుధార అడిగితే.. అనుపమ సైలెంట్‌గా ఉంటుంది. తను మాట్లాడుకున్న నా మనసుకు వినిపిస్తుంది. ప్రతి మనిషికి అమ్మే కదా గుండె చప్పుడు. ఈ గుండెకు ఆవిడ ప్రేమ, కోపం, ఆవేశం, బాధ అన్ని ఎమోషన్స్ తెలుస్తాయి. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం తప్పా అని మను అంటాడు.

మీ ఆశీస్సులు ఉన్నంతవరకు

ఆ ప్రశ్న నా తండ్రి ఎవరు అన్నది. తను నోరు తెరచి చెప్పదు. నా గుండె చప్పుడు అది అర్థం కాదు. మేడమ్ మీరు నా గురించి వర్రీ కాకండి. నేను బాగానే ఉన్నాను. మీ ఆశీస్సులు ఉన్నంతవరకు బాగానే ఉంటాను కూడా. నాకేం అవుతోందో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మను అంటాడు. తర్వాత వసుధారతో మేడమ్ నేను మీలాంటి మంచి మనిషిని చూడలేదు. నాకు ఇంతవరకు సపోర్ట్‌గా ఉన్నవాళ్లు ఎవరు లేరు. జీవితంలో నేను ఒంటరిని నాకంటూ ఏ బంధం లేదు అని మను ఎమోషనల్‌గా చెబుతాడు.

ఎలాంటి బంధుత్వం లేదు. అలాంటి నాకోసం మీరు ఇంత రిస్క్ తీసుకున్నారు. ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేను మేడమ్ అని మను అంటాడు. నేను చేసింది ఏం లేదు. మీకు సపోర్ట్‌గా ఉన్నాను. ఈ విషయంలో ముందుండి నడిపించింది మీ నాన్నగారే అని వసుధార అంటే మనుతోపాటు అనుపమ షాక్ అవుతుంది. అదేనండి.. మిమ్మల్ని దత్తత తీసుకుని మావయ్య గారు తండ్రి స్థానంలోకి రావాలనుకున్నారు కదా. అందుకే అలా అన్నాను అని వసుధార అంటుంది.

నా తండ్రి స్థానంలోకి

అమ్మ వసుధార నువ్వేం తప్పు మాట్లాడలేదమ్మా. ఎందుకు తటపటాయిస్తున్నావ్. మనును నా కొడుకులాగే చూస్తున్నాను కదా. మళ్లీ దత్తత కార్యక్రమం చేద్దాం అని మహేంద్ర అంటాడు. సర్ ఇక వద్దు ప్లీజ్. మీ కొడుకు లాగే చూస్తున్నారు. ఇప్పటివరకు కొడుకు కోసం తండ్రి చేసినట్లే చేశారు. కానీ, మీరు మాత్రం నా తండ్రి స్థానంలోకి రావొద్దు అని మను అంటాడు. దానికి మహేంద్ర, వసుధార షాక్ అవుతారు. మీకు ఆల్రెడీ చెప్పాను. నాకు తండ్రి మీద ఎలాంటి ఉద్దేశం ఉందో. అందుకే చెబుతున్నాను అని మను అంటాడు.

కానీ, ఒక వ్యక్తికి మీలాంటి తండ్రి ఉంటే మాత్రం తను ఎంత గొప్ప స్థాయికైనా చేరుకోలగుతాడు. మీరు తన వెన్నంటే ఉంటారు. ఎంకరేజ్ చేస్తారు అని మను అంటాడు. అమ్మా వసుధార మను ఇంటి ఫుడ్ తిని చాలా రోజులు అయింది. తనకు నచ్చినవి చేసి పెట్టండమ్మా అని మహేంద్ర అంటాడు. వసుధార ఉండు.. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తానని అనుపమ వెళ్లిపోతుంది. కట్ చేస్తే శైలేంద్రను సీరియస్‌గా చూస్తుంటాడు రాజీవ్.

నమ్మకద్రోహం

ఏంటీ బ్రదర్ అలా సీరియస్‌గా చూస్తున్నావ్. నువ్వెలా వచ్చావ్ అని శైలేంద్ర అడుగుతాడు. రాలేననుకున్నావా. నాకు జైలేమి కొత్తేం కాదు. అందులో నుంచి తప్పించుకోవడం కూడా కొత్త కాదు అని రాజీవ్ అంటాడు. అసలు అలా నువ్ పట్టుబడతావని అనుకోలేదు. షాక్ అయ్యాను. బయటకు తీసుకొద్దామనుకున్నాను అని శైలేంద్ర అంటాడు. నాటకాలు ఆపు భయ్యా. నాకు అంతా తెలుసు. నమ్మకద్రోహం. ఒక మోసగాడిని ఒక మోసగాడు మోసం చేయడం ఏంటీ భయ్యా అని రాజీవ్ అంటాడు.

నేను ఏం చేయలేదు. నీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని శైలేంద్ర భయపడిపోతాడు. నా ఇన్ఫర్మమేషన్ అంతా కరెక్ట్. నీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అద్భుతం. వసును నాకు ఎరగా వేసి నన్ను పట్టించావ్. మను గాడిని బయటకు తీసుకొచ్చావ్. నమ్మక ద్రోహి. నువ్ నా ఇగోని టచ్ చేశావ్. నన్ను ఇలా ఎవరు మోసం చేయలేదు. ఇక నిన్ను క్షమించేదే లేదు. ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని శైలేంద్రకు గన్ తీసి గురి పెడతాడు రాజీవ్.

అయోమయంగా ఫణీంద్ర

ఏం చేయొద్దు బ్రదర్. ఎండీ సీటు కోసం అలా చేశాను. తప్పే.. నన్ను క్షమించు అని రాజీవ్ కాళ్లపై పడతాడు శైలేంద్ర. ఏదో ఆశతో చేశాను. మళ్లీ ఇది రిపీట్ కాదు అని శైలేంద్ర వేడుకుంటాడు. కట్ చేస్తే ధరణి కాళ్లపై పడి ఈ ఒక్కసారి నాకు ప్రాణ భిక్ష పెట్టు అని శైలేంద్ర అంటూ ఉంటాడు. అక్కడే దేవయాని, ఫణీంద్ర కూడా ఉంటారు. శైలేంద్ర చేసే పనికి అయోమయంగా చూస్తారు. రేయ్.. శైలేంద్ర అని ఫణీంద్ర పిలుస్తాడు. కళ్లు మూసుకుని ఉన్న శైలేంద్ర ఇది డాడ్ వాయిస్‌లా ఉందే అని కళ్లు తెరచి చూస్తాడు.

వాళ్లను చూసి షాక్ అవుతాడు. ఏం తప్పు చేశావురా. ఎందుకు తన కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్నావ్. ఎందుకు ప్రాణ భిక్ష పెట్టమంటున్నావ్ అని ఫణీంద్ర అడుగుతాడు. ఏం లేదని శైలేంద్ర అంటే.. ధరణిని, దేవయానిని అడుగుతాడు. లేదని చెబుతారు. రేయ్.. తప్పు చేసినవాడినిలా ఎందుకు పశ్చాత్తాప పడుతున్నావ్. నువ్ చేసే పనులకు నా ప్రాణం పోతుంది. అడిగితే ఏం లేదంటావ్. నాకు ఏం చేయాలో అర్థం కాకా నా మనసు పాడైపోతుంది. ఇంకోసారి ఇలా చేస్తే తోలు తీస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని వెళ్లిపోతాడు ఫణీంద్ర.

మనిషివేనా.. నా కొడుకువేనా

ఛీ ఛీ.. అసలు నువ్ మనిషివేనా. నువ్ ఎంత పెద్ద తప్పు చేస్తే మాత్రం భార్య కాళ్లు పట్టుకోవడం ఏంట్రా. అసలు ఇలా మారిపోతావ్ అనుకోలేదు. నువ్ నా కొడుకు అంటేనే నమ్మబుద్ధి కావట్లేదు అని ఫైర్ అయిన దేవయాని వెళ్లిపోతుంది. మీరు చాలా మంచి వారండి. మీరు ఇలా చేయడం నాకు చాలా నచ్చింది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా కాళ్లు పట్టుకోవచ్చు అని ధరణి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు వసుధారకు థ్యాంక్స్ చెబుతుంది అనుపమ.

మనును బయటకు తీసుకురావడం కోసం నీ ప్రాణాలు ఫణంగా పెట్టావ్ అని అనుపమ అంటుంది. ఇంతలో వచ్చిన మను ఆ మాటలు వింటాడు. మనును బయటకు తీసుకురావడం నా బాధ్యత అని చెప్పాను కదా. అది నెరవేర్చాను అని వసుధార అంటుంది. నీ రుణం జన్మలో తీర్చుకోలేనిది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ, గుండెలవిసేలా బాధపడింది రెండే రెండే సార్లు. ఒకటి మనును అమ్మ అని పిలవకని చెప్పినప్పుడు. రెండోది తనను పోలీసులు తీసుకెళ్లినప్పుడు అని అనుపమ చెబుతూ ఎమోషనల్ అవుతుంది.

తండ్రి ఎవరో తెలియక

అప్పుడు చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. ఆ రాజీవ్ వాళ్లు మనును ఏం చేస్తారో చాలా భయపడ్డాను. ఇన్నాళ్లు దూరంగా ఉండి దూరం ఉంచాను. అందులో కూడా ఒక ప్రేమ, అఫెక్షన్ ఉండేది. తన క్షేమం ఎప్పుడూ కోరుకునేదాన్ని. కానీ, ఇలా కేసులో ఇరుక్కోగానే తనకు శాశ్వతంగా దూరం ఉండాల్సి వస్తుందని నాలో నేనే మదనపడిపోయాను అని అనుపమ అంటుంది. తన తండ్రి ఎవరో తెలియక ఎంత కుమిలిపోయాడో నేను చూశాను. ఇప్పటికీ అదే చూస్తున్నాను అని అనుపమ అంటుంది.

తన బాధ చూస్తూ కూడా నిజం చెప్పలేని పరిస్థితి. బిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేని దౌర్భాగ్యురాలిని అని అనుపమ అంటుంది. ఆ మాటలు వింటున్న మను సైతం ఎమోషనల్ అవుతాడు. మీ వేదన గురించి నాకు అర్థమవుతోంది. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. కానీ మీ విషయంలో ఆయనకు ఒక్కటే అసంతృప్తి. అదే మీరు తండ్రి ఎవరో తెలిసి కూడా చెప్పకపోవడం. అది మీరు చెప్పి మీరు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వసుధార అంటుంది.

మనుతో శైలేంద్ర కాల్

ధరణి కాళ్లు పట్టుకున్నది తలుచుకుంటూ ఇలా చేశానేంటీ అని శైలేంద్ర కంగారుపడుతుంటాడు. రాజీవ్ గాడికి నిజం తెలిసే అవకాశం ఉంటుందా. అయినా వాడు నన్ను ఏం చేయగలడు. డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీటు కోసం ఏమైనా చేస్తాను. ఆ మను గాడు బయటకు వచ్చాడు కదా. వాడికి కాల్ చేద్దామని చేస్తాడు శైలేంద్ర. మీరు నేరం చేయలేదని ప్రూవ్ అయింది కదా. బయటకొచ్చావ్ అని శైలేంద్ర అంటాడు. నువ్ చేయాలనుకుంటే ఏదైనా చేస్తాను అని తెలుసు అని మను అంటాడు.

నీకు మన డీల్ గుర్తుంది కదా. మర్చిపోయారేమో అని గుర్తు చేద్దామని కాల్ చేశాను. అయినా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. మీ ఇంట్లోనా ఇంకెక్కడ అయినా అని శైలేంద్ర అడుగుతాడు. మహేంద్ర ఇంట్లో. అమ్మను చూసేందుకు అని మను చెబుతాడు. వీడు అక్కడే ఉంటే వాడి మనసు మార్చేస్తారు. ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని శైలేంద్ర అనుకుంటాడు. ఇక మీరు అక్కడ ఉండకండి వెంటనే బయటకు వచ్చేయండి అని శైలేంద్ర అంటే.. ఎందుకు అని మను అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం