తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: వ‌సుతో రాజీవ్ పెళ్లి- శైలేంద్ర ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్ - రిషి రీఎంట్రీకి టైమొచ్చింది!

Guppedantha Manasu Serial: వ‌సుతో రాజీవ్ పెళ్లి- శైలేంద్ర ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్ - రిషి రీఎంట్రీకి టైమొచ్చింది!

17 May 2024, 7:23 IST

  • Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఎండీ సీట్ కోసం రాజీవ్‌ను పోలీసుల‌కు ప‌ట్టించ‌డానికి వ‌సుధార‌తో క‌లిసి ప్లాన్‌వేస్తాడు శైలేంద్ర‌. కానీ అత‌డి ప్లాన్ రివ‌ర్స్ అయ్యి రాజీవ్ చేతిలో వ‌సుధార బందీగా మారుతుంది

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial: రాజీవ్‌ను ప‌ట్టుకోవాలంటే తాను చెప్పిన ప్లేస్‌కు వ‌సుధార మాత్ర‌మే త‌న‌తో ఒంట‌రిగా రావాల‌ని శైలేంద్ర కండీష‌న్ పెడ‌తాడు. మ‌హేంద్ర అందుకు ఒప్పుకోడు. కానీ మ‌నును జైలుకు వినిపించ‌డం కోసం శైలేంద్ర వెంట వెళుతుంది. శైలేంద్ర తో పాటు వెళుతోన్న ఏదో ఓ మూల అత‌డిపై వ‌సుధార‌కు అనుమానం క‌లుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Telugu OTT: ఈ వారం ఓటీటీలో ఆరు తెలుగు సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - ఈ క్రైమ్‌, యాక్ష‌న్ సినిమాల‌పై ఓ లుక్కేయండి!

OTT: ఓటీటీలోకి 4 భాషల్లో వంద కోట్ల బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. గ్లామర్‌, సస్పెన్స్‌కు ఫిదా కావాల్సిందే! ఎక్కడ చూడాలంటే?

Pragya Jaiswal: ఎట్ట‌కేల‌కు ప్ర‌గ్యా జైస్వాల్‌కు ఓ ల‌క్కీ ఛాన్స్ ద‌క్కింది - బాలీవుడ్ మూవీలో అక్ష‌య్ కుమార్‌తో రొమాన్స్‌

Brahmamudi June 13th Episode: బ్రహ్మముడి- అత్తను కాపాడుకున్న కావ్య- రుద్రాణిని పంపించేయమన్న రాజ్ - కోడలితో ప్రేమగా అపర్ణ

నీ ప్లాన్ వెనుక‌ ఏదైనా మ‌త‌ల‌బు ఉదా?...న‌న్ను ఇరికించాల‌ని అనుకోవ‌డం లేదా క‌దా అని అనుమానంగా శైలేంద్ర‌ను అడుగుతుంది వ‌సుధార‌. అలాంటిదేమి లేద‌ని, రాజీవ్ లొకేష‌న్‌ను పోలీసుల‌కు షేర్ చేశాన‌ని, మ‌నం వెళ్లి రాజీవ్ క‌లిసి మాట్లాడుతుండ‌గా... పోలీసులు ఎంట‌రై అత‌డిని అరెస్ట్ చేస్తార‌ని త‌న ప్లాన్ మొత్తం వ‌సుధార‌కు చెబుతాడు శైలేంద్ర‌.

రాజీవ్ ఎంట్రీ...

శైలేంద్ర‌, వ‌సుధార కారుకు అనుకోకుండా రాజీవ్ అడ్డుగా వ‌స్తాడు. అత‌డిని చూసి శైలేంద్ర‌తో పాటు వ‌సుధార షాక‌వుతారు. తాను చెప్పిన లొకేష‌న్‌లో కాకుండా ముందుగానే రాజీవ్ త‌మ‌ను క‌ల‌వ‌డంతో ఏం చేయాలో అర్థంకాని ప‌రిస్థితుల్లో ప‌డ‌తారు.

నీకు, నాకు మ‌ధ్య అడ్డుగా వ‌స్తున్నాడ‌ని నేను చ‌నిపోయిన‌ట్లు డ్రామా ఆడి...మ‌నును జైలుకు పంపించాన‌ని వ‌సుధారతో అంటాడు రాజీవ్‌. నిన్ను నా నుంచి ఇప్పుడు ఎవ‌రూ కాపాడ‌లేర‌ని వ‌సుధార‌కు చెబుతాడు రాజీవ్‌. శైలేంద్ర నా మ‌నిషి అని, నిన్ను నాకు అప్ప‌గించ‌డానికే అత‌డు వేసిన ప్లాన్ ఇద‌ని వ‌సుధార‌తో అంటాడు రాజీవ్‌.

వ‌సు కిడ్నాప్‌...

వ‌సుధార నోటికి మ‌త్తుమందు క‌లిపిన క‌ర్ఛీఫ్ అడ్డుగా పెట్టి ఆమెను స్పృహ కోల్పోయేలా చేస్తాడు రాజీవ్‌. వ‌సుధార‌ను పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు, మా పెళ్లికి పెద్ద నువ్వేన‌ని శైలేంద్ర‌తో అంటాడు రాజీవ్‌. నువ్వు మాతో రావాల‌ని ప‌ట్టుప‌డ‌తాడు. రాజీవ్‌తో వెళ్ల‌డానికి శైలేంద్ర ఒప్పుకోడు. దాంతో గ‌న్ తీసి శైలేంద్ర‌ను బెదిరిస్తాడు రాజీవ్‌. నేను చెప్పిన చోటుకు రాకుంటే లేపేస్తాన‌ని వార్నింగ్ ఇస్తాడు. త‌మ‌ను ఎవ‌రూ ఫాలో చేయ‌కుండా శైలేంద్ర ఫోన్ తీసుకొని త‌న ద‌గ్గ‌ర పెట్టుకుంటాడు రాజీవ్‌.

వ‌సుధార‌ను ఎలా సేవ్ చేయాలో తెలియ‌క శైలేంద్ర ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు వ‌సుధార‌.... శైలేంద్ర‌తో ఒంట‌రిగా రాజీవ్‌ను క‌ల‌వ‌డానికి వెళ్ల‌డంతో ఆమెకు ఎలాంటి అప‌ద జ‌రుగుతుందో అనుప‌మ భ‌య‌ప‌డుతుంది.శైలేంద్ర‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని, వ‌సుధార‌ను కాపాడ‌టానికి త‌న ప్లాన్‌లో తాను ఉన్నాన‌ని మ‌హేంద్ర ఆమెకు ధైర్యం చెబుతాడు.

పెళ్లి కొడుకుగా రాజీవ్‌...

వ‌సుధార‌ను కిడ్నాప్ చేసిన రాజీవ్ ఆమెను ఇంటికి తీసుకెళ‌తాడు. వ‌సుధార‌ను పెళ్లిచేసుకోవాల‌ని ఫిక్స‌వుతాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. పెళ్లి కొడుకుగా రాజీవ్ రెడీ అవుతాడు. రాజీవ్ బారి నుంచి త‌ప్పించుకునేందుకు వ‌సుధార ప్ర‌య‌త్నిస్తుంటంది. కానీ ఆమె పారిపోకుండా క‌ట్టేస్తాడు రాజీవ్‌. నువ్వు ఇక్క‌డినుంచి త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాద‌ని రాజీవ్ అంటాడు.

ప్లాన్ ఫెయిల్‌...

రాజీవ్‌ను ప‌ట్టిస్తాన‌ని చెప్పి న‌న్ను మోసం చేస్తావా...న‌న్నే ఇరికిస్తావా అంటూ శైలేంద్ర‌పై కావాల‌నే కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది వ‌సుధార‌. కానీ వ‌సుధార మాట‌ల‌ను రాజీవ్ తేలిగ్గా తీసుకుంటాడు. శైలేంద్ర గురించి నువ్వు ఎన్ని చాడీలు చెప్పిన నేను న‌మ్మ‌న‌ని అంటాడు.

శైలేంద్ర‌ త‌న ఫ్రెండ్ అని, అత‌డు ఎప్ప‌టికీ త‌న‌ను మోసం చేయ‌డ‌ని వ‌సుధార‌తో అంటాడు రాజీవ్‌. నిన్ను నాకు అప్ప‌గించ‌డానికే శైలేంద్ర ఈ నాట‌కం ఆడాడ‌ని వ‌సుధార‌కు చెబుతాడు రాజీవ్‌. నిజంగానే శైలేంద్ర ప్లేట్ ఫిరాయించాడ‌ని వ‌సుధార అనుమాన‌ప‌డుతుంది.

గ‌న్‌లో బుల్లెట్స్ లేవు....

రాజీవ్ బారి నుంచి వ‌సుధార‌ను కాపాడ‌టం కోసం త‌న‌కు ఓ చిన్న ప‌ని ఉంద‌ని, బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ వెంట‌నే వ‌స్తాన‌ని రాజీవ్‌కు చెబుతాడు శైలేంద్ర‌. కానీ రాజీవ్ అందుకు ఒప్పుకోడు. శైలేంద్ర‌ను గ‌న్ తీసి మ‌రోసారి బెదిరిస్తాడు. ఆ త‌ర్వాత అదే గ‌న్‌ను శైలేంద్ర చేతికి ఇచ్చి...వ‌సుధార‌తో మెడ‌లో మూడుముళ్లు వేయ‌డానికి రాజీవ్ సిద్ధ‌మ‌వుతాడు.

త‌న చేతిలో ఉన్న గ‌న్‌తో రాజీవ్‌ను బెదిరించి వ‌సుధార‌ను సేవ్ చేయాల‌ని శైలేంద్ర అనుకుంటాడు. అత‌డి ఆలోచ‌న‌ల‌ను ప‌సిగ‌ట్టిన రాజీవ్‌...ఆ గ‌న్‌లో బుల్లెట్స్ లేవ‌ని చెబుతాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం