Guppedantha Manasu Serial: వసు మెడలోని తాళి తెంపబోయిన రాజీవ్ - చివరి నిమిషంలో హీరోలా మహేంద్ర ఎంట్రీ - మను సేఫ్
18 May 2024, 7:19 IST
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రాజీవ్‌ను పోలీసులకు పట్టిస్తారు వసుధార, మహేంద్ర. మనును జైలు నుంచి విడిపించి అనుపమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu Serial: వసుధార సాయంతో రాజీవ్‌ను పోలీసులకు పట్టించాలని శైలేంద్ర అనుకుంటాడు. కానీ అతడి ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. వసుధారను రాజీవ్ కిడ్నాప్ చేస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోబోతున్నట్లు చెబుతున్నాడు. ఆ పెళ్లికి పెద్దగా శైలేంద్రను ఉండమని రాజీవ్ అంటాడు. అందుకు శైలేంద్ర ఒప్పుకోకపోవడంతో గన్‌తో బెదిరిస్తాడు.
శైలేంద్ర షాక్...
గన్ శైలేంద్ర చేతికి ఇచ్చి వసుధార మెడలో మూడుముళ్లు వేయడానికి సిద్ధమవుతాడు రాజీవ్. ఆ గన్‌తో రాజీవ్‌ను బెదిరించాలని శైలేంద్ర అనుకుంటాడు. అతడి ఆలోచనలను పసిగట్టిన రాజీవ్...అందులో బుల్లెట్స్ లేవని చెబుతాడు. అతడి మాటలతో శైలేంద్ర షాకవుతాడు. వసుధార మెడలో రాజీవ్ తాళికట్టకుండా ఆపితేనే తనకు ఎండీ సీట్ దక్కుతుందని శైలేంద్ర తెగ టెన్షన్ పడతాడు. కానీ ఆ పెళ్లి ఆపడం ఎలాగో తెలియక ఆలోచిస్తుంటాడు.
రిషి కట్టిన తాళి...
వసుధార మెడలో తాళికట్టాలని రాజీవ్ అనుకుంటాడు. కానీ వసు మెడలో అప్పటికే రిషి కట్టిన తాళి అతడికి కనిపిస్తుంది. ఆ తాళి తెంపేసి తన చేతిలో ఉన్న తాళిని వసు మెడలో కట్టాలని రాజీవ్ అనుకుంటాడు. తాళిబొట్టును తెంపొద్దని రాజీవ్‌ను బతిమిలాడుతుంది వసుధార. ఇది చాలా పాపం అని రాజీవ్‌తో అంటాడు శైలేంద్ర. పాపపుణ్యాల గురించి మనమే మాట్లాడుకోవాలి అంటూ శైలేంద్రను ఎగతాళిచేస్తాడు రాజీవ్.
మహేంద్ర ఎంట్రీ...
రాజీవ్ తాళి తెంపబోతుండగా...అక్కడికి సడెన్‌గా మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ తలపై గట్టిగా ఒక్కటి కొట్టడంతో అతడు కిందపడిపోతాడు. వసుధార దగ్గర ఉన్న జీపీఎస్ ట్రాకర్ సహాయంతో ఆమెను చివరి నిమిషంలో సేవ్ చేస్తాడు. వసుధారను రాజీవ్ పెళ్లిచేసుకోకుండా ఆపేస్తాడు. కిందపడ్డ రాజీవ్ లేచి...గన్‌ను మహేంద్రకు గురిపెడతాడు.
శైలేంద్ర హింట్...
ఆ గన్‌లో బుల్లెట్స్ లేవు అంటూ మహేంద్రకు హింట్ ఇస్తాడు శైలేంద్ర. అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అంటూ రాజీవ్ బదులిస్తాడు. రాజీవ్ మాటలతను జోక్ అంటూ శైలేంద్ర కొట్టిపడేస్తాడు. దాంతో రాజీవ్ కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. శైలేంద్ర వైపు గన్ గురిపెట్టిపేలుస్తాడు.
కొద్దిలో బుల్లెట్ మిస్సవుతుంది. జోకులు వేస్తున్నానని నన్ను కామెడీ విలన్ అనుకోవద్దు. నేను నీకంటే పెద్ద విలన్‌ను అంటూ శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు రాజీవ్. కావాలనే గొడవను పెద్దది చేసి రాజీవ్ చేతిలోని గన్‌ను తెలివిగా కొట్టేస్తాడు శైలేంద్ర.
విలన్ కాదు హీరో...
రాజీవ్ గన్‌ను అతడికే గురిపెడతాడు. మా బాబాయ్ మన కంటే పెద్ద విలన్‌గా ఉన్నాడని మహేంద్రను ఉద్దేశిస్తూ అంటాడు శైలేంద్ర. నేను విలన్ కాదు హీరో అని మహేంద్ర చెబుతాడు. నేను తలచుకుంటే నిన్ను ఇప్పుడే చంపొచ్చు.
కానీ నేను నీలా దుర్మార్గుడిని కాదని రాజీవ్‌తో అంటాడు మహేంద్ర. తనతో పాటు పోలీసులను తీసుకొస్తాడు. వారికి రాజీవ్‌ను పట్టిస్తాడు. పోలీసులకు దొరికిన రాజీవ్...నేను నిన్ను వదిలిపెట్టను. జైలు నుంచి తప్పించుకొని వచ్చైనా నీ మెడలో మూడుముళ్లు వేస్తానని వసుధారకు వార్నింగ్ ఇస్తాడు.
దేవయాని ఆనందం...
రాజీవ్ బతికి ఉన్న విషయం దేవయానికి చెబుతాడు శైలేంద్ర. రాజీవ్ బతికి ఉన్నాడని తెలిసి దేవయాని సంతోషపడుతుంది. రాక్షసుడు లాంటి రాజీవ్ బతికి ఉంటే మీరు ఎందుకు సంబరపడుతున్నారని దేవయానికి అడుగుతుంది ధరణి. కోడలి ప్రశ్నకు సమాధానం చెప్పలేక దేవయాని తడబడుతుంది. రాజీవ్ బతికి ఉంటే మను నేరం చేయనట్లే కదా...అంటూ టాపిక్ మార్చేసి తల్లిని సేవ్ చేస్తాడు శైలేంద్ర.
రేపు కాలేజీలో తనకు మంచి జరగబోతున్నట్లు...ఆ వేడుకకు ఇద్దరు రావాలని దేవయాని, ధరణిలతో అంటాడు శైలేంద్ర. కానీ నేను వస్తే మీకు మంచి జరగడం లేదని, ఆ వేడుకకు తాను రానని ధరణి అంటుంది.
దేవయాని కన్ఫ్యూజన్...
మను జైలు నుంచి విడుదలైతే శైలేంద్రకు ఎలా మంచి జరుగుతుందో తెలియక దేవయాని కన్ఫ్యూజ్ అవుతుంది. కొంపదీసి ఆ రాజీవ్‌ను పోలీసులకు పట్టించింది నువ్వేనా అని అనుమానంగా కొడుకును అడుగుతుంది.
తాను కాదని అబద్ధం ఆడుతాడు శైలేంద్ర. కొడుకు మాటలతో టెన్షన్ తగ్గినట్లుగా ఫీలవుతుంది దేవయాని. తనను పోలీసులకు పట్టించిన వాడిని చంపకుండా రాజీవ్ వదిలిపెట్టడని, కట్టుకున్న పెళ్లాన్ని చంపిన వాడికి... మోసం చేసిన వారిని అంతం చేయడం పెద్ద లెక్క కాదని దేవయాని అంటుంది. దేవయాని మాటలతో శైలేంద్ర భయపడిపోతాడు.
మాట నిలబెట్టుకున్న వసు...
అనుమకు మాటిచ్చినట్లుగానే మనును జైలు నుంచి విడిపిస్తారు వసుధార, మహేంద్ర. మను ఏ నేరం చేయలేదని నిరూపిస్తారు. మనును చూసి అనుపమ ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కానీ మనుతో మాట్లాడలేకపోతుంది. ఇన్నాళ్లు కొడుకు క్షేమం కోసం కన్నీళ్లు పెట్టుకున్నావు...ఇప్పుడు నీ కళ్ల ముందు అతడు ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నావని అనుపమను అడుగుతారు మహేంద్ర, వసుధార.
అనుపమ మాట్లాకపోయిన తన మాట నా మనసుకు వినిపిస్తుందని వసుధారతో అంటాడు మను. అనుపమ ప్రేమ, కోపం బాధ, ఆనందం అన్ని ఎమోషన్స్ నాకు తెలుస్తాయి. ఒక్క ఒక్క ప్రశ్నకు సమాధానం తప్పఅని మను అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.