Gundeninda Gudigantalu Serial:ఇంట్లో వాళ్లకు తెలియకుండా రవి, శృతి పెళ్లిచేసుకోవాలని ఫిక్సవుతారు. మీనా చెల్లెలు సుమతిని సాయం అడుగుతారు. అక్క కాపురంతో పాటు బాలు కోసం గుర్తొచ్చి రవికి సాయం చేయడానికి సుమతి ఒప్పుకోదు. ఈపెళ్లి జరగకపోతే తాము చనిపోతామని రవి, శృతి అనడంతో భయంగానే వారికి సాయం చేస్తానని మాటిస్తుంది.
సంజుతో పెళ్లి జరిగే వరకు శృతిని బయటకు పంపించకుండా రూమ్‌లోనే బంధించి ఉంచుతారు శోభన, సురేంద్ర. సుమతిని జాహ్నవిగా తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది శృతి. జాహ్నవి పెళ్లి రెండు రోజుల్లో ఉందని, తన పెళ్లికి వెళ్లాలని తల్లిదండ్రులతో అంటుంది ఈ పెళ్లి సాకుతో ఇంట్లో నుంచి బయటపడాలని స్కెచ్ వేస్తుంది. కానీ ఆమె ప్లాన్ ఫెయిలవుతుంది. తనను తల్లిదండ్రులు ఇంట్లో నుంచి కాలు బయట అడుగుపెట్టనివ్వరని అర్థం చేసుకున్న శృతి మరో స్కెచ్ వేస్తుంది. కరెక్ట్‌గా పెళ్లి టైమ్‌కు గుడి దగ్గరకు చేరుకునేలా ప్లాన్ వేస్తుంది.
పెళ్లి కోసం రవి టిప్‌టాప్‌గా రెడీ అవుతాడు. బయటకు వెళుతున్నానని అర్జెంట్ పని ఉందని తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతాడు. కొడుకు దొంగ పెళ్లి గురించి తెలియని ప్రభావతి, సత్యం...రవితో పెళ్లి గురించే మాట్లాడుతారు. మీ అమ్మ నీ కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టిందని కొడుకుతో అంటాడు సత్యం. త్వరలోనే మంచి సంబంధం చూసి నీ పెళ్లి జరిపించాలని అనుకుంటున్నామని అంటాడు. సురేంద్ర ఇచ్చిన వార్నింగ్ దృష్టిలో పెట్టుకొని శృతికి రవి దూరం కావాలంటే కొడుకుకు వెంటనే పెళ్లిచేయడమే మంచిదని సత్యం అనుకుంటాడు.
శృతిని పెళ్లిచేసుకోవడానికి గుడికి బయలుదేరుతున్న రవి తలపై గట్టిగా దెబ్బతగులుతుంది. అది చూసి ప్రభావతి, సత్యంతో పాటు మీనా కంగారుపడతారు. బయటకు వెళుతున్నప్పుడు దెబ్బ తగిలితే వెళ్లిన పని జరగదని రవితో సత్యం అంటాడు. తండ్రి మాటలు విని రవి కంగారు పడతాడు.
బాలు ఊళ్లో లేకపోవడంతో ఇదే కరెక్ట్‌గా టైమ్‌గా భావించిన మీనా... శృతితో మాట్లాడి ఆమెను వేరే పెళ్లికి ఒప్పించాలనుకుంటుంది. రవి, శృతిల సమస్యను సాల్వ్ చేయాలని అనుకుంటుంది. శృతి ఇంటికి బయలుదేరుతుంది. మీనా వాలకం చూసి ఏదో పెళ్లికి వెళుతున్నట్లుగా తయరయ్యావని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. శృతి దగ్గరకు వెళుతున్నట్లుగా సత్యంతో చెప్పదు మీనా. బయటకు వెళుతున్నానని అబద్ధం ఆడుతుంది. మావయ్యకు అబద్ధం చెప్పడం బాధగా ఉందని అంటుంది.
మరోవైపు తన తల్లిదండ్రులతో పాటు అన్న, వదినల్ని మోసం చేస్తున్నందుకు రవి కూడా బాధపడతాడు మనసులోనే వారికి క్షమాపణలు చెబుతాడు. . కానీ శృతి ప్రేమకు దూరమై బతకలేనని అనుకుంటాడు.రవి, శృతిల పెళ్లికి సుమతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ఔట్ స్టేషన్ గిరాకి వెళ్లిన బాలుకు అడుగడుగునా అపశకునాలే ఎదురవుతాయి. తన ఫ్యామిలీకి ఏదో ఆపద రాబోతున్నట్లు అనుమానపడతాడు. వెంటనే మీనాకు ఫోన్ చేస్తాడు. బాలు, మీనాకు రవి పెళ్లి గురించి తెలిసిందా? రవి పెళ్లిని బాలు అడ్డుకున్నాడా? రవి ఏం చేస్తున్నాడో కనిపెట్టుకొని ఉండమని బాలు చెప్పిన మాటను తప్పిన మీనాకు ఎలాంటి శిక్ష పడనుంది?తనను మోసం చేసిన కొడుకు రవిని సత్యంఏం చేశాడు? అన్నది గుండెనిండా గుడిగంటలు సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.