Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా
Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది ప్రోమోల్లో చూస్తే..
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్యను కిడ్నాపర్ల నుంచి రాజ్, అప్పు సేవ్ చేస్తారు. అనంతరం ఇంట్లో అక్కడికి ఎందుకు వెళ్లావ్, మాయ గురించి ఎందుకు తెలుసుకుంటున్నావ్, ఇలా చిక్కుల్లో ఎందుకు పడుతున్నావ్ అని కావ్యను నిలదీస్తాడు రాజ్.
అన్యాయం జరిగితే
దానికి కావ్య సమాధానం చెబుతుంది. ఏ తల్లి తన బిడ్డను ఒకరికి అప్పగించి చేతులు దులుపుకోదు. నిజంగా తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం నేరుగా ఇంటికే వస్తుంది. బిడ్డ భవిష్యత్తు గురించి తల్లడిల్లి పోతూ న్యాయం చేయని అర్ధిస్తుంది. కానీ, ఈ మాయ ఏదో మాయ చేస్తోంది అని కావ్య అంటుంది.
దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్తా అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అయిపోతుంది. చేసిన ఘనకార్యం చాలు. ఇక నుంచి అయినా నీ ప్రయత్నాలు మానుకో అని రాజ్ సీరియస్‌గా కావ్యకు వార్నింగ్ ఇస్తాడు. కానీ, కావ్య మాత్రం అందుకు ఒప్పుకోదని తెలుస్తోంది.
డబ్బు కోసమే
రాజ్‌ను కన్విన్స్ చేసి మాయకు సంబంధించిన అసలు నిజాన్ని బయటపెడతారని అర్థం అవుతోంది. అయితే, ఆ మాయ డబ్బు కోసమే సుభాష్‌కు పుట్టిన బిడ్డ అని అబద్ధం ఆడుతోందని, కావాలనే డ్రామా చేస్తోందని తెలుస్తోంది.
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధారను కిడ్నాప్ చేసిన రాజీవ్ రిషి కట్టిన తాళి తెంపబోతుంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి రాజీవ్ తలపై కర్రతో గట్టిగా కొడతాడు. తర్వాత లేచిన రాజీవ్ గన్‌ను మహేంద్రవైపు గురిపెడతాడు. అందులో బుల్లెట్స్ లేవని శైలేంద్ర హింట్ ఇస్తే.. అదే విషయం మహేంద్ర చెబుతాడు. ఇది జోక్ కాదని గన్ పేలుస్తాడు. కానీ, మహేంద్రకు కొద్దిలో మిస్ అవుతుంది.
పెద్ద విలన్‌గా బాబాయ్
నేను కామెడీ విలన్‌ను కాదు. నీకంటే పెద్ద విలన్ అని శైలేంద్రతో అంటాడు రాజీవ్. అతనితో వాదించి గన్ కొట్టేస్తాడు శైలేంద్ర. రాజీవ్‌కు గన్ గురిపెట్టి మనకంటే పెద్ద విలన్‌గా బాబాయ్ ఉన్నాడని శైలేంద్ర అంటే నేను విలన్ కాదు హీరో అని మహేంద్ర అంటాడు.
ఇంతలో పోలీసులు వచ్చి రాజీవ్‌ను తీసుకెళ్తారు. మరోవైపు రాజీవ్ బతికే ఉన్నాడని సంతోషించినా దేవయాని అతన్ని పట్టించింది నువ్వేనా. మోసం చేసినవాళ్లని రాజీవ్ ప్రాణాలతో ఉంచడు అని అంటుంది. దాంతో శైలేంద్ర భయపడిపోతాడు.
మురారికి చెప్పి
Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కృష్ణకు కాల్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని చెబుతుంది మీరా. ఒక్కదానివి కాకుండా మురారితో పాటు రమ్మని అంటుంది. అదే విషయం మురారికి చెప్పి రెస్టారెంట్‌కు తీసుకెళ్తుంది కృష్ణ.
రెస్టారెంట్‌లో కూర్చున్న మీరాను చూసి ఏమైంది నీకు కృష్ణ అడుగుతుంది. అసలు ఎక్కడికి వెళ్లావ్ అని మురారి కోపంగా ప్రశ్నిస్తాడు. దాంతో ఒక లెటర్ కృష్ణకు ఇస్తుంది మీరా. అది చిదివిన కృష్ణ ఏడుస్తూ లేచి నిలుచుంటుంది. దాంతో వెంటనే ఆ లెటర్‌ను మురారి తీసుకుని చదువుతాడు.
అబార్షన్ డ్రామా
లెటర్ చదివిని మురారి కోపంగా మీరావైపు చూస్తుంటాడు. ఇంతలో మీరాను చెంప చెల్లుమనిపిస్తుంది కృష్ణ. నా బిడ్డను నీ కడుపులో చల్లగా పెంచుతానని మాటిచ్చి.. గర్భం తీయించుకుంటావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా అడుగుతుంది కృష్ణ. మురారి కోపంగా చూస్తూ ఉండిపోతాడు.
అయితే మీరా అబార్షన్ చేయించుకున్నట్లు చెప్పిన అది అబద్ధం అని తెలుస్తోంది. కావాలనే ఇప్పుడు కృష్ణను బాధపెట్టి సీక్రెట్‌గా బిడ్డను కనాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అసలు ఏం జరగనుంది అనేది మరికొన్ని ఎపిసోడ్స్‌లు పూర్తి అయితేనే తెలుస్తుంది.