NG Ranga AG Diploma: ఎన్జీ రంగా అగ్రికల్చర్ వర్శిటీ డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు-application deadline extension for ng ranga agriculture varsity diploma admissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ng Ranga Ag Diploma: ఎన్జీ రంగా అగ్రికల్చర్ వర్శిటీ డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

NG Ranga AG Diploma: ఎన్జీ రంగా అగ్రికల్చర్ వర్శిటీ డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jul 05, 2024 07:08 AM IST

NG Ranga AG Diploma: ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీలో అగ్రిక‌ల్చ‌ర్‌ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగించారు.జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఎన్జీరంగా యూనివ‌ర్శిటీ నిర్ణ‌యించింది.

అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగింపు
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగింపు (PTI)

NG Ranga AG Diploma: ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీలో డిప్లొమా కోర్సుల అడ్మిషన్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించారు. జూలై 10 వ‌ర‌కు పొగిడిస్తూ ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్‌ యూనివ‌ర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) నిర్ణ‌యం తీసుకుంది.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్‌ యూనివ‌ర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) డిప్లొమా ప్రొగ్ర‌మ్స్‌కు సంబంధించి 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి అడ్మిష‌న్ కోసం మే 30న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 1 నుంచి ప్రారంభించ‌గా, చివ‌రు తేదీ జూన్ 20న నిర్ణ‌యించింది. అయితే ప్ర‌స్తుతం దాని గ‌డువును జూలై 10 వ‌ర‌కు పొడిగించింది.

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త అయిన‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అర్హులు. ఎస్ఎస్‌సీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్‌, ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్‌ బోర్డుల నుంచి ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. ప‌దో త‌ర‌గ‌తిలో రెగ్యూల‌ర్‌గా పాస్‌తో పాటు స‌ప్లమెంట‌రీలో పాస్ అయిన వారు, ఇంట‌ర్మీడియట్ ఫెయిల్ అయిన‌వారు కూడా అర్హులే. అయితే ఇంట‌ర్మీడియ‌ట్ పాస్ అయిన వారు మాత్రం అప్లై చేయ‌డానికి అన‌ర్హులు. 2024 ఆగ‌స్టు 31 నాటికి 15 ఏళ్లు పూర్తి అవ్వాలి. 22 ఏళు వ‌ర‌కు అర్హులు. అంటే 2002 ఆగ‌స్టు 31 నుంచి 2009 ఆగ‌స్టు 31 మ‌ధ్య పుట్టిన వారై ఉండాలి.

ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, లేదా ప‌దో ఎస్ఎస్‌సీకి స‌మాన ప‌రీక్ష స‌ర్టిఫికేట్‌, నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, ఎస్ఎస్‌సీ టీసీ, మైగ్రేష‌న్ స‌ర్టిఫికేట్‌, రూర‌ల్ ఏరియా విద్యార్థులు నాన్ మున్సిప‌ల్ ఏరియి స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, విక‌లాంగు విద్యార్థులైతే పిహెచ్ స‌ర్టిఫికేట్‌, డిఫెన్స్ పిల్ల‌లైతే ఐడీ కార్డు, ఎన్‌సీసీ అభ్య‌ర్థులైతే ఎన్‌సీసీ స‌ర్టిఫికేట్‌, స్పోర్ట్ అభ్య‌ర్థులైతే స్పోర్ట్స్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి. ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌న్నీ అడ్మిష‌న్ స‌మ‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి?

ఏఎన్‌జీఆర్ఏయూ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://polytechnicadmissionsangrau.aptonline.in/ANGRAUPOLY/ క్లిక్ చేస్తే అప్లికేష‌న్ ఫామ్ అనే ఉంటుంది. అందులో మొద‌టి ఆప్ష‌న్ రిజిస్ట్రేష‌న్ పై క్లిక్ చేస్తే ఒక బాక్స్ వ‌స్తుంది. దాంట్లో ఎస్ ప్రొసిడ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అలా చేసిన త‌రువాత అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. సెలక్ట్ బోర్డు బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివిన‌ బోర్డుపై ఎంపిక చేసుకోవాలి. దాని ప‌క్క బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి ఎలా పాస్ అయ్యామో ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే రెగ్యూల‌ర్‌, లేక స‌ప్ల‌మెంట‌రీనా ఒక‌దానిని ఎంపిక చేసుకోవాలి. త‌రువాత బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి హాల్ టిక్కెట్టు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. ఆ ప‌క్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంట‌ర్ చేయాలి. అలా పూర్తి చేసిన త‌రువాత స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ వివ‌రాలు ఎంట‌ర్ చేసిన త‌రువాత, పూర్తి వివ‌రాలు కోరుతూ అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.400 కాగా, ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.800 నిర్ణ‌యించారు. ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

మొత్తం సీట్ల‌లో 75 శాతం సీట్లు నాన్ మున్సిప‌ల్ (రూర‌ల్‌) ప్రాంతాల్లో క‌నీసం నాలుగేళ్లు చ‌దివిన వారికి కేటాయిస్తారు. అంటే 1 త‌ర‌గ‌తి నుంచి 10 త‌ర‌గ‌తి మ‌ధ్య నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చ‌ద‌వాలి. 25 శాతం సీట్లు మున్సిప‌ల్ ప్రాంతాల్లో చ‌దివిని వారికి కేటాయిస్తారు.

85 శాతం సీట్లు స్థానిక‌ విద్యార్థుల‌కు రిజ‌ర్డ్వ్ చేశారు. 15 శాతం సీట్లు అన్ రిజర్డ్వ్, మెరిట్ బేస్ మీద కేటాయిస్తారు. ఈ 85 శాతం సీట్లలో 42ః22 నిష్ప‌త్తిలో ఆంధ్ర యూనివ‌ర్శిటీ (ఏయూ) రీజియ‌న్ (శ్రీ‌కాకుళం, విజ‌య‌నగ‌రం, విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్టా, గుంటూరు, ప్ర‌కాశం), శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ (ఎస్‌వీయూ) రీజియ‌న్ (చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూల్‌, క‌డ‌ప‌, నెల్లూరు) కేటాయిస్తారు.

ఎన్ని కోర్సులు ?

ఏఎన్‌జీఆర్ఏయూ నాలుగు డిప్లొమా కోర్సులను అందిస్తుంది. అందులో డిప్లొమా అగ్రిక‌ల్చ‌ర్‌ కోర్సు, డిప్లొమా సీడ్ టెక్నాల‌జీ, డిప్లొమా ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్, డిప్లొమా అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌ కోర్సును ఏఎన్‌జీఆర్ఏయూ అందిస్తుంది. డిప్లొమా అగ్రిక‌ల్చ‌ర్‌ కోర్సు, సీడ్ టెక్నాల‌జీ కోర్సు, ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు రెండేళ్లు కాల వ్య‌వ‌ధి ఉంటుంది. అయితే అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌ కోర్సు మాత్రం మూడేళ్ల కాల వ్య‌వ‌ధి ఉంటుంది.

రాష్ట్రంలో మొత్తం 688 గ‌వ‌ర్న‌మెంట్ సీట్లు కాగా, 2,530 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 10 శాతం సూప‌ర్‌న్యూమ‌రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా అగ్రిక‌ల్చ‌ర్‌ కోర్సులో ప్ర‌భుత్వ కాలేజీల్లో 578 సీట్లు ఉన్నాయి. అలాగే అనుబంధ కాలేజీల్లో 1,900 సీట్లు ఉన్నాయి. డిప్లొమా సీడ్ టెక్నాల‌జీ కోర్సులో 25 గ‌వ‌ర్న‌మెంట్ సీట్లు, 260 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సులో ప్ర‌భుత్వ కాలేజీల్లో 25 సీట్లు ఉన్నాయి. అలాగే అనుబంధ కాలేజీల్లో 40 సీట్లు ఉన్నాయి. డిప్లొమా అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్ కోర్సులో ప్ర‌భుత్వ కాలేజీల్లో 60 సీట్లు ఉన్నాయి. అలాగే అనుబంధ కాలేజీల్లో 330 సీట్లు ఉన్నాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel