RRR Shortlisted For Oscar: ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ఆర్ఆర్ఆర్ - ఏ కేటగిరీలో స్థానం దక్కిందంటే
RRR Shortlisted For Oscar:రాజమౌళి ఆర్ఆర్ఆర్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నది. ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ స్థానాన్ని దక్కించుకున్నది.
RRR Shortlisted For Oscar: రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్ఆర్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఆస్కార్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు స్థానం దక్కింది. బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ సినిమా ది చెల్లో షో కూడా షార్ట్ లిస్ట్‌కు ఎంపికైంది.
గురువారం తొమ్మిది కేటగిరీల్లో షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల జాబితాను అకాడమీ అనౌన్స్‌చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట స్థానాన్ని దక్కించుకున్నది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైనింగ్ కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ జాబితాలో ఇండియన్ సినిమాకు ఛాన్స్ దక్కలేదు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన 15 సినిమాల నుంచి జనవరిలో ఐదు సినిమాల్ని ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ సినిమాలు మాత్రమే ఆస్కార్‌కు పోటీపడతాయి.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్ షార్ట్ లిస్ట్ జాబితాను జనవరి రెండో వారంలో ప్రకటించబోతున్నారు. మొత్తం పదిహేను కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు ఇండివిజువల్‌గా అప్లై చేసింది. అందులో నుంచి ప్రస్తుతం ఒక కేటగిరీలో ఈ సినిమా షార్ట్ లిస్ట్ జాబితాలో ఎంపికకావడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. అలియాభట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటించారు.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ది చెల్లో షో
బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో గుజరాతీ ఫిల్మ్ ది చెల్లో షో షార్ట్ లిస్ట్ అయ్యింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్నది. దర్శకుడి సెమీ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందింది.