Gunde Ninda Gudi Gantalu: తండ్రి ట్రీట్‌మెంట్ కోసం కారు అమ్మేసిన బాలు -అన్నయ్యకు ఎదురుతిరిగిన రవి -ప్రభావతి త్యాగం
01 November 2024, 9:03 IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 1 ఎపిసోడ్‌లో తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని నిజం తెలిసి ఆయన్ని చూడటానికి రవి హాస్పిటల్‌కు వస్తాడు. ప్రభావతి, బాలు అతడిని ఐసీయూలోకి వెళ్లకుండా ఆపేస్తారు. నీకు మాకు ఏం సంబంధం లేదని హాస్పిటల్ నుంచి వెళ్లగొడతారు.
గుండె నిండా గుడి గంటలు నవంబర్ 1 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu: తండ్రి మాటను కాదని శృతిని పెళ్లిచేసుకున్నందుకు కుటుంబసభ్యులందరూ తనను దూరం పెట్టడంతో రవి మనసు బాధతో విలవిలలాడుతుంది. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కనుక్కోవడానికి మౌనికకు ఫోన్‌చేస్తాడు. తన బాధ మొత్తం మౌనికతో చెప్పుకొని ఎమోషనల్ అవుతాడు. మౌనిక తనను అన్నయ్య అని పిలవకపోవడంతో...ఆ పిలుపుకు కూడా నేను అర్హుడిని కాదా అని రవిఅడుగుతాడు.
నాన్న కోపం తగ్గలేదా...
పోలీస్ స్టేషన్‌లో నన్ను చూసి నాన్న ముఖం తిప్పుకున్న క్షణం నుంచే నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తుందని, నాన్నకు నాపై కొంచెం కూడా కోపం తగ్గలేదా అని మౌనికను అడుగుతాడు రవి.
నాన్నకు ఇప్పుడు నీతో మాట్లాడాలని ఉన్నా...ఆయన మాట్లాడలేరని, హార్ట్ ఎటాక్ వచ్చిందనే అసలు నిజం రవికి చెబుతుంది మౌనిక. నాన్నకు స్టంట్ వేయాలని డాక్టర్లు చెప్పారని, డబ్బుల కోసం బాలు, మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అడ్జెస్ట్ కావడం లేదని మౌనిక చెబుతుంది.
డబ్బు ఇచ్చిన శృతి...
తండ్రికి హార్ట్ ఎటాక్ అని చెప్పగానే రవి కంగారుగా హాస్పిటల్‌కు బయలుదేరుతాడు. రవిని ఆపి తన దగ్గర రెండు లక్షలు ఉన్నాయని, హాస్పిటల్ ఖర్చులకు ఈ డబ్బును వాడమని శృతి చెక్ ఇస్తుంది. అవసరమైతే ఇంకా డబ్బు పంపిస్తానని రవితో చెబుతుంది.
కారు అమ్మిన బాలు...
తన ఇష్టపడి కొన్న కారును తండ్రి ట్రీట్‌మెంట్ కోసం అమ్ముతాడు బాలు. కొత్త కారును ఎందుకు అమ్ముతున్నావని బాలును అడుగుతాడు మెకానిక్. కారు, కట్టుకున్న పెళ్లాం రెండు ఒకటే..మనకు బాకీ ఉంటే మనతోనే ఉంటారు...లేదంటే మధ్యలోనే జారిపోతారని మీనాపై తనకున్న కోపాన్ని బయటపెడతాడు బాలు
బాధలేదు...సంతోషమే...
తండ్రిని బతికించుకోవడానికే కారును అమ్ముతున్నానని అందుకు బాధలేదని, సంతోషంగా ఉందని కారును కొంటున్న వ్యక్తితో చెబుతాడు బాలు. తండ్రికి సాయంత్రం లోగా హార్ట్ ఆపరేషన్ చేయాలని అన్నారని, ఆ డబ్బుల కోసమే కారు అమ్మాల్సివచ్చిందని చెబుతాడు. అతడు మూడు లక్షలు ఇవ్వగానే దేవుడిలా వచ్చి డబ్బులు ఇచ్చారని కొన్న వ్యక్తితో అంటాడు బాలు. కన్న తండ్రి కోసం బాలు పడుతోన్న ఆరాటం చూసి కారు కొన్న వ్యక్తి ఫిదా అవుతాడు. మెకానిక్ కూడా తనకు కమీషన్ అవసరం లేదని, ముందు ట్రీట్‌మెంట్ సంగతి చూడమని అంటారు.
ప్రభావతి టెన్షన్...
డబ్బు అడ్జెస్ట్ కాలేకపోవడంతో ప్రభావతి టెన్షన్ పడుతుంది. తొందరగా స్టంట్ వేయకపోతే సత్యానికి మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని, ఆ లోపు డబ్బులు కట్టాలని ప్రభావతిని డాక్టర్ హెచ్చరిస్తాడు. అప్పుడే బాలు హాస్పిటల్‌కు వస్తాడు. తాను ఓ మూడు లక్షలు తెచ్చానని అంటాడు. ఇంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చావని బాలుపై మనోజ్ అనుమానం వ్యక్తంచేస్తాడు.
మీ మావ మలేషియా నుంచి పంపించాడని బాలు సెటైర్‌వేస్తాడు. తన కారును అమ్మేసినట్లు అసలు నిజం బయటపెడతాడు. ఈ మూడు లక్షలు సరిపోవని, ఇంకా కావాలని మనోజ్ అంటాడు. నా తల తాకట్టు పెట్టిన ఇంకో దమ్మిడి పుట్టేలా లేదని బాలు కోపంగా సమాధానమిస్తాడు.
ఇంటి డాక్యుమెంట్స్...
ఇంటి పత్రాలు మీనాను ఎత్తుకెళ్లి ఉంటుందని ప్రభావతి అంటుంది. మన సంతకాలు లేకుండా ఇంటి డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్లి మీనా ఏం చేస్తుందని బాలు అంటాడు. రవి కంగారుగా హాస్పిటల్‌లోకి వస్తాడు.
ఇంకా ఏం చూడటానికి వచ్చావు...మీ నాన్నను పోలీస్ స్టేషన్‌లో నిలబెట్టి పరువు పోయేలా చేశావు...చివరకు ప్రాణాల మీదకు తెచ్చావు...ఇంకా ఆయనకు ఏం జరగాలని కోరుకుంటున్నావని రవిపై ప్రభావతి ఫైర్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని కొడుకుతో అంటుంది. నీ వల్లే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, శృతిని పెళ్లిచేసుకోకుండా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని మనోజ్ అంటాడు.
ముఖం చూడటం ఇష్టంలేదు...
రవి ముఖం చూడటం కూడా తనకు ఇష్టం లేదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని కఠువుగా కొడుకుతో అంటుంది ప్రభావతి. బాలు నిన్ను చూస్తే ప్రాణాలతో వదిలి పెట్టడని రోహిణి, మౌనిక హెచ్చరిస్తారు. నీలాంటి వాడి నీడమాపై పడటానికి వీలులేదని ప్రభావతి కోపంగా రవితో అంటుంది.
ఇవాళ నాన్నను చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్లనని బాలు పట్టుపడతాడు. ఐసీయూలోకి వెళ్లబోతాడు. అప్పుడే అక్కడికి బాలు వస్తాడు. రవిని అడ్డుకుంటాడు. ఎవరు నువ్వు...ఎక్కడికి వెళుతున్నావని నిలదీస్తాడు. నాన్నను చూడటానికి వెళుతున్నానని రవి సమాధానమిస్తాడు.
ఆయన మాకు మాత్రమే నాన్న. నిన్ను మాలో ఎప్పటికీ కలుపుకునేది లేదని వార్నింగ్ ఇస్తాడు. నీ వల్ల ఇన్నేళ్లుగా నాన్న కాపాడుకుంటున్న పరువు మర్యాద అన్ని పోయి చావుకు, బతుకుకు మధ్య ఉన్నాడని రవిపై బాలు కోప్పడుతాడు.
బాలు వార్నింగ్...
బాలు ఎంత చెప్పిన రవి వినడు. నాన్నను చూసే వెళతానని పట్టుపడతాడు. నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్లిపో అని రవిని నెట్టేస్తాడు బాలు. నేను మీలాగే ఆయనకు కొడుకునే...ఆయన్ని చూడకుండా నన్ను ఎందుకు ఆపుతున్నావని బాలుకు ఎదురుతిరుగుతాడు రవి. అతడి మాటలతో బాలు కోపం పట్టలేకపోతాడు. రవిని కొట్టడానికి వెళతాడు. చివరకు రంగా మావయ్య కలుగజేసుకొని గొడవను ఆపేస్తాడు.
డబ్బు అవసరం లేదు...
నాన్న ఆపరేషన్ కోసమైనా తన డబ్బు వాడమని రవి కన్నీళ్లతో బాలును వేడుకుంటాడు. నువ్వు వద్దు...నీ డబ్బు వద్దని బాలు విసిరికొడతాడు. నాన్నకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణమైన నిన్ను, నీకు పెళ్లిచేసిన మీనాను జన్మలో దగ్గరకి రానిచ్చేది లేదని అంటాడు. రవి కన్నీళ్లతో వె నుదిరుగుతాడు. మీనా చాటునే ఉంచి గొడవను చూస్తుంది.
బంగారం ఇచ్చేసిన ప్రభావతి...
మిగిలిన డబ్బును ఎవరిని అడగాలో తెలియక బాలు కంగారుపడతాడు. ఇక ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పనిలేదని తన ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసి బాలుకు ఇస్తుంది ప్రభావతి. ఈ బంగారం తాకట్టు పెట్టి మిగిలిన డబ్బు తెమ్మని బాలుతో అంటుంది. భర్త కంటే ఈ బంగారం తనకు ఏం ఎక్కువ కాదని చెబుతుంది. తల్లి బంగారాన్ని తీసుకోవడానికి బాలు మనసు ఒప్పుకోదు. చివరకు బంగారాన్ని బాలు చేతిలో ప్రభావతి పెడుతుంది.
ఐసీయూలో మీనా...
ఐసీయూలో బాలు, మనోజ్‌తో పాటు ఎవరూ లేని టైమ్ చూసి కంకణం సత్యం చేతికి కట్టాలని మీనా అనుకుంటుంది. ఆమె ఐసీయూలో ఉండగానే అక్కడికి ప్రభావతి, రోహిణి వస్తారు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.