Guppedantha Manasu April 19th Episode: మహేంద్రతో మను గొడవ - రిషి తండ్రికి అండగా వసు - దేవయాని కుట్రలకు చెక్
19 April 2024, 7:12 IST
Guppedantha Manasu April 19th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్లో మహేంద్ర తనను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు శైలేంద్ర ద్వారా మను తెలుసుకుంటాడు. తనకు చెప్పకుండా మహేంద్ర తీసుకున్న నిర్ణయంపై మను ఫైర్ అవుతాడు.
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu April 19th Episode: మను తండ్రిని తానే అంటూ మహేంద్ర చేసిన ప్రకటనను కుటుంబసభ్యులతో పాటు కాలేజీ బోర్డ్ మెంబర్స్ కూడా తప్పుపడతారు. మహేంద్ర వల్ల కాలేజీ పరువు మొత్తం పోయిందని మహేంద్రపై ఫైర్ అవుతారు. బోర్డ్ మెంబర్స్ మాటలతో హర్ట్ అయిన మహేంద్ర కాలేజీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తాడు.
మనును దత్తత...
మను తండ్రిని తానే అంటూ చెప్పిన మాటను నిజం చేయాలని మహేంద్ర ఫిక్సవుతాడు. మనును దత్తత తీసుకోబోతున్నట్లు చెబుతాడు. అతడి నిర్ణయంతో వసుధార, అనుపమ షాకవుతారు. దత్తత గురించి చెప్పకుండా తాను ఓ ఫంక్షన్ చేయబోతున్నట్లు , ఆ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి మీ ఇంటికి రాబోతున్నట్లు దేవయానితో చెబుతాడు మహేంద్ర.
అతడు చేస్తోన్న ఫంక్షన్ ఏమై ఉంటుందా అని శైలేంద్రతో పాటు దేవయాని తెగ అలోచిస్తారు. అదేమిటన్నది ఎంత ఆలోచించినా వారికి అంతుపట్టదు. మహేంద్ర, మను కలిసి మనకు పోటీగా మరో కాలేజీ పెట్టబోతున్నారు కావచ్చునని శైలేంద్ర అనుమానం వ్యక్తంచేస్తాడు. అతడి మాటలతో ఫణీంద్ర ఫైర్ అవుతాడు.
వసుధార అనుమానం...
మనును దత్తత తీసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అనుపమ చాలా బాధపడుతోందని మహేంద్రతో అంటుంది వసుధార. దత్తత తీసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమోనని అంటుంది. అనుపమను బాధ నుంచి బయటపడేయాలన్నదే తన ప్రయత్నమని వసుధారకు బదులిస్తాడుమహేంద్ర. కొన్ని కఠిన నిజాలు బయటపడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెబుతాడు.
మను అసలు తండ్రి బయటకు రావాలనే ఈ ప్రయత్నాలు చేస్తున్నానని, ఇలాంటివి చేస్తేనైనా అనుపమ నోరు విప్పి అన్ని నిజాలు చెప్పే అవకాశం ఉందని వసుధారతో అంటాడు మహేంద్ర. అనుపమ నోరు తెరవడం ఆలస్యం మను అసలు తండ్రిని తీసుకొస్తా...ఒకవేళ ఆమె చెప్పకపోతే మనుకు తండ్రిగా నేను ఉంటా. ఒక కుటుంబాన్ని తండ్రి ఎలా రక్షిస్తాడో అలా భరోసా కల్పిస్తా...తండ్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు నెరవేస్తానని సమాధానమిస్తాడు.
ఫణీంద్ర షాక్...
మహేంద్ర ఎంత చెప్పిన వసుధార కన్వీన్స్ కాలేకపోతుంది. ఈ విషయం గురించి ఇంకోసారి ఆలోచించమని అంటుంది. దత్తత గురించి అన్నయ్య ఫణీంద్రకు చెప్పడానికి వసుధారతో కలిసి అతడి ఇంటికి వెళతాడు మహేంద్ర. అతడు ఏం చెబుతాడోనని దేవయాని, శైలేంద్ర కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
మనును దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు ఫణీంద్రతో అంటాడు మహేంద్ర. అతడి మాట వినగానే ఫణీంద్రతో పాటు దేవయాని, శైలేంద్ర షాకవుతారు. ఆలోచించే ఇలాంటి పనులు చేస్తున్నావా తమ్ముడిని అడుగుతాడు ఫణీంద్ర. ఆలోచిస్తే ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాడు అంటూ దేవయాని ఫైర్ అవుతుంది.
రిషిని వదిలేశారా...
మనును దత్తత తీసుకొని రిషిని వదిలేస్తారా అంటూ శైలేంద్ర కోపంగా మహేంద్రతో అంటాడు. రిషిని వెతికితీసుకొస్తానని అన్నారు. ఇప్పటివరకు అతడి గురించి ఏం తెలియలేదు. ఆ విషయాన్ని పక్కనపెట్టి ఇప్పుడు మనును దత్తత తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అంటూ శైలేంద్రతో కోపంగా అంటాడు మహేంద్ర.
మహేంద్రతో శైలేంద్ర గొడవ...
మనును దత్తత తీసుకోవడానికి నేను ఒప్పుకోనని మహేంద్రతో అంటాడు శైలేంద్ర. నువ్వేంటి ఒప్పుకునేది అంటూ శైలేంద్రకు ధీటుగా బదులిస్తాడు. గొడవ పెద్దది కావడంతో ఫణీంద్ర జోక్యం చేసుకొని శైలేంద్ర నోరు మూయిస్తాడు. మహేంద్ర చేస్తున్న పనిని నువ్వైన ఆపమని వసుధారతో అంటాడు ఫణీంద్ర. వసుధార కూడా మహేంద్రనే సమర్థిస్తుంది.
మనును దత్తత తీసుకునే నిర్ణయాన్ని వాయిదావేసుకోమని తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర. ఇప్పటివరకు ఎప్పుడు మీ మాట కాదనలేదు. ఈ విషయంలో మాత్రం మీరు ఎన్ని చెప్పిన నా మనసు మార్చుకోలేను. నా నిర్ణయం మారదు అని అంటాడు. దేవయాని ఏదో మాట్లాడబోతుండగా ఆమెను ఆపేస్తాడు మహేంద్ర. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చాను. అంతే కానీ మీ పర్మిషన్ తీసుకోవడానికి రాలేదని అంటాడు. మనును దత్తత తీసుకునే వేడుకకు అందరు రావాలని ఫణీంద్ర ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తాడు మహేంద్ర.
శైలేంద్ర ఆవేశం...
మహేంద్ర వెళ్లిపోగానే ఆవేశం పట్టలేక మనుకు ఫోన్ చేస్తాడు శైలేంద్ర. మను లిఫ్ట్ చేయగానే..ఏం ప్లాన్స్రా...ఏం నటన రా...మీవి భలే రాజకీయాలు అంటూ మనుపై సెటైర్స్వేస్తాడు శైలేంద్ర. శైలేంద్ర దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియక మను కన్ఫ్యూజ్ అవుతాడు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్ని నువ్వే రచించి ఏం తెలియనట్లు భలే నాటకాలు ఆడుతున్నావని మనుపై కొప్పడుతాడు. అతడి మాటలను భరించలేక మను ఫోన్ కట్ చేస్తాడు.
మనుకు అవమానం...
మహేంద్ర నిన్ను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడట...ఇది నా ప్లానా...మీ అమ్మ, నువ్వు కలిసి వేసిన ప్లానా అంటూ మనుపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. దాని గురించి నాకు ఏం తెలియదని మను చెప్పిన శైలేంద్ర మాత్రం అతడి మాటలు వినడు. నీకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటూ ఎగతాళిగా మాట్లాడుతాడు.
ఇన్నాళ్లు నీకు నిజంగానే నీకు తండ్రి ఎవరో తెలియదని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ప్లాన్ చూస్తుంటే డౌట్ వస్తుంది. నీ అసలు తండ్రి బతికే ఉన్నాడా? అతడిని నువ్వు, నీ తల్లి కలిసి చంపేశారా అంటూ అవమానిస్తాడు. శైలేంద్ర మాటలతో మను కోపం పట్టలేకపోతాడు. ఫోన్ కట్ చేసి ఆవేశంగా మహేంద్ర ఇంటికి వెళతాడు. కానీ మహేంద్ర ఇంట్లో ఉండడు. అతడు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయాలని ఫిక్సవుతాడు.
దేవయాని కంగారు...
మనును మహేంద్ర దత్తత తీసుకోవడం వల్ల తమకు చాలా నష్టం జరుగుతుందని దేవయాని టెన్షన్ పడుతుంది. శైలేంద్ర మాత్రం ఆనందంగా కనిపిస్తాడు. మనును దెబ్బ కొట్టడానికి ఇక నుంచి రాజీవ్‌తో పని లేదని, మనమిద్దరం చాలని అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.