తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: శ్రుతి బతుకుపై నీలకంఠం దెబ్బ- బాలును బెదిరించిన మీనా- మళ్లీ అత్తింటికి పూలగంప

Gunde Ninda Gudi Gantalu Today Episode: శ్రుతి బతుకుపై నీలకంఠం దెబ్బ- బాలును బెదిరించిన మీనా- మళ్లీ అత్తింటికి పూలగంప

Sanjiv Kumar HT Telugu

22 October 2024, 10:11 IST

google News
  • Gunde Ninda Gudi Gantalu Serial October 22 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో సురేంద్ర ఇంటికి వెళ్లి నీలకంఠ, సంజు పెద్ద గొడవ చేస్తారు. ఇంకా ఎందుకు బతికి ఉన్నావురా అని నీలకంఠం అంటాడు. మరోవైపు ఇంట్లోంచి అత్తింటికే వెళ్లమని మీనాను అంటుంది పార్వతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ కోసం అని ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకురమ్మని రవిని పంపిస్తుంది శ్రుతి. వెళ్లాలని లేదు. మాది పెద్ద ఫ్యామిలీ. ఇల్లంతా సందడిగా ఉంటుంది. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. ఇవాళ ఈ పెళ్లే వాళ్లకు దూరం చేసింది. మనం పెళ్లి చేసుకుని తప్పు చేశావేమో అనిపిస్తుంది అని రవి అంటాడు.

వాళ్లెందుకు నష్టపోవాలి

వాళ్లను బాధపెట్టడం తప్పే కానీ, పెళ్లి చేసుకుని తప్పు చేయలేదు. మనం వాళ్లకు చెప్పకుండే చేసుకుంటే వేరు. వాళ్లకు చెప్పాం. వాళ్లు మనల్ని విడదీయాలని అనుకోవడం తప్పు కాదా చెప్పు. అయినా వాళ్ల పంతాలు మన పెళ్లికి అడ్డు రావడం ఏంటీ. ఇలాంటివి రెండు వైపులా తప్పు ఉంటుంది అని శ్రుతి అంటుంది. కానీ, మనవల్ల వదిన ఎందుకు నష్టపోవాలి. వాళ్లు వదినను ఎంత హింసిస్తారో. చేయని తప్పుకు వదినా, నాన్న శిక్ష అనుభవిస్తున్నారు అని రవి అంటాడు.

ఇదంతా తలుచుకుంటే గిల్టీగా ఉందని రవి అంటే.. మన పెళ్లి జరగుకుండా ఉంటే బాగుండేది అంటున్నావా. నాకు ఆ పిచ్చోడితో పెళ్లి జరిగేది. అప్పుడు నువ్ గిల్టీగా ఫీల్ అవ్వవా. మనకు పెళ్లి జరగకుంటే జీవితాంతం బాధ. ఏది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందో ఆలోచించు. ఎల్లుండి వరకు అన్ని సర్దుకుపోతాయ్. ఆలోచించు అని శ్రుతి అంటుంది. నాకిప్పుడు మూడ్ లేదు. వెంటనే మైండ్‌ను డైవర్ట్ చేసుకోలేను అని రవి అంటాడు.

సరే ఇవాళ వద్దంటావ్. ఓకే అని శ్రుతి అంటుంది. థ్యాంక్స్ అని రవి చెబితే నిన్ను పెళ్లి చేసుకుని నీలో సగభాగం అయ్యాను. ఆమాత్రం అర్థం చేసుకోలేనా. నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ సంతోషం చాలు అని శ్రుతి వెళ్లిపోతుంటే.. రవి పిలిచి సారీ చెబుతాడు. మనలో మనకు సారీ ఏంటీ అని శ్రుతి అంటుంది. ఇద్దరు ప్రేమగా వెళ్లిపోతారు. మరోవైపు బాలు తండ్రి గురించి ఫ్రెండ్స్ అడుగుతారు. పరువంతా పోయిందిరా. అదోలా ఉన్నారు. అన్నం తినమన్నా ఆకలి చచ్చిపోయిందని అంటున్నార్రా అని బాలు అంటాడు.

బాలుకు అవమానం

ఇదంతా రవిగాడి వల్ల. వాడికోసం చూస్తున్నాను అని బాలు అంటాడు. నీకే ఇలా ఉందంటే మీ నాన్నకు ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోగలను అని బాలు ఫ్రెండ్ అంటాడు. రేయ్ బాలు. ఏంటీ మీ నాన్న ఏ తప్పు చేయలేదని లోకమంతా చాటింపు వేయడానికి వచ్చావా. మీ నాన్న శ్రీ శ్రీ శ్రీ సత్యంగారు జనానికే నీతులు చెబుతారా. ఆయన ఫాలో అవ్వడా అని అవమానించేలా మాట్లాడుతాడు ఓ తాగుబోతు. బాలు, అతని ఫ్రెండ్ వెళ్లమని వారిస్తారు.

కానీ, తాగుబోతు వినడు. రేపో మాపో మీ నాన్న పోతాడు కదా. ఈ వయసులో ఏం సాధిస్తామని ఈ పనులు. ఉన్న పరువంతా పోయే.. సత్యం కాస్తా అసత్యం అయిపోయే. మీ నాన్నను చూస్తుంటే అని నవ్వుతాడు తాగుబోతాడు. దాంతో కాలర్ పట్టుకుని ఏంట్రా ఎక్కువ మాట్లాడతున్నావ్. మా నాన్న తప్పు చేయడం నువ్ చూశావా అని కొడతాడు బాలు. వాడి తాగి మాట్లాడుతున్నాడురా అని ఫ్రెండ్స్ అంటాడు. కావాలనే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని కొడతాడు బాలు.

తప్పు చేయనప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని తాగుబోతు అంటే.. వాళ్లు అరెస్ట్ చేస్తే తప్పు చేసినట్లేనా. నా ముందే ఇలా మాట్లాడుతావా అని చితక్కొడతాడు బాలు. ఇంతలో బాలు మామ వచ్చి ఆపుతాడు. ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో జరిగిందంతా చెబుతాడు బాలు. కళ్లు మూసి తెరిచేలోపు అంతా జరిగిపోయింది. నువ్వు చెప్పు మావ మా నాన్న తప్పు చేస్తాడా అని బాలు అంటాడు. ఇంటికొచ్చిన నాన్న మాట పలుకు లేకుండా ఉండిపోయాడు. చూడలేక ఇలా వచ్చాను అని బాలు అంటాడు.

బోడి మర్యాదలు

లేదు లేదు నేను మాట్లాడుతాను. పదా ఇంటికి వెళ్దాం అని వెళ్తారు. శ్రుతి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటాడు సురేంద్ర. ఆఫీస్, బంధువులందరకి తెలిసిపోయింది. బాధపడటం కన్నా సంతోషిస్తున్నారు అని శోభన అంటే.. ఇదంతా సత్యంగాడు వెనుకుండి నడిపించాడు అని సురేంద్ర అంటాడు. ఇంతలో నీలకంఠం వచ్చి గొడవ చేస్తాడు. టీ తీసుకురమ్మని సురేంద్ర అంటే.. రేయ్ ఆపరా.. ఆపు నీ బోడి మర్యాదలు. ఇంత మోసం చేస్తావా అని ఫైర్ అవుతాడు.

అన్ని తెలిసు డాడీ. శ్రుతి సంగతి మొత్తం తెలుసు. అందుకే శ్రుతిని బయటకు పంపలేదు. ఫోన్ కూడా ఈవిడ దగ్గరే పెట్టుకుంది అని సంజు అంటాడు. బాబు అని శోభన అంటే.. ఛీ ఆపు బాబు బాబు అని బాంబ్ పెట్టారు అని సంజు అంటాడు. రేయ్.. ఇవాళ రేపు అంతా ఇలాగే ఉన్నార్రా. అది కాదురా తప్పు. నాకు ముందే చెప్పుంటే వాడిని లేపించేసి కత్తి పెట్టి తాళి కట్టించేవాడినిరా. ఏం జరిగిందో అర్థం అయ్యేలోపు శోభనం జరిపించేవాన్ని. ఏడ్చి మొత్తుకునేలోపు పిల్ల తల్లి అయి నా కొడుకుతో కాపురం చేసేది అని నీలకంఠం అంటాడు.

నేను ఎంత జోకర్‌లా కనిపించకపోతే నన్నే తన పెళ్లికి తీసుకెళ్తుంది అని సంజు అంటాడు. మొదటిసారి నేను మోసపోయాను. రాజకీయనాయకులు నుంచి ఎవరు నాకు భయపడతారు. ఇప్పుడు ఆ భయం పోతుంది. నీ కూతురు కనిపించట్లేదని చెబితే అప్పుడే గంటలోపు తీసుకొచ్చే వాడిని. సిగ్గుంటే ఈపాటికే నువ్ ఉరేసుకుని చావాలి. ఏం బతుకురా నీది అని నీలకంఠం అంటాడు. నా కోపం చల్లారలేదు. ఇల్లంతా స్మాష్ చేసి తగలబెట్టేస్తాను అని సంజు అంటాడు.

బ్లాక్ మార్కెట్ బయటపడుతుంది

ఇప్పటికే సగం చచ్చాడురా. ఇంకేం చేస్తాం అని బలవంతంగా సంజును తీసుకెళ్లిపోతాడు నీలకంఠం. ఏంటీ డాడ్ వదిలేసావ్ అని సంజు అంటాడు. నేను ఎక్కడ వదిలేశానురా. ఆ పిల్ల నిన్నే తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకుంది. టైమ్ చూసి తన బతుకు మీద దెబ్బ కొడతాను. ఈ పనికిమాలినోడు వెళ్లి పోలీస్ కంప్లైట్ పెట్టాడు. వాళ్లు మేజర్స్ కాబట్టి వాళ్లకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే మన బ్లాక్ మార్కెట్ బయటకు వస్తుంది అని నీలకంఠం అంటాడు.

నన్ను బఫూన్‌ను చేసింది. దాన్ని ఊరికే వదలను అని సంజు వెళ్తాడు. మరోవైపు బాలు అన్న మాటలు తల్చుకుంటుంది మీనా. ఏదో ఒకరోజు నా తప్పు ఏం లేదని తెలుసుకుంటారు అని మీనా అంటుంది. ఇక్కడే ఉంటే ఎలా తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లి నీ తప్పు లేదని తెలుసుకునే చేయవే. ఇంట్లోకి రమ్మనకుంటే గుమ్మం దగ్గర ఉండు. లేకుంటే బయట ఉండు. వాళ్ల కోపం చల్లారేదాక ఉండు. వాళ్లు అన్నారని ఇలా వస్తే నిజంగానే నువ్ తప్పు చేసినదానివి అవుతావే అని పార్వతి అంటుంది.

లే వెళ్లు. అప్పులు తప్పులు చేసినవాళ్లు ఇంట్లో దర్జాగా ఉంటే ఏ తప్పు చేయని నువ్వు ఇక్కడ ఉండటం ఏంటీ. వెళ్లు మీనా. పెళ్లయిన కూతురు పుట్టింట్లో ఉంటే నలుగురు నాపై ఉమ్మేస్తారు. తనకు ఏం చేయొద్దని చెబితే వినలేదు. మీ వల్ల ఎప్పుడు నరకమే. మీ తోబుట్టువుగా పుట్టడమే ఇది చేసిన పాపం అనిపిస్తుంది. పదా మీనా వెళ్లు అని పార్వతి అంటుంది. అక్కడ భర్త కూడా తరిమేస్తే ఏ మొహం పెట్టుకుని వెళ్లను అని మీనా అంటుంది.

చనిపోతే అయినా

ఏమైనా నువ్ వెళ్లాలి. తన తండ్రి చెబితేనే నీకు తాళి కట్టాడు. అంతలా గౌరవించే తండ్రిని మీరు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. ఆ కోపంలో ఏమైనా అంటారు. అది నీ మీద కోపం కాదు. తండ్రి మీద గౌరవం. వాళ్లు ఎవరైనా అంటే మీ మావయ్య కాళ్ల మీద పడి క్షమించమని అడుగు. ఆయనే వాళ్లకు సర్దిచెబుతారు. ఇంత గొంతు చించుకుని అరిస్తుంటే.. వెళ్లవేంటే.. అని దండం పెడుతుంది పార్వతి. సరే నాకు ఏమైనా మీరు పట్టించుకోవద్దు. వెళ్లమన్నారు కదా. వెళ్తాను అని మీనా వెళ్లిపోతుంది.

బాలు కారుకు అడ్డంగా వెళ్తుంది మీనా. మీ అయ్య నా నాన్న బస్సు కింద తల పెట్టి నా జీవితాన్ని తాకట్టుపెట్టించి చాలలేదా అని బాలు అంటాడు. హా వెన్నుపోటు పొడుద్దామనుకుంటున్నాను. నా బతుకు కూడా రోడ్డుపాలు అయింది నేను ఎవరికీ చెప్పుకోవాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని మీనా అంటుంది. నిన్ను దగ్గరికి తీస్తే నన్ను కూడా పోలీస్ స్టేషన్‌లో పెడతావని బాలు అంటాడు.

నేను చచ్చిన తర్వాత అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారని, ఇలా నన్ను వెళ్లగొట్టినందుకు మీరు జీవితాంతం ఏడుస్తారు అని మీనా అంటుంది. అయితే, మీనా సూసైడ్ చేసుకుని చనిపోతుందా అనే అనుమానం కలుగుతోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం