తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 11th Episode: గుప్పెడంత మనసు- దేవయానిని వేడుకున్న అనుపమ- వసుధార కిడ్నాప్- రంగా మాస్ ఎంట్రీ

Guppedantha Manasu July 11th Episode: గుప్పెడంత మనసు- దేవయానిని వేడుకున్న అనుపమ- వసుధార కిడ్నాప్- రంగా మాస్ ఎంట్రీ

Sanjiv Kumar HT Telugu

11 July 2024, 8:11 IST

google News
  • Guppedantha Manasu Serial July 11th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 11వ తేది ఎపిసోడ్‌లో మను తండ్రి మహేంద్ర అనే నిజం ఎవరికీ చెప్పొద్దని దేవయానికి దండం పెట్టి మరి వేడుకుంటుంది అనుపమ. మరోవైపు రౌడీలు వసుధారను కిడ్నాప్ చేస్తారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 11వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 11వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 11వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఇంటికి వెళ్తున్న దారిలో ఓ చోట ఆగి ఎటువైపు వెళ్లాలని రంగా అడిగితే.. అటువైపు అని వసుధార అంటుంది. అటువైపు కాదు ఇటువైపు అనుకుంటా అని రంగా అంటాడు. అది మీకు ఎలా తెలిసు అని వసుధార అంటుంది. అన్ని గల్లీలు తిప్పిస్తున్నావ్ కదా. సిటీలో కన్ఫ్యూజ్ అయింటావని అలా చెప్పాను అని రంగా అంటాడు.

ఇల్లు దగ్గరే ఆగిన రంగా

అవును సర్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇటువైపే వెళ్లాలని వసుధార అంటుంది. తర్వాత వసుధార ఇంటి వద్దే రంగా ఎందుకో ఆగుతాడు. వసుధార ముందు నడుస్తున్న రంగా మాత్రం అక్కడ ఆగడంతో ఇది మా ఇల్లు అని తెలిసే కదా ఆగారు అని వసుధార అంటుంది. అసలు నువ్ నా అడుగులో అడుగు ఎందుకు వేస్తున్నావ్ అని రంగా అంటాడు. నేను మీ వెనుక నడిచాను అంతే.. సరే రండి ఇదే మా ఇల్లు అని లోపలికి తీసుకెళ్తుంది వసుధార.

ఇంట్లోకి వెళ్లేసరికి లాక్ చేసి ఉంటుంది. మీవాళ్లేవరు లేనట్లున్నారు. సరే నేను వెళ్తాను అని రంగా అంటాడు. ఎక్కడికీ వెళ్లేది లేదు సర్. మీరు మా డాడ్‌ను కలిసిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండని వసుధార అంటుంది. నేను కూడా ఆయన్ను కలిసి వాళ్లకు అప్పజెప్పి వెళ్దామనే వచ్చాను మేడమ్ గారు. కానీ, మీవాళ్లు ఇంట్లో లేరు కదా. వెళ్లొస్తాను అని రంగా వెళ్లిపోతుంటాడు. వసుధార ఆపుతుంది.

చనిపోయారని నమ్ముతున్నారు

నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు రిషి సార్‌ను ఎంతగా ప్రేమించారో నాకు అర్థం అవుతోంది. కానీ, నేను రిషి సార్‌ను కాదు అని రంగా అంటాడు. లేదు మీరు నా రిషి సర్ అని నా మనసు చెబుతుందని వసుధార అంటుంది. అది మీ అపోహ. మీవాళ్లంతా మీ రిషి సార్ చనిపోయారని నమ్ముతున్నారు. మీరు రియాల్టిలోకి రండి అని రంగా అంటాడు. అలా అయితే మీ ఇంట్లోనుంచి నన్ను ఎందుకు పంపించలేదు. నేను ఇంట్లో ఉన్నందుకు ఊళ్లోవాళ్లు తప్పుపడుతున్న ఎందుకు ఏం అనలేదు అని వసుధార అంటుంది.

భర్తను కోల్పోయి అయోమయంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నాను. మీ వాళ్లను మీరు కష్టపెట్టకండి. మీకోసం వెతుకుతుంటారు. ఇక నుంచి అయినా మీరు రిషి సార్‌ను మర్చిపోయి ఇంట్లోవాళ్లతా హ్యాపిగా ఉండండి. మేడమ్ మీకు దండం పెడతాను. నా పేరు రంగా. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టం నా బాధ్యత. ఇప్పుడు నా బాధ్యత పూర్తి అయింది. నేను మా ఇంటికి వెళ్లిపోతున్నాను. మీరు నా మాటలు నమ్మకుండా నా వెనుకాలే రావొద్దు. వస్తే.. మీరు ప్రాణమని చెబుతున్నా మీ రిషి సార్ మీద ఒట్టు అని రంగా అంటాడు.

మీరు తప్పా ఇంకెవరు చేయరు

దాంతో వసుధార షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. రంగా వెళ్లిపోతాడు. మరోవైపు దేవయాని గారు అంటూ అరుస్తూ లోపలికి వస్తుంది అనుపమ. మళ్లీ ఏం గొడవ చేద్దామని వచ్చావ్ అని దేవయాని అంటుంది. గొడవ చేస్తుంది నువ్. ఎవరితో ఫోన్ చేయించి బెదిరిస్తుంది మీరే అని తెలుసు అని అనుపమ అంటుంది. అవునా. నిజమా ప్రూఫ్స్ ఉన్నాయా అని దేవయాని అంటుంది. ప్రూఫ్స్ అవసరం లేదు. ఇలాంటి పనులు మీరు తప్ప ఇంకెవరు చేయరు అని అనుపమ అంటుంది.

మరి అలా అయితే మను తండ్రి మహేంద్ర అనే నిజం ఎందుకు బయటపెట్టలేకపోతున్నావ్ అని దేవయాని అంటుంది. దాంతో అనుపమ షాక్ అవుతుంది. నీకు ఏమైనా మతి ఉండే మాట్లాడుతున్నావా. మా మీద ఎందుకు అంత ఇది. తను నా బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం చేసుకోకుండా మాకు సంబంధం ఉందని అంటావేంటీ, అతను తండ్రి అంటావేంటీ. మా మధ్య ఎలాంటి సంబంధం లేదని అనుపమ అంటుంది. నిజంగానే మను తండ్రి మహేంద్ర కాదా అని దేవయాని నవ్వుతూ అడుగుతుంది.

వసుధార లెటర్ చూడు

మను నా కొడుకు. తండ్రి గురించి అవసరం లేదని అనుపమ అంటుంది. నువ్వే తల్లివి. మహేంద్ర తండ్రే కదా. అదే నిజం అని దేవయాని అంటుంది. ఏ ప్రూఫ్‌తో అంటున్నారు అని అనుపమ అంటే.. ప్రూఫ్ ఎందుకు లేదు. ఉంది అని లోపలికి వెళ్లి వసుధార రాసిన లెటర్ తీసుకొస్తుంది దేవయాని. ఈ లెటర్ చూడు నీకే అర్థం అవుతుందని ఇస్తుంది దేవయాని. అది చదివి అనుపమ షాక్ అవుతుంది. ఏంటీ షాక్ అయ్యావా, కాళ్లు చేతులు ఆడటం లేదా అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని.

వసుధార వెళ్తూ వెళ్తూ రాసి పెట్టిన లెటర్ ఇది. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. మను తండ్రి మహేంద్రే అని రాసి ఉంది. తను అలా రాసింది అంటే కచ్చితంగా నిజమే. అందులో ఎలాంటి మార్పు ఉండదని నాకు బాగా తెలుసు. అంటే మహేంద్ర మను తండ్రి. అసలు మను తన తండ్రి మీద పీకల వరకు కోపం, ద్వేషం పెంచుకున్నాడు. తన తండ్రి ఎవరో తెలిసాకా చంపేయాలని భీష్మించు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ లెటర్ ఇస్తే కచ్చితంగా నమ్ముతాడు. ఆ కోపంలో మహేంద్ర ప్రాణాలు తీస్తాడు అని దేవయాని అంటుంది.

ప్రాధేయపడిన అనుపమ

ప్లీజ్ దేవయాని గారు ఈ లెటర్ గురించి వాడికి చెప్పకండని అనుపమ అంటుంది. నాకు మనును చూస్తే జాలి కలుగుతుంది. ఎన్నో అవమానాలు పడుతున్నాడు. కచ్చితంగా ఈ లెటర్ అతనికి చేరుస్తాను అని దేవయాని అంటుంది. మహేంద్ర ప్రాణాలకే ప్రమాదం. మీకు దండం పెడతాను. ఈ విషయం బయటకు రావొద్దు అని ప్రాధేయపడుతుంది అనుపమ. నా తాపత్రయం అదే. ఈ విషయం బయటకు రావొద్దు. కానీ, అలా జరగాలంటే నువ్ ఒకటి చేయాలని దేవయాని అంటుంది.

చెప్పండి చేస్తాను అని అనుపమ అంటుంది. కాలేజీ ఎండీ విషయంలో నా కొడుకుకు అడ్డు రావొద్దు. అలాగే మనును తీసుకుని కాలేజీకి, మహేంద్ర ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవాలి. చేస్తావా అని దేవయాని అంటుంది. చేస్తాను. నేను ఎవ్వరికీ ఈ విషయం చెప్పను. నా కొడుకును తీసుకుని దూరంగా వెళ్తాను. కానీ, ఆ లెటర్ నాకు ఇవ్వండి అని అనుపమ అంటుంది. ఇవ్వను. నా పని అయిపోయాక ఈ లెటర్ కాల్చేస్తాను. నువ్ ఆ పనిలో ఉండు అని దేవయాని అంటుంది.

నిన్ను ఫినిష్ చేయాలని

మరోవైపు రోడ్డుపై వసుధార నడుస్తుంటుంది. ఛ.. మహేంద్ర సార్ ముందు రిషి సార్‌ను నిలబెడితే నిజం ఒప్పుకుంటారు అనుకున్నాను. తండ్రిని ఏ కొడుకు తండ్రి కాదని అనలేడు కదా. రిషి సార్ నిజం ఒప్పుకుని అంతా సంతోషంగా ఉంటాం అనుకున్నా. కానీ మళ్లీ దేవుడు పరీక్ష పెట్టాడు. కాలేజీలో ఉన్నారా, ఫోన్ కూడా లేదు అని వసుధార అనుకుంటుంది. అటు వైపు నుంచి కారులో శైలేంద్ర వస్తుంటాడు. శైలేంద్రకు ఫోన్ కాల్ వస్తుంది.

కాల్ మాట్లాడుకుంటూ పక్కకు చూసుకుంటూ వెళ్తాడు శైలేంద్ర. కానీ, వసుధార ముందు మరో కారు వస్తుంది. అది రౌడీల కారు. వసుధారను పట్టుకుని కారులో తీసుకెళ్లిపోతారు రౌడీలు. కట్ చేస్తే వసుధారను తాళ్లతో కట్టేసి ఉంచుతారు. ఎందుకు పదే పదే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని వసుధార అంటుంది. నిన్ను ఫినిష్ చేయాలని పది లక్షలు పుచ్చుకున్నాం. పదే పదే టార్గెట్ చేయకుంటే ఏం చేస్తాం అని రౌడీ అంటాడు.

మీరు సమాధి అవుతారు

ఎవరు నన్ను చంపమని చెప్పింది. వాళ్ల పేరు ఏంటీ అని వసుధార అంటుంది. అలా ఎలా చెబుతాం అని రౌడీ అంటాడు. మర్యాదగా చెబుతారా లేదా అని వసుధా అంటుంది. మా దగ్గర ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏంటీ. మీ గట్స్ మిమ్మల్ని కాపాడలేవు అని రౌడీ అంటాడు. నన్ను చంపడం కాదు కదా. నాకు చిన్న గీత పడిన మీరు సమాధి అవుతారని వసుధార అంటుంది. వామ్మో లేడి సూపర్ స్టార్‌లా ఆ మాస్ డైలాగ్స్ ఏంటీ మేడమ్ అని రౌడీ అంటాడు.

అసలు మీరు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు. ఆ ఆటో వాడు వచ్చి కాపాడతాడు అనుకుంటున్నారా. మేము ఒకటిరెండు సార్లు మిస్ చేసినట్లు ఈసారి మిస్ చేస్తామనుకుంటున్నామా అని రౌడీలు అంటారు. ప్రతిసారి ఆయన వచ్చి నన్ను కాపాడుతాడు. ఆయన మాములు మనిషి కాదు అని వసుధార అంటుంది. భాషాకు ఉన్నంత ప్లాష్ బ్యాక్ ఉందా. సరే నేను కూడా ఉండను మిమ్మల్ని కాపాడుకోమ్మనండి అని రౌడీ అంటాడు.

రంగా మాస్ ఎంట్రీ

నువ్ ఎక్కడికి అన్నా అని మరో రౌడీ అడిగితే.. నేను ఉన్నప్పడు అలా మిస్ అవుతుంది. అలా సరదాగా వెళ్లి బీర్ కొట్టేసి వస్తా అని మెయిన్ రౌడీ వెళ్లిపోతాడు. తర్వాత ఓ రౌడీ కత్తి తీసి వసుధారను పొడవాలని చూస్తాడు. వసుధార అరుస్తుంది. ఇంతలో డోర్ తన్ని హీరోలా ఎంట్రీ ఇస్తాడు రంగా. విజిల్ వేసుకుంటూ మాస్ ఎంట్రీ ఇస్తాడు. అది చూసి వసుధార సంతోషపడితే.. రౌడీలు షాక్ అవుతారు. రేయ్ వాడు కూడా వచ్చాడు. ఇద్దరిని ఒకేసారే లేపేసే ఛాన్స్ వచ్చింది. లేపేయండ్ర వాన్ని ఓ రౌడీ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం