Guppedantha Manasu July 16th Episode: కాలేజీతో మను తెగదెంపులు- శైలేంద్రకు మరో షాక్- సరోజకు పెళ్లి చూపులు- ఒంటరైన మహేంద్ర
16 July 2024, 8:33 IST
Guppedantha Manasu Serial July 16th Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 16వ తేది ఎపిసోడ్‌లో కాలేజీ ఎండీ పదవి నుంచే కాదు డైరెక్టర్‌గా కూడా తప్పుకుంటున్నట్లు రిజైన్ చేస్తాడు మను. తర్వాత ఎండీ అయ్యేందుకు శైలేంద్రకు వారం రోజులు గడువు ఇస్తాడు మంత్రి. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
గుప్పెడంత మనసు సీరియల్ జూలై 16వ తేది ఎపిసోడ్
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో బోర్డ్ మీటింగ్‌లో కాలేజీ ఎండీగా ఇకనుంచి మను బాధ్యతలు తీసుకుంటాడని మినిస్టర్ అనౌన్స్ చేస్తాడు. కానీ, అందుకు నేను రెడీగా లేను అని మను చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఏంటీ మను. ఎందుకు వద్దని మినిస్టర్ అంటాడు. ఎండీగానే కాదు. కాలేజీ బోర్డ్ డైరెక్టర్‌గా కూడా రిజైన్ చేస్తున్నాను అని రిజిగ్నిషన్ లెటర్ ఇస్తాడు మను.
అనసరంగా వాదించాను
వీడికి కూడా ఇష్టం లేదా.. అనవసరంగా మినిస్టర్‌తో ఆర్గ్యూ చేశాను అని శైలేంద్ర అనుకుంటాడు. ఏంటీ మను ఎందుకీ డెసిషియన్ తీసుకున్నావ్ అని మినిస్టర్ అడుగుతాడు. శైలేంద్ర అన్నమాటలకు ఇలా చేస్తున్నావా అని ఫణీంద్ అంటాడు. దాంతో అనుపమ అన్న మాటలు గుర్తు చేసుకున్న మను లేదు సార్.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను అని మను చెబుతాడు. నీ కారణాలు అర్థం అవుతున్నాయి. కానీ, కాలేజీ నుంచి వెళ్లిపోవడం ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని మహేంద్ర అంటాడు.
నువ్ కాలేజీ కోసం ఎంతో చేశావ్. ఇలా వెళ్లడం ఏంటీ అని ఫణీంద్ర అంటాడు. పాపం ఆయనకు ఏ సమస్యలు ఉన్నాయో వదిలేయండి డాడ్ అని శైలేంద్ర అంటాడు. ఇకనుంచి నాకు ఈ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. నన్ను క్షమించండి అని వెళ్లిపోతాడు మను. ఏంటీ ఫణీంద్ర గారు. డీబీఎస్టీలో ఏం జరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు దూరమైపోతున్నారు. ఎందుకు. జగతి, రిషి, వసుధార, ఇప్పుడు మను. ఎందుకు ఇలా జరుగుతుంది అని మినిస్టర్ అంటాడు.
వారం రోజులు టైమ్
అసలు డీబీఎస్టీ ఇలా పతనం అవుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని మంత్రి అంటే.. నేను కూడా సార్. అందుకే ఈ క్షణమే నేను ఎండీ పగ్గాలు చేపట్టి కాలేజీని గాడిలో పెట్టాలనుకుంటున్నాను. ఇంతకుముందు వాళ్లకంటే బెటర్‍గా చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు మీకున్న ఏకైక ఆప్షన్ నేనే కదా అని శైలేంద్ర అంటాడు. సారీ శైలేంద్ర.. నువ్ ఎండీ కావాలంటే.. రిషి గానీ, వసుధార గానీ వచ్చి చెబితే నీకు ఎండీ పదవి ఇస్తాం. నీకు వారం రోజులు టైమ్ ఇస్తున్నాను. ఆలోపు చేయకుంటే నేనే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అని మంత్రి అంటాడు.
దాంతో మళ్లీ శైలేంద్రకు షాక్ తగులుతుంది. మరోవైపు రాధమ్మకు ట్యాబ్లెట్స్ ఇచ్చిన సరోజ.. చెప్పాను కదా నీకు తోడు ఉండాలని అని సరోజ అంటుంది. ఆ అమ్మాయి ఉంది కదా అని రాధమ్మ అంటే.. ఆ అమ్మాయి ఇంట్లో రెంట్‌కు ఉంటుంది. అప్పుడు తను ఉంది కాబట్టి సరిపోయింది. ఆమెకు ట్యూషన్ ఉంటుంది. బావ ఆటో నడుపుతూ బయటే ఉంటాడు. బుజ్జిగాడు బావతోనే ఉంటాడు. అందుకే నువ్ నాకు బావను ఇచ్చి పెళ్లి చేస్తే నీతోపాటే ఉంటాను అని సరోజ అంటుంది.
వడ్డీ డబ్బులు ఎగ్గొడతారో అని
నీతో ఉండి ఇంట్లో పనులు అన్నీ చేస్తాను. నువ్ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని సరోజ అంటుంది. ఇంతలో వెళ్లాల్సిన టైమ్ వస్తే వెళ్లకతప్పదులేవే అని సరోజ తండ్రి ఎంట్రీ ఇస్తాడు. రండి అని రాధమ్మ లేస్తే.. కూర్చోండి. మీకు బాగోలేనప్పుడు మర్యాదలు చేయించుకోవడం సబబు కాదు. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారుగా అని అడుగుతాడు. రాధమ్మ అవునంటుంది. హమ్మయ్యా.. ఇప్పుుడ మనసులో కాస్తా అలజడి తగ్గిందత్తయ్యా.. మీరు ఈ సాకు పెట్టుకుని వడ్డీ డబ్బులు ఎగ్గొడతారో అని భయమేసింది అని అంటాడు.
మీరు ఏం కంగారుపడకండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు అని రంగా అంటాడు. నువ్ ఇస్తావురా. కానీ నాకు భయంగా ఉంటుంది కదా. సరే నేను ఎందుకు వచ్చానంటే.. రేపు సరోజకు పెళ్లి చూపులు. మీ మనవడు కాదు అత్తయ్యో.. సిటీలో ఉండే అబ్బాయి అని సరోజ తండ్రి అంటాడు. నాకు ఇష్టం లేదు. ఎవరని అడిగి అరెంజ్ చేశావ్ అని సరోజ అంటుంది. ఎవరని అడిగేదేంటీ.. అబ్బాయి బాగున్నాడు. మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి అని తండ్రి అంటాడు.
ముందే పరిచయం చేస్తే
నాకు ఇష్టం ఉండకూడదా అని సరోజ అంటుంది. ఇష్టంది ఏముంది. అవి ఎప్పుడు మారుతుంటాయి. నువ్ సైలెంట్‌గా ఉండు. మీకు ఎక్కడ ఆరోగ్యం బాగోదో.. పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతాయో అని భయపడ్డాను. మీరు బాగుండాలి. మేము బాగుండాలి. రేపు వచ్చి అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఇంకా చాలా మందిని పిలవాలి. రంగా నువ్ కూడా రారా. మొదట్లోనే నిన్ను పరిచయం చేస్తే ముందు ముందు ఎలాంటి సమస్య ఉండదు కదా అని వెళ్లిపోతాడు సరోజ తండ్రి.
ఏంటీ బావా నాన్న పెళ్లి చూపులు అంటే ఏం మాట్లాడవు అని సరోజ అంటుంది. రంగా సైలెంట్‌గా ఉంటాడు. ఇదంతా దీనివల్లే. ఇది వచ్చినప్పటి నుంచి బావ నన్ను పట్టించుకోవట్లేదు. నాన్న ఇలా చేస్తున్నాడు. దీన్ని చంపేయాలి. ఆ రౌడీల నెంబర్ తీసుకుని వాళ్లకు చెప్పినా అయిపోయేది. ఏదో ఒకటి చేయాలని సరోజ అనుకుంటుంది. మరోవైపు మహేంద్రను పలకరిస్తాడు ఫణీంద్ర. డల్‌గా ఉన్నావేంటని, మను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడని అడుగుతాడు ఫణీంద్ర.
నన్ను అర్థం చేసుకోలేరు
శైలేంద్ర ఏమైనా చేశాడా అని ఫణీంద్ర అంటే.. శైలేంద్ర నేను ఎందుకు చేస్తాను అని అంటాడు. ఒకవేళ మనుకు డైరెక్టర్‌గా ఉండటం ఇష్టంలేకపోతే వేరేలా ఉండొచ్చు కదా. మొత్తానికే కాలేజీ నుంచి తెగదెంపులు చేసుకోవడం ఏంటీ. దానికి పెద్ద కారణమే ఉండొచ్చు. దానికి శైలేంద్ర కారణం అయితే చెప్పు. నేను వీడిని విడిచిపెట్టను అని ఫణీంద్ర అంటాడు. మీరు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోరు. సరే నేను ఉన్నందుకే బాబాయ్ ఏం చెప్పట్లేదేమో. నేను వెళ్తాను అని వెళ్లిపోతాడు శైలేంద్ర.
ఏమైందని ఫణీంద్ర అడిగితే.. మను ఇంకా కాలేజీకి రాడు. కాలేజీకే కాదు.. నా జీవితంలో కూడా ఉండమని అనుపమ, మను వెళ్లిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అని మహేంద్ర అంటాడు. అదేంటీ.. ఇన్నాళ్లు ఉండి ఇప్పుడు వెళ్లిపోవడం ఏంటీ అని ఫణీంద్ర అంటాడు. ఏమో అన్నయ్య ఎవరికీ తెలుసు అని మహేంద్ర అంటాడు. మన ఇంటికి వచ్చేయ్. ఒంటరిగా ఎలా ఉంటావ్. దేవయానితో నేను మాట్లాడుతాను. ఏం అనకుండా. వచ్చేయ్ అని ఫణీంద్ర అంటాడు.
పెళ్లి చేసుకోను
జగతి వెళ్లిపోయిప్పుడే ఒంటరి అయిపోయాను. నేను ఒక్కడినే ఉంటాను అని మహేంద్ర అంటాడు. నేను ఉండగా.. ఎలా ఒంటరి అవుతావ్. నేను ఇలా ఉంటే నువ్ వదిలేస్తావా చెప్పు. పద మహేంద్ర అని ఇంటికి తీసుకెళ్తాడు ఫణీంద్ర. మరోవైపు ఏదైనా గిరాకీ ఉంటే తీసుకురావొచ్చు కదా అని బుజ్జితో రంగా అంటాడు. ఇంతలో సరోజ వచ్చి నాకు పెళ్లి చూపులు అంటే సరదాగా మాట్లాడుకుంటున్నారా అని అంటుంది. పెళ్లికి టెన్షన్ ఎందుకు మంచిదేగా అని రంగా అంటాడు.
పెళ్లి చూపులు, నిశ్చితార్థం, లగ్గాలు, పెళ్లి, పిల్లలు అని బుజ్జి ఏడిపిస్తాడు. బావ నా మనసులో నువ్వే ఉన్నావ్ అని సరోజ అంటే.. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ముందే చెప్పాను. పెళ్లి అంటే రెండు కుటుంబాలకు సంబంధించినది. మీ నాన్నకు నేను నచ్చను. ఇప్పటికే ఏదోటి అంటూ సాధిస్తాడు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నా అంటాడు. నాకు నీపై అలాంటి అభిప్రాయం లేదు. పెళ్లంటే ముందు రెండు మనుసులు కలవాలి. ఎంతదూరం ఉన్న అర్థం చేసుకోవాలి. అలాంటివాళ్లే ఎప్పుడు కలిసి ఉంటారు అని రంగా అంటాడు.
అడ్డు పోతుందనా
రంగా చెబుతుంటే వసుధార చూస్తుంది. మీరు చెబుతుంది మన జీవితం గురించే అని నాకు అర్థం అవుతుంది సార్ అని వసుధార అంటుంది. అలాంటప్పుడు డబ్బు ఉన్న లేకున్నా కలిసి ఉంటారు. నువ్ చిన్న చిన్న విషయాల్లోనే అడ్జస్ట్ కావు. ఇక జీవితాంతం ఏం అడ్జస్ట్ అవుతావ్ అని రంగా అంటాడు. నన్ను నేను మార్చుకుంటాను అని సరోజ అంటుంది. అది అంత సులభం కాదు. అయినా ఆ వచ్చే అబ్బాయి నాకన్న మంచి వాడు కావొచ్చు. తన దగ్గర డబ్బుంది బాగా చూసుకోవచ్చు. నా దగ్గర ఏముంది. ఆటో, ఇల్లు, అప్పులు తప్పా అని రంగా అంటాడు.
మీ నాన్న చూసిన వాడినే చేసుకో అని రంగా అంటాడు. వసుధార కూడా అలాగే అంటుంది. అలా అయితే నీకు అడ్డు పోతుందని అనుకుంటున్నావా అని సరోజ అంటుంది. ఈ పెళ్లి చూపులు చెడగొట్టు అని రంగాను అడుగుతుంది సరోజ. నేనా చేయను అని రంగా అంటాడు. నీ మనసులో ఏముందు. నేను వెళ్లిపోయాకా.. తనతో కలిసి ఉందామనుకుంటున్నావా అని సరోజ అంటుంది. ఇప్పుడు తను నన్ను రిషి సార్ అనుకుంటుంది. ఆయనే వచ్చాకా నా సంగతి ఏంటని రంగా అంటాడు.
ఎవరినీ పెళ్లి చేసుకోను
నీ మనసులో ఎలాంటి ఉద్దేశం లేకుంటే నా పెళ్లి చూపులు ఆపమని సరోజ అంటుంది. నేను ఆపను అని రంగా అంటాడు. మళ్లీ ఆపుతావా లేదా అని సరోజ అంటుంది. నువ్ ఎన్ని సార్లు అడిగినా నేను ఆపను.. ఆపలేను. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని సరోజ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్