తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: సత్యం పీకలమీదకి వచ్చిన రవి పెళ్లి- సాక్షిగా మీనా సంతకం- సురేంద్ర రచ్చ- అరెస్ట్

Gundeninda Gudigantalu Today Episode: సత్యం పీకలమీదకి వచ్చిన రవి పెళ్లి- సాక్షిగా మీనా సంతకం- సురేంద్ర రచ్చ- అరెస్ట్

Sanjiv Kumar HT Telugu

09 October 2024, 11:29 IST

google News
  • Gundeninda Gudigantalu Serial October 9th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో గుడిలో శ్రుతి రవి పెళ్లి చేసుకుంటారు. అది చూసిన మీనా తెగ ఆవేశపడిపోతుంది. కానీ, ఆఖరుకు అంతా నచ్చజెప్పడంతో సాక్షి సంతకం పెడుతుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్‌లో..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌

గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మీనాను రెడీ అని రవి అడుగుతాడు. గుడిలో రవికి, శ్రుతికి పెళ్లి కార్యక్రమం జరిపిస్తాడు పంతులు. మరోవైపు పక్కన ఉన్న అతనితో మా సుమతీ పెళ్లి దండలు ఇవ్వడానికి వెళ్లిందా.. పెళ్లి చూడటానికి వెళ్లిందా అని అడుగుతుంది. దానికి తెలీదమ్మా అని అతను అంటాడు.

రవి డల్‌గా ఉండటంతో పెళ్లి ఇష్టంలేనట్లు అలా ఉన్నావేంటీ అని శ్రుతి అంటుంది. ఇంట్లోవాళ్లను కాదని చేసుకుంటున్నాం అని రవి అంటాడు. నేను కూడా అలాగే వచ్చాను కదా. ముందు కోప్పడుతారు. తర్వాత వాళ్లే సర్దుకుంటారు. ముందు ఈ క్షణాన్ని ఆస్వాదించు వంటబ్బాయి అని శ్రుతి అంటుంది. త్వరగా తాళి కట్టించండి అని సుమతి అంటే.. తంతు పూర్తి కావాలి కదా. దీవించడానికి ఎవరు లేరని పంతులు అంటాడు.

జరిగేది మా ఫ్రెండ్ పెళ్లే

ఒకరున్నారు అని శ్రుతి అంటే.. ఎవరని సుమతి అడుగుతుంది. కాసేపట్లో వస్తారు. చూడు అని శ్రుతి అంటుంది. సుమతి అందరికీ అక్షింతలు ఇస్తుంది. పెళ్లయిన వాళ్లు ఆశీర్వదించడానికి వస్తారా.. అది ఎవరబ్బా అని సుమతి ఆలోచిస్తుంది. ఇంతలో శ్రుతి ఫ్రెండ్ వచ్చి మీనా దగ్గర మూరలు కొంటుంది. మీనా తెలియడంతో మాట్లాడుతుంది. జరిగేది మా ఫ్రెండ్ పెళ్లే అని దండలు తీసుకెళ్తుంది శ్రుతి ఫ్రెండ్. పీటల మీద కూర్చున్న రవికి బాలు వీడియో కాల్ చేస్తాడు.

దాంతో బాలు అన్నకు తెలిసిపోయిందేమో అని రవి కంగారుపడతాడు. కాసేపు అయ్యాకా ఎలాగు తెలుస్తుంది. కాలే కదా కట్ చేసేయ్. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వరు అని శ్రుతి అంటుంది. దాంతో రవి కాల్ కట్ చేస్తాడు. తర్వాత మీనాకు కాల్ చేస్తాడు బాలు. దానికి మీనా భయపడిపోతుంది. నేనేమైనా పెళ్లి చేయడానికి వచ్చానా. టైమ్ ఇవ్వమని అడగటానికే కదా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది మీనా. ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా. గుడిలోనే కదా ఉన్నావ్ అని బాలు అంటాడు.

దాంతో మీనా షాక్ అవుతుంది. చుట్టూ చూస్తుంది. ఎందుకు కంగారుపడుతున్నావ్. మీ అమ్మ దగ్గరికే వెళ్లావ్ కదా. ఇంటికి ఫోన్ చేస్తే నాన్న రవితో గుడికి వెళ్లావని చెప్పారు అని బాలు అంటాడు. రవి ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాడట అని మీనా అంటుంది. మా నలభీమకు ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందో సరే. నీకు గాజులు తీసుకుంటున్నాను. నాకు సైజ్ తెలియదు. కలర్ ఏది నచ్చిందో చూసి చెప్పు అని బాలు అంటాడు.

పిచ్చినా మీనాచ్చి

ఈ ఫోన్ నుంచి కుదరదు కదా అని మీనా అంటే.. అందుకే రవికి కాల్ చేశాను. రవి ఫోన్ నుంచి కాల్ చేయవే తింగరబుచ్చి.. పిచ్చినా మీనాచ్చి అని బాలు అంటాడు. సరే అని గుడి లోపలికి వెళ్తుంది మీనా. మరోవైపు తాళి ఇచ్చి మాంగళ్యధారణ కానివ్వు అని పంతులు చెబుతాడు. శ్రుతికి రవి తాళి కడుతాడు. రవి కోసం వెతుక్కుంటూ వెళ్లిన మీనా శ్రుతి పెళ్లి చూస్తుంది. రవి, శ్రుతిని పెళ్లి పీటలపై చూసి షాక్ అవుతుంది. రవి అని గట్టిగా అరుస్తుంది.

అది విని రవి, సుమతి షాక్ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకున్నావా.. పెళ్లి అయిపోయిందా. ఏంటిది. నేను చూస్తుంది నిజమేనా అని మీనా అడుగుతుంది. నాకు ఏం చెప్పి తీసుకొచ్చావ్. నువ్ ఏం చేశావ్. శ్రుతితో మాట్లాడుతా అనేగా చెప్పావ్. నన్ను బయట నిల్చోబెట్టి నువ్ లోపల పెళ్లి చేసుకున్నావా. ఏం జరుగుతోంది అని మీనా అంటుంది. వదినా టెన్షన్ పడకు అని రవి అంటే.. ఏయ్.. ఆపు.. ఏంటీ టెన్షన్ పడొద్దా.. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అని మీనా అంటుంది.

నువ్వు.. నువ్వేనా.. నన్ను ఇంత దారుణంగా నమ్మిస్తావా. మా అందరిని మోసం చేస్తావా. ఏ ఉద్దేశంతో ఈ పెళ్లి చేసుకున్నావ్. రాత్రి నా మాట విన్నావే. వచ్చేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా అని మీనా కోప్పడుతుంది. ఒప్పుకోరని నేనే వద్దన్నాను అని శ్రుతి అంటే.. హేయ్.. ఆపవమ్మా అని వారిస్తుంది మీనా. ఆరోజు నువ్ ఆవేశంగా వచ్చినప్పుడే మావయ్యకు చెప్పుంటే ఇక్కడికిదాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా. మధ్యలో నన్ను పిచ్చిదాన్ని చేసి పెళ్లికి ఎందుకు రప్పించారు అని మీనా ఫైర్ అవుతుంది.

సుమతి తప్పు లేదు

సుమతి నువ్ కూడా వీళ్లతో కలిసిపోయావా. దగ్గరుండి పెళ్లి జరిపించావా అని సుమతిని తెగ కొడుతుంది. ఎందుకు చేశావ్ అని కొడుతుంది అని మీనా. దాంట్లో సుమతి తప్పు లేదు. నేనే అడిగాను అని రవి అంటాడు. నువ్ ఎవరినైనా అడుగుతావని ఇప్పుడే తెలిసిందయ్యా. ఏమే నీకేనా భయం ఉండాలి కదా అని మళ్లీ సుమతిని కొడుతుంది మీనా. ఏమే ఇలా కూడా నన్ను బతకనివ్వరా. ఇప్పటికే శివ గాడు చేసిన పనికి దొంగలుగా ముద్ర పడింది. నువ్ కూడా నన్ను మాటలు పడేలా చేశావు అని మీనా అంటుంది.

నేను చచ్చేంతవరకు మా అత్త నన్ను క్షమిస్తుందా. నాకేందుకే చెప్పలేదు అని మీనా అంటుంది. అక్క అని సుమతి పిలిస్తే.. అక్క అని పిలవకు. అమ్మకు తెలిస్తే గుండె పగిలి చస్తుందే అని మీనా అంటుంది. వదినా నిన్ను ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆవేశపడొద్దు. నువ్వైనా నన్ను అర్థం చేసుకో అని రవి అంటాడు. నాకు మాయ మాటలు చెప్పి తీసుకొచ్చావ్. మీ అన్న నన్ను క్షమిస్తారా. మీ అమ్మ ఇంట్లో ఉండనిస్తారా. ఎందుకమ్మా ఇంత మోసం చేశావని మీ నాన్న అంటే ఏం చెప్పను అని మీనా ఆవేదనగా చెబుతుంది.

నన్ను మోసం చేసినందుకు నాకు బాధగా లేదు. మీ నాన్నను ఎలా మోసం చేశావయ్యా. మీ పెద్దన్నయ్య అన్ని లక్షలు తీసుకుని పారిపోయి ఆయన గుండెల్లో చిచ్చు పెట్టాడు. మీ బాలు అన్నయ్య తాగి వచ్చి గొడవ చేస్తూ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. నువ్వైనా ప్రయోజకుడివి అయి ఆయన చెప్పినట్లు వింటావని అనుకున్నాడు. నాలుగు రోజులు ఆగి ఆయనకి చెప్పి పెళ్లి చేసుకుంటే ఆయనకు ఇంత మోసం జరిగేది కాదు కదా అని మీనా అంటుంది.

ఆశీర్వదించు వదినా

మీనా గారు మీరు బాధపడకండి. ఏం జరిగినా మేం ఎదుర్కొంటాం. మాకు తెలుసు అని శ్రుతి అంటుంది. అలా తెలిస్తే ఇలా చేసుకోరు. ఎన్ని గొడవలు ఉన్నాయో.. ఇప్పుడు అవి ఎంత పెద్దవి అవుతాయో, బాలు మీద మీ నాన్న ఎంత కక్ష కడతారో తెలుసా. ఏ పాపం చేయని నన్ను దోషిగా ఎందుకు చేశావ్ అని మీనా అంటుంది. పెద్ద వాళ్ల ఆశీర్వాదం తీసుకోలేకపోయాను. మొదటి నుంచి నన్ను ప్రేమగా చూస్తున్నావ్. నీ ఆశీర్వాదం అయినా ఉండాలని. అన్ని మర్చిపోయి మమ్మల్ని ఆశీర్వదించు వదినా అని రవి అంటాడు.

తల్లిని, తండ్రిని, అన్నయ్యను వదిలి నన్ను ఆశీర్వదించమంటున్నావా. నాకు అంత ధైర్యం లేదు. అంత గొప్ప మనసు లేదు. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్లి ఏం చెప్పాలి. మీ అన్నయ్య ఆవేశాన్ని ఎలా తట్టుకోని నిలబడాలి. నాకు గుండె దడదడలాడుతోంది. దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకున్నావ్ కదా. ఆ దేవుడినే సాక్ష్యం అడుగు. ఆశీర్వాదం అడుగు. నేను మాములు మనిషిని అని వెళ్లిపోతుంది అని మీనా వెళ్లిపోతుంటుంది. రవి ఆపుతాడు.

నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిదానివి. నీ ఆశీర్వాదం కోసమే నిన్ను తీసుకొచ్చాను అని రవి అంటాడు. మీ మంచి మనసుతో ఆశీర్వదిస్తే మాకు మంచి జరుగుతుందని నేనే తీసుకురుమ్మాను. మీరు వచ్చినట్లు ఎవరికీ చెప్పం అని శ్రుతి అంటుంది. అమ్మా మీరు గొడవ పడి వెళ్లిపోతే గుడికి చెడ్డ పేరు వస్తుంది. అందరు సంతకాలు చేసే వెళ్లాలి అని పంతులు అంటాడు. మరొక పంతులు వచ్చి మీనా జరిగిందేదో జరిగిపోయింది. నీ మరిదే కదా ఆశీర్వదించి వెళ్లు అని అంటాడు.

సంతకం చేస్తే చాలు

అయ్యా సాక్షి సంతకం కూడా చేయాలని చెప్పండి అని పంతులు అంటాడు. ఏం రవి నేను ఇలా కూడా బతకడం ఇష్టంలేదా. నేను సంతకం చేస్తే.. మొత్తం నా మెడకు చుట్టుకుంటుంది. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిగినట్లు అవుతుంది. నా సంతకం నా బతుకునే మారుస్తుంది. నా కాపురంలో చిచ్చు పెట్టింది అని మీనా అంటుంది. అలా ఏం జరగదు. కుటుంబ పెద్దగా సంతకం చేస్తే చాలు అని రవి అంటాడు. ఇప్పటివరకు ఆశీర్వాదం కోసం అన్నావ్. కానీ, సంతకం కోసమా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని మీనా అంటుంది.

లేదు వదినా. నన్ను నమ్ము వదినా అని రవి అంటుంది. ఇదంతా రికార్డ్ కోసమే. ఇది మీ ఇంట్లో తెలిసే అవకాశం లేదు అని పూజారి అంటాడు. మీరు కూడా నన్నే అడుగుతున్నారా అని మీనా అంటుంది. నీ చేత్తో పూలమాలలు ఇస్తేనే ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. నీ కొడుకు లాంటి వాడికి ఆ మాత్రం చేయలేవా. ఏ సంశయాలు పెట్టకుండా సంతకం పెట్టమ్మా. వీళ్ల కాపురం బాగుంటుంది అని పూజారి అంటుంది.

దాంతో కన్నీళ్లు పెట్టుకున్న మీనా వెళ్లి సంతకం పెడుతుంది. బాలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రేయ్ సత్యం రారా బయటకు అని సురేంద్ర గొడవపడతాడు. మా ఇంటికి వచ్చి అరుస్తున్నావ్. నేను ఏం చేశాను అని సత్యం అంటాడు. ఎక్కడ నా కూతురు. నా కూతురుని ఏం చేశారు అని సురేంద్ర అంటాడు. ఆయన్ను ఇంకోమాట అంటే పెద్దమనిషివి అని కూడా ఊరుకోను అని ప్రభావతి అంటుంది.

సత్యం అరెస్ట్

చేయని నేరానికి ఎన్నిసార్లు మమ్మల్ని బజారుకు ఈడుస్తావురా అని సురేంద్ర కాలర్ పట్టుకుంటాడు సత్యం. ఇద్దరు గొడవపడతారు. ఇంతలో పోలీసులు వస్తారు. ఆయన కూతురు కనిపించట్లేదు. అందుకే మాట్లాడటానికి పోలీస్ స్టేషన్‌కు రమ్మంటున్నాం అని పోలీసు అంటాడు. దాంతో సత్యంను పోలీస్ కారులో తీసుకెళ్తాడు. అప్పుడు ఆటోలో వచ్చిన మీనా.. బాలుకు కాల్ చేసి మావయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు చెబుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం