Guppedantha Manasu August 15th Episode: రిషికి క్లాస్ పీకిన వసు - శైలేంద్రతో వార్‌కి సిద్ధమైన మహేంద్ర
Guppedantha Manasu August 15th Episode: డీబీఎస్‌టీ కాలేజీకి ఎప్పటికీ ఎండీ మీరేనని, కాలేజీ సమస్యల పరిష్కారం కోసం తిరిగి ఆ పదవిని చేపట్టమని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది వసుధార. కానీ రిషి మాత్రం అందుకు ఒప్పుకోడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu August 15th Episode: డీబీఎస్‌టీ కాలేజీ పతనం దిశగా సాగుతోందని, మూసివేయడం ఖాయమంటూ పేపర్‌లో న్యూస్ వస్తుంది. ఆ ఆర్టికల్ చూసి రిషి షాకవుతాడు. మరోవైపు ఈ పేపర్ న్యూస్ వెనుక శైలేంద్ర కుట్ర ఉందని జగతి, మహేంద్ర అనుమానపడతారు. జగతి రూమ్‌లోకి వచ్చిన శైలేంద్ర పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ను చూపించి జగతిని నిలదీస్తాడు. కాలేజీ స్టూడెంట్స్‌ను తగ్గుతూ వస్తున్నారని, కాలేజీని హ్యాండిల్ చేయడం మీ వల్ల కాదని, ఎండీ పదవి నుంచి తప్పుకోమని జగతితో అంటాడు.
కాలేజీ ప్రతిష్ట దిగజారడానికి కారణం మీరే అంటూ జగతిపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరో అధికారం చేజిక్కించుకోవడానికి కుట్రలు పన్నుతూ ఇదంతా చేశారని, అది ఎవరో నీకు తెలుసు, మాకు తెలుసు అని అంటుంది జగతి. నీపైనే నాకు డౌట్ ఉందని శైలేంద్రతో అంటాడు మహేంద్ర.అనుమానం కాదు ఆధారాలు ఉండాలని శైలేంద్ర చెబుతాడు.
శైలేంద్ర డిమాండ్...
ఎండీ సీట్ నుంచి తప్పుకొని కాలేజీ బాధ్యతల్ని మరొకరికి అప్పగించాలని శైలేంద్ర డిమాండ్ చేస్తాడు. మా కంఠంలో ప్రాణం ఉండగా మరొకరి చేతుల్లో కాలేజీని పెట్టమని ఖరాఖండిగా శైలేంద్రకు చెబుతాడు మహేంద్ర. రిషి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఎవరూ ఏం చేయలేరని జగతి వార్నింగ్ ఇస్తుంది. ఇలాగే ఉంటే కాలేజీ మూసివేసే పరిస్థితి వస్తుందని అంటాడు శైలేంద్ర.
అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మహేంద్ర శైలేంద్ర అన్న మాట వినగానే కోపంతో ఊగిపోతాడు. శైలేంద్రపై చేయిచేసుకోవడానికి రెడీ అవుతాడు. కానీ జగతి వారిస్తుంది. నువ్వు రాక ముందు కాలేజీ, ఇళ్లు కళకళలాడుతుండేవాని, నువ్వు అడుగుపెట్టిన తర్వాత అందరికి కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని శైలేంద్రతో అంటాడు మహేంద్ర. .
ఆధారాలతో...
నువ్వు చేస్తోన్న కుట్రలకు ఆధారాలు సేకరించి ఎంత మూర్ఖుడివో అన్నయ్య ఫణీంద్రకు తెలియజేస్తానని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర. జగతి కూడా భర్త మాటల్ని సమర్థిస్తుంది. రిషిని మాకు దూరం చేయడమే కాకుండా అతడి ప్రాణాలను తీయడానికి ట్రై చేసినా అన్నయ్య క్షేమం కోసం ఆలోచించి ఇన్నాళ్లు అన్ని భరించామని, ఇలాగే మౌనంగా ఉంటే నువ్వు ఇంకా రాక్షసుడిలా మారిపోతున్నావు, నీ నిజ స్వరూపం బయటపెట్టే సమయం వచ్చేసింది, నిన్ను కాపాడటం ఎవరి తరం కాదని మహేంద్ర అంటాడు. మీరు నన్ను ఏం చేయలేరని, ఆధారాలు ఎప్పటికీ దొరకవని మహేంద్రతో ఛాలెంజ్ చేస్తాడు శైలేంద్ర.
రిషి ఆలోచనలు...
డీబీఎస్‌టీ కాలేజీకి సంబంధించి పేపర్‌లో వచ్చిన వార్త రిషిని కుదురుగా ఉండనివ్వదు. కాలేజీ గురించి సీరియస్‌గా ఆలోచిస్తుంటాడు. అతడి దగ్గరకు వసుధార వస్తుంది. ఏమైంది ఎందుకు డల్‌గా ఉన్నారని అడుగుతుంది. అది నా వ్యక్తిగతం అని వసుధారకు బదులిస్తాడు రిషి. పేపర్‌లోని వార్తను రిషికి చూపించి ఈ న్యూస్ గురించే కదా మీరు ఆలోచిస్తుందని అంటుంది వసుధార.
డీబీఎస్‌టీ కాలేజీ కుప్పకూలబోతుందని, ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని రిషిని కోరుతుంది. ఇది నాకు చెప్పడం కాదు...కాలేజీకి సంబంధించిన వాళ్లతో పరిష్కార మార్గాల్ని అన్వేషించమని చెబితే బాగుంటుందని, వాళ్లు మీతో టచ్‌లు ఉంటారు కదా వసుధారపై సెటైర్ వేస్తాడు రిషి.
కాలేజీ ఎండీ ఎప్పటికీ...
మీరు డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ అని, ఎప్పటికీ ఆ స్థానం అలాగే ఉంటుందని రిషితో అంటుంది వసుధార. కాలేజీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఒకే ఒక మార్గం ఉందని, మీరు తిరిగి కాలేజీకి వెళ్లాలని రిషికి సలహా ఇస్తుంది వసుధార. తిరిగి డీబీఎస్‌టీ కాలేజీకి వెళ్లడానికి రిషి ఒప్పుకోడు. రిషి గతాన్ని తవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ జరిగింది జరిగిపోయింది. శిక్ష అనుభవించాల్సిన వాళ్లు అనుభవిస్తూనే ఉన్నారని, స్టూడెంట్స్ భవిష్యత్తు కోసమైనా ఓ నిర్ణయం తీసుకోమని రిషిని కన్వీన్స్ చేస్తుంది వసుధార.
జగతి ధైర్యం..
డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ పదవిలో జగతి ఉందని, కాలేజీ కష్టాల్లో ఉంటే వెనకడుగు వేయదని, ధైర్యంగా సమస్యను పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఆమెకు ఉన్నాయని రిషి అంటాడు. డీబీఎస్‌టీ కాలేజీ పతనం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారని, సమస్యల్ని ఎదుర్కొనే శక్తి ఉన్నా శత్రువులు సృష్టించిన కుట్రల వల్ల జగతి ఇబ్బందులు పడుతోందని రిషికి నచ్చజెప్పాలని అనుకుంటుంది వసుధార.
కాలేజీ మూసివేసే పరిస్థితి మీరు తట్టుకోగలరా, మా గురించి ఆలోచించకపోయినా మహేంద్ర, ఫణీంద్ర గురించి ఆలోచించైనా కాలేజీ కష్టాలను తీర్చమని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ కాలేజీలో తాను అడుగుపెట్టేది లేదని, ఇక్కడి నుంచే డీబీఎస్‌టీ కాలేజీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని వసుధారకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.
ఏంజెల్ పెళ్లి...
డీబీఎస్‌టీ కాలేజీకి పూర్వ వైభవం తీసుకురావడానికి పాండ్యన్ బ్యాచ్ సహాయంతో ఓ ప్లాన్ చేస్తాడు రిషి. మరోవైపు పెళ్లి చేసుకుంటానని తాతయ్యకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టాలా ఏంజెల్ ఆలోచిస్తుంటుంది. ఎలాంటివాడైతే తనకు సరిపోతాడని మనసులోనే అనుకుంటుంది.
అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. విశ్వనాథం గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దని, నీలో ఉండే అల్లరి, ఆ చిరునవ్వు మాయమైపోయి చాలా రోజులైందని ఏంజెల్‌కు సలహా ఇస్తాడు రిషి. ఏంజెల్ భోజనం చేయలేదని తెలిసి ఆమెపై కోపగించుకుంటాడు రిషి. నీ ఆరోగ్యం పాడైపోతుందని క్లాస్ ఇస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.