Guppedantha Manasu Serial: రంగా కోసం వసుధార, సరోజ గొడవ -ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ట్విస్ట్ - మనుపై దేవయాని రివేంజ్
05 July 2024, 7:32 IST
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూలై 5 ఎపిసోడ్‌లో రంగాను తనకు కాకుండా వసుధార చేస్తుందని సరోజ గొడవ పడుతుంది. రంగానే రిషి అని, మా భార్యాభర్తల మధ్యలోకి నువ్వు రావోద్దని సరోజతో వసుధార వాదిస్తుంది.
గుప్పెడంత మనసు జూలై 5 ఎపిసోడ్
Guppedantha Manasu Serial: తాను రిషి కాదని రంగా ఎంత చెప్పిన వసుధార నమ్మదు. నేనే రిషి అని మీ నోటితో మీరే ఒప్పుకునేలా చేస్తానని రంగాతో ఛాలెంజ్ చేస్తుంది.అవసరమైతే తాను డీఎన్ఏ టెస్ట్‌కు సిద్ధమని రంగా కూడా వసుధారకు సవాల్ విసురుతాడు. వారిద్దరి వాదనను చాటు నుంచి సరోజ వింటుంది. రంగాను రిషిలా వసుధార మార్చేయడం ఖాయమని సరోజ కంగారు పడుతుంది. వసుధార విషయంలో ఓపిక పడితే తనకే నష్టమని అనుకుంటుంది వసుధార లెక్క ను వెంటనే తేల్చేయాలని ఫిక్సవుతుంది.
వసు కోసం ఆరాటం...
వసుధార ఎక్కడికి వెళ్లిందో, ఏమైపోయిందో తెలియడం లేదని, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మహేంద్ర వద్దంటున్నాడని ఏంజెల్‌తో మను చెబుతాడు. రిషి, వసుధార దూరమై పీకల్లోతు దుఃఖంలో ఉన్న మహేంద్రను ఎలా ఓదార్చాలో తెలియడం లేదని మను ఆవేదనకు లోనవుతాడు.
రిషి ఉన్నాడో లేడో తెలియకుండా అతడి గురించి వెతకడానికి వెళ్లి వసు తప్పు చేసిందని మను అంటాడు. రిషి అప్పగించిన కాలేజీ బాధ్యతలు వదిలిపెట్టి వెళ్లిపోయినప్పుడే ఆమె ఎంత బాధపడిందో అర్థమవుతుందని, వసును అందరూ అర్థం చేసుకుంటే ఆమె దూరమయ్యేది కాదుండేదని ఏంజెల్ చెబుతుంది. కాలేజీ శైలేంద్ర చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ఇద్దరు నిర్ణయించుకుంటారు.
ప్రేమ పక్షులకు పార్క్...
మను, ఏంజెల్ మాట్లాడుకోవడం శైలేంద్ర, దేవయాని చూస్తారు. మన కాలేజీ కొంత మందికి పార్క్‌గా మారిందని, కొన్ని ప్రేమ పక్షులు ముద్దు ముచ్చట్లు ఆడుకోవడానికి అడ్డాగా మారిందని మను, ఏంజెల్‌పై సెటైర్స్ వేస్తుంది దేవయాని. ఏ పదవి లేని నువ్వు తప్ప కాలేజీని ఎవరూ పట్టించుకోవడం లేదని కొడుకు శైలేంద్రతో అంటుంది దేవయాని.
నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది...
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదంటూ దేవయానికి వార్నింగ్ ఇస్తుంది ఏంజెల్. తండ్రి టాపిక్ తీసుకొచ్చి మరోసారి మనును అవమానిస్తుంది దేవయాని. నువ్వు కూడా మీ అమ్మలానే పెళ్లికాకుండానే సంసారం చేసేలా ఉన్నావని మనుతో అంటుంది దేవయాని. దేవయాని మాటలను ఏంజెల్ సహించలేకపోతుంది. మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోనని కోపంగా బదులిస్తుంది.
మర్యాద ఇచ్చేది లేదు...
ఇది మీ ఇళ్లు అనుకుంటున్నారా, కాలేజ్ అనుకుంటున్నారా, మీ లాంటి వాళ్లకు మర్యాద ఇచ్చేది లేదని దేవయాని, శైలేంద్ర ...ఏంజెల్‌తో వాదిస్తారు. మీరు ఎప్పుడు చూసిన కాలేజీలో రొమాన్స్ చేసుకుంటూనే కనిపిస్తున్నారని శైలేంద్ర అంటాడు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఏంజెల్ అతడికి సమాధానమిస్తుంది.
తండ్రి ఎవరో తెలియని బావ...
ఏ హక్కుతో మా కాలేజీకి వస్తున్నావని ఏంజెల్‌ను నిలదీస్తుంది దేవయాని. మా బావ దగ్గరకు రావడానికి నాకు హక్కుతో పనిలేదని ఏంజెల్ ఆన్సర్ ఇస్తుంది. తండ్రి ఎవరో తెలియని బావ, భర్త పేరు చెప్పుకోలేని అత్త అంటూ మనుపై నోరు జారుతుంది దేవయాని. దేవయాని మాటలను భరించలేకపోతారు మను, ఏంజెల్, అక్కడి నుంచి వెళ్లిపోతారు.
సరోజ గొడవ...
వసుధారతో రంగా సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె చేయి పట్టుకున్నాడని రంగా నానమ్మకు సరోజ కంప్లైంట్ ఇస్తుంది. వసుధార కిందపడబోతుంటే రంగా ఆమెను కాపాడటం అవసరమా అని గొడవ చేస్తుంది. నువ్వు కూడా వసుధారకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే ఉందని, నీ మనవడికి భార్య దొరికిందని సంబరపడుతున్నట్లుగా ఉందని నానమ్మపై సరోజ ఫైర్ అవుతుంది. రంగా కూడా వసుధార వెంట పడుతున్నాడని, రంగా పేరును రిషిగా మార్చిస్తే వాళ్లకు పెళ్లి కూడా చేయాల్సిన అవసరం కూడా ఉండదని సరోజ అంటుంది.
రంగా ఎంట్రీ...
అప్పుడే అక్కడికి రంగా ఎంట్రీ ఇస్తాడు. నోటికి ఏదవస్తే అదే మాట్లాడుతావా అంటూ సరోజపై ఫైర్ అవుతాడు. ఉన్న మాటే అన్నానని సరోజ బదులిస్తుంది. నీ ఊహలు తప్పు అని సరోజతో వాదిస్తాడు రంగా.
వసుధార ఊహలు వాస్తవాల్లోకి వస్తున్నాయని, మీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారో చెప్పమని రంగాను నిలదీస్తుంది సరోజ. అతిథిఅయిన వసుధార కోసం నువ్వు ఎందుకు అంతలా ఆరాటపడుతున్నావని, రాసుకొనిపూసుకొని ఎందుకు తిరుగుతున్నావని రంగాతో గొడవకు దిగుతుంది సరోజ. వసుధారపై నువ్వు ప్రేమ చూపిస్తున్నావని వాదిస్తుంది. నిన్ను నాకు కాకుండా వసుధార చేస్తుందని సరోజ అంటుంది.
రిషి నా భర్త...
నీకు కాకుండా చేయడం ఏంటి? రిషి నా భర్త అని, అదే నీకు అర్థం కావడం లేదని సరోజకు బదులిస్తుంది వసుధార. మేమిద్దరం భార్యాభర్తలం. మధ్యలో నువ్వెవరూ అని సరోజ నిలదీస్తుంది వసుధార.
ఏది నిజం, ఏం మాట్లాడుతున్నావని వసుధారతో గొడవ పడుతుంది సరోజ. వసుధారను ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని అంటుంది.
రంగా ఫైర్...
సరోజపై రంగా ఫైర్ అవుతాడు. వసుధారను కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. రంగా మాటకు కట్టుబడి మౌనంగా వసు వెళ్లిపోతుంది. వసుధార ఇప్పుడు బయటకు వెళితే ప్రమాదమని, రౌడీలు ఆమె గురించి వెతుకుతున్నారని రంగా అంటాడు. ఒకవేళ రౌడీల వల్ల వసుకు ప్రమాదం జరిగితే ఆ నేరం మనపైనే పడుతుందని సరోజకు అర్థమయ్యేలా వివరిస్తాడు రంగా.
కొన్నాళ్లలో అన్ని సర్ధుకుంటాయని, తొందరలోనే నేను రిషి కాదు రంగా అని వసుధార నమ్మేలా చేస్తానని రంగా అంటాడు. ఇంకోసారి వసుధార విషయంలో నాతో గొడవలు పడితే బాగుండదని సరోజకు సర్ధిచెబుతాడు.
పెళ్లి చేసుకునేది లేదు...
తొందరలోనే మనం పెళ్లిచేసుకుందామని, ఆ లోపు వసుధారను ఇక్కడి నుంచి పంపేయమని రంగాతో అంటుంది సరోజ. నిన్ను పెళ్లిచేసుకుంటానని నేను ఎప్పుడూ చెప్పలేదని రంగా అంటాడు. నిన్నే నా భర్తగా చిన్నప్పటి నుంచి ఊహించుకున్నానని, ఇప్పుడు కాదంటే కుదరదని సరోజ బదులిస్తుంది.
సరోజ మాటలను పట్టించుకోకుండా రంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నువ్వు ప్రతిసారి రంగాపై అరిస్తే అతడు నీకు దూరమవుతాడని సరోజకు సర్ధిచెబుతుంది నాయనమ్మ. ప్రేమతోనే అతడిని దారిలోకితెచ్చుకోమని సలహా ఇస్తుంది. అక్కడితో గుప్పెడంత మనసు జూలై 5 నాటి ఎపిసోడ్ ముగిసింది.