Gundeninda Gudigantalu Balu: బెస్ట్ హజ్బెండ్‌గా గుండెనిండా గుడిగంటలు బాలు - డీజే టిల్లు హీరోయిన్ చేతుల మీదుగా అవార్డ్
10 October 2024, 12:32 IST
Gundeninda Gudigantalu Balu: స్టార్ మా పరివార్ 2024 అవార్డ్స్ వేడుకలు త్వరలో స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈ అవార్డుల్లో బెస్ట్ హజ్బెండ్ కేటగిరీలో గుండెనిండా గుడిగంటలు బాలు అవార్డును దక్కించుకున్నాడు. అతడికి డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి అవార్డును అందజేసింది.
గుండెనిండా గుడిగంటలు బాలు
Gundeninda Gudigantalu Balu: సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ప్రతిభను చాటిన నటీనటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లకు స్టార్ మా ప్రతి ఏటా స్టార్ మా పరివార్ పేరుతో అవార్డులను అందజేస్తుంది. స్టార్ మా పరివార్ 2024 అవార్డులను ప్రదానోత్సవం ఇటీవలే ముగిసింది. ఈ అవార్డు వేడుకలు త్వరలో స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతున్నాయి.
బెస్ట్ హజ్బెండ్ బాలు...
కాగా స్టార్ మా పరివార్ అవార్డుల్లో బెస్ట్ హజ్బెండ్ కేటగిరీలో గుండెనిండా గుడిగంటలు ఫేమ్ విష్ణుకాంత్ అవార్డును అందుకున్నాడు. గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో బాలుగా మాస్ రోల్‌లో విష్ణుకాంత్ నటిస్తున్నాడు.
కుటుంబ సభ్యుల ఎత్తిపొడుపు మాటల నుంచి భార్య మీనాను కాపాడుతూ...ఆమె మనసును అర్థం చేసుకునే భర్తగా బాలు పాత్రలో విష్ణుకాంత్ తన నటనతో సీరియల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్నాడు. మరోవైపు కన్న తండ్రికి విలువనిస్తూ ఇంటి బాధ్యతల్ని భుజాన వేసుకున్న కొడుకుగా విష్ణుకాంత్ నటన ఈ సీరియల్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.
డీజే టిల్లు హీరోయిన్ చేతుల మీదుగా...
స్టార్ మా పరివార్ 2024 అవార్డ్స్‌లో బెస్ట్ హజ్బెండ్ కేటగిరీలో విష్ణుకాంత్‌కే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి చేతుల మీదుగా విష్ణుకాంత్ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
టీఆర్‌పీలో టాప్ త్రీ...
గుండెనిండా గుడిగంటలు సీరియల్ ప్రస్తుతం టీఆర్‌పీ రేటింగ్ పరంగా స్టార్ మాలో టాప్ త్రీలో కొనసాగుతోంది. టీఆర్‌పీ రేటింగ్‌లో బ్రహ్మముడి టాప్‌లో నిలవగా...కార్తీక దీపం 2 సెకండ్ ప్లేస్‌లో ఉంది. అర్బన్ ఏరియాలో బ్రహ్మముడిని దాటేసి ఇటీవలే గుండెనిండా గుడిగంటలు టాప్‌లోకి తీసుకొచ్చింది. ఈ సీరియల్‌లో మీనా పాత్రలో అమూల్య గౌడ నటిస్తోంది.
తమిళంలో మూడు సీరియల్స్...
గుండెనిండా గుడిగంటలు సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు విష్ణుకాంత్. గతంలో తమిళంలో ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, ఎండ్రేండం పున్నాగైతో పాటు మరికొన్ని సీరియల్స్ చేశాడు. తమిళ సీరియల్స్‌కు మించి గుండెనిండా గుడిగంటలు అతడికి ఎక్కువగా పేరు తెచ్చిపెట్టింది.
మా ఇంటి దేవత...
గుండెనిండా గుడిగంటలు తర్వాత తెలుగులో మా ఇంటి దేవత పేరుతో మరో సీరియల్‌కు విష్ణుకాంత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అక్టోబర్ 14 నుంచి జెమిని టీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు ఈ మా ఇంటి దేవత సీరియల్ టెలికాస్ట్ కానుంది. మా ఇంటి దేవత సీరియల్‌లో విష్ణుకాంత్‌తో పాటు శిరీష, ఉషశ్రీ, హరికృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
మూడు సీరియల్స్...
అక్టోబర్ 14 నుంచి జెమిని టీవీలో మా ఇంటి దేవతతో పాటు స్నేహంకోసం, అభినందన సీరియల్స్ ప్రారంభంకానున్నాయి.