Satyam Rajesh Tenant:పొలిమేర2 సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ హీరోగా నటిస్తోన్న టెనెంట్ మూవీ ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ రూపొందిన టెనెంట్ సినిమాకు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. టెనెంట్ ట్రైలర్‌ను హీరో ప్రియదర్శి ఇటీవల రిలీజ్ చేశాడు. .
సత్యం రాజేష్ ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్తర్ నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. రావణాసురుడు సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది? అంటూ సత్యం రాజేష్ సమాధానం చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎ లాంటి అనూహ్య మలుపులు తిరిగింది అన్నది ట్రైలర్‌లో థ్రిల్లింగ్‌గా చూపించారు.
రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అద్దె కట్టకుండా టెనెంట్ గా ఉంటున్నాడు సత్యం రాజేష్. నటుడిగా అతడి ప్రయాణం, ట్రాన్స్ ఫర్మేషన్ చాలా మందికి స్ఫూర్తిదాయకం. టెనెంట్ ట్రైలర్ బాగుంది. నిర్మాతల కళ్ళలో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్ధమౌతోంది. కంటెంట్ చాలా కొత్తగా వుందిఅని తెలిపాడు.
హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ... దర్శకుడు యుగంధర్ 'టెనెంట్' కథని ఎంత అద్భుతంగా చెప్పారో అంతే అద్భుతంగా సినిమాని తీశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ లో కన్నీళ్లు వచ్చేశాయి. తప్పకుండా మా అందరి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
చందన, ఎస్తెర్, అనురాగ్‌తో పాటు ప్రతి ఒక్కరూ పోటీపడినటించారు అని తెలిపాడు. ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్ అయ్యే కథ ఇది.ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా. ఎమోషన్ కి ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారని దర్శకుడు వై యుగంధర్ అన్నాడు.
ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను చేసిన మోస్ట్ ఎవైటెడ్ సినిమాలో 'టెనెంట్' ఒకటి. ఎవరడిగినా ఈ సినిమా గురించే చెబుతున్నాను. డైరెక్టర్ గారు ఇందులో నా పాత్రని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. డబ్బింగ్ చెప్పినప్పుడు నా పాత్ర ఇంకా నచ్చింది. సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది అని తెలిపింది. '
టెనెంట్'.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా అని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు. సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి సాహిత్య సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు