Gunde Ninda Gudi Gantalu: ప్రభావతిపై మీనా రివర్స్ ఎటాక్ - బాలు సీక్రెట్స్ బయటపెట్టిన రోహిణి - శృతిపై అలిగిన రవి
04 December 2024, 10:07 IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో బాలు కారును ఫైనాన్షియర్ లాగేసుకున్న విషయం రోహిణి బయటపెడుతుంది. బాలుకు ఏం జాబ్ లేదని మనోజ్, రోహిణి అవమానిస్తారు. భర్తకు తన కళ్ల ముందే అవమానం జరగడం మీనా సహించలేకపోతుంది.
గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 4 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu: ఫైనాన్షియర్ దగ్గరకు మీనా...రవిని కలవడానికి ప్రభావతి వెళ్లడంతో ఇంట్లో సత్యం ఒక్కటే ఉండిపోతాడు. మధ్యాహ్నం భోజనం చేయడానికి సత్యం సిద్ధమవుతోండగా...అప్పుడే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. సాంబర్‌లో బల్లి పడటం చూసి తండ్రిని అన్నం తినొద్దని హెచ్చరిస్తాడు. తండ్రి ప్రాణాలు కాపాడుతాడు.
సాంబార్‌లో ఏం వేశావు...
సత్యాన్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోయినా ప్రభావతిపై కోప్పడుతాడు బాలు. మీనానే వంటలు చేసిందని తప్పును కోడలిపై నెట్టేస్తుంది ప్రభావతి. సాంబార్‌లో ఏం వేశావని భార్యను కోపంగా అడుగుతాడు బాలు. వంకాయ, సోరకాయ అని మీనా సమాధానమిస్తుంది. కూరగాయలకు కళ్లు, కాళ్లు ఉంటాయా ఎగతాళి చేస్తాడు.
మీనాపై చిందులు...
సాంబర్‌లో బల్లి పడిందని, అది తినమని చెప్పి బయటకు వెళ్లిపోయావా అని మీనాపై చిందులు తొక్కుతుంది ప్రభావతి. నీకు ఇంటి పనుల కంటే మీ పుట్టింటి మీదే ధ్యాస ఎక్కువైపోయిందని, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావని కోడలిని నానా మాటలు అంటుంది ప్రభావతి. అదే సాంబార్ మనోజ్ కూడా తిన్నాడని ప్రభావతి కంగారు పడుతుంది.
నిజం చెప్పిన కామాక్షి...
గొడవను ఆపేసి ప్రభావతిని రూమ్ లోపలికి తీసుకొస్తుంది కామాక్షి. అదే సాంబర్ నువ్వు, నేను వేసుకొని తిని బయటకు వెళ్లామని అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి కంగారు పడుతుంది. మనం తిన్న తర్వాతే బల్లి పడిందని అసలు నిజం కామాక్షి బయటపెడుతుంది. . నువ్వే సాంబార్ గిన్నెపై మూత పెట్టడం మర్చిపోయావని ప్రభావతి చేసిన తప్పును గుర్తుచేస్తుంది. ప్రతి చిన్న విషయానికి మీనాను తప్పు పట్టడం మానేయమని ప్రభావతికి క్లాస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ విషయం బాలు చెబితే నీ సంగతి ఏమవుతుందో ఆలోచించుకోమని హెచ్చరిస్తుంది.
మీనాను తిట్టడంలో తప్పులేదు...
అయినా మీనాను తిట్టడంలో తప్పేం లేదని ప్రభావతి అంటుంది. మీనా పూల మాలలుకట్టడానికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే గిన్నెపై మూత పెట్టి ఉండేదని అంటూ తనను తానే సమర్థించుకుంటుంది.
సంజు రివేంజ్ ప్లాన్...
శృతిపై రివేంజ్ తీర్చుకునే అవకాశం కోసం సంజు ఎదురుచూస్తుంటాడు. రవి ఇంట్లో లేని టైమ్ చూసి రహస్యంగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు . ఆ టైమ్‌లో మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తుంటుంది శృతి. ఆమెకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు.
రవి ఎంట్రీ...
సరిగ్గా అదే టైమ్‌లో రవి రావడంతో సంజు ప్లాన్ ఫెయిలవుతుంది. రవి, శృతికి కనిపించకుండా ఇంట్లోనే దాక్కుంటాడు సంజు. వారిద్దరు మరో రూమ్‌లోకి వెళ్లగానే పారిపోతాడు. ఈ ప్రయత్నంలో ఫ్లవర్ వాజ్ కిందపడటంతో రవి, శృతి కంగారుగా హాల్‌లోకి వస్తారు. కానీ వారికి సంజు కనిపించడు.
ఇద్దరిని రమ్మన్నారు...
తనను ప్రభావతి కలిసిన విషయం శృతికి చెబుతాడు రవి. ఇంటికి రమ్మని పిలిచిందని ఆనందంగా అంటాడు. నీకు ఈ మాత్రం సపోర్ట్ అయినా దొరికింది...కానీ తనకు పెళ్లయిన రోజు నుంచి ఇప్పటివరకు ఇంటి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని శృతి బాధపడుతుంది. మీ వాళ్లు పిలిచారు కదా అని నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతావా అని రవిని అడుగుతుంది శ్రుతి. ఇద్దరిని రమ్మన్నారని రవి సమాధానమిస్తాడు.
భార్యపై అలిగిన రవి...
పెళ్లి చేసుకొని మోజు తీరిన తర్వాత నిన్ను వదిలేసే చీప్ క్యారెక్టరా నాది అని రవి అలుగుతాడు. అతడిని శృతి బుజ్జగిస్తుంది. తన అన్న మాటలకు సారీ చెబుతుంది. మీ ఇంటికి ఎప్పుడు వెళదామని రవిని అడుగుతుంది శృతి. బాలు అన్నయ్య లేని టైమ్ చూసి అమ్మ ఫోన్ చేస్తానని అన్నదని.
ఆ రోజు తప్పకుండా వెళదామని రవి సమాధానమిస్తాడు. మరోవైపు శృతిపై రివేంజ్ తీర్చుకునే అవకాశం చేజారిపోవడం సంజు సహించలేకపోతాడు. శృతిని జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటాడు.
మాటకు మాట సమాధానం...
వంట చేస్తోన్న మీనాలోని తప్పుల్ని వెతకడానికి కిచెన్‌లోకి వస్తుంది ప్రభావతి. కానీ అత్తకు ఛాన్స్ ఇవ్వదు మీనా. హడావిడిగా వంటలు చేసి నిన్న సాంబార్‌లో బల్లి వేశావు...ఈ రోజు ఏ పాము వేశావో అని ప్రభావతి ...మీనాను దెప్పిపొడుస్తుంది. ఈ రోజు బొద్దింకలు వేశాను...రేపు పాములు వేస్తానని అత్తయ్యపై సెటైర్లు వేస్తుంది మీనా.
నిన్న నేను వంట చేసి గిన్నెలపై మూతలు సరిగ్గానే పెట్టి వెళ్లానని, కానీ ఎవరో చేసిన తప్పుకు నన్ను ఇంకా నిందిస్తే ఊరుకోనని ప్రభావతితో అంటుంది మీనా. చేసిన తప్పులను ఏ రోజు ఒప్పుకున్నావని కోడలితో కోపంగా అంటుంది ప్రభావతి. నన్ను తప్పు చేయకున్నా నన్ను ఏ రోజు సమర్థించారని ప్రభావతి మాటలకు ఎదురుచెబుతుంది మీనా.
మీనా రచ్చ...
రోహిణితో పాటు బాలు, మనోజ్‌లను కిచెన్‌లోకి పిలుస్తుంది మీనా. తాను చేసిన వంటలకు అందరికి చూపిస్తుంది. ఇందులో ఏ బల్లి, నల్లి పడలేదని చెబుతుంది. తాను లేనప్పుడే అన్ని సాంబార్‌లో పడతాయని చెబుతుంది. వంటల విషయంలో అజాగ్రత్తతో ఉన్నట్లు అందరూ మాట్లాడుతున్నారని, అవమానించడం, అనుమానించడం మా హక్కు అన్నట్లు...బాధపడటం, భరించడం నా ప్రాప్తం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని మీనా అందరితో అంటుంది.
మీకు సాక్ష్యాలు, ఆధారాలు ఉండాలి కాబట్టే ఇవన్నీ మీకు చూపిస్తున్నానని మీనా చెబుతుంది. నిన్న జరిగింది మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావా అని రోహిణి అంటుంది. పోలీస్ ఆఫీసర్‌లా భలే కనిపెట్టావే అని రోహిణిపై మీనా పంచ్ వేస్తుంది. ఈ రోజు కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నావని మీనాపై బాలు సెటైర్లు వేస్తాడు.
ఎక్కడికి వెళ్లేది లేదు...
బయటకకు వెళుతున్నానని మీనా అంటుంది. రోజు ఇదే మాట చెప్పి వెళుతున్నావ్...ఎక్కడికి వెళుతున్నావేమిటి అని అనుమానంగా ప్రభావతిని అడుగుతుంది మీనా. గుడికి వెళుతున్నానని మీనా అబద్ధం ఆడుతుంది. ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని ఎక్కడికి వెళ్లేది లేదని బాలు అంటాడు. నాన్నను ఎవరు చూసుకుంటారని మీనాపై కోప్పడుతాడు.
నేను మాత్రమే బాగుండాలి...
గుడికి వెళ్లి రోజు ఏం కోరుకుంటున్నావని మీనాను అడుగుతుంది రోహిణి. నేను బాగుండాలి అని తప్ప ఏం కోరుకుంటుందని ప్రభావతి నిష్టూరంగా అంటుంది. బాలు కారును ఫైనాన్షియర్ తీసుకున్న విషయాన్ని రోహిణి బయటపెట్టేస్తుంది. బాలుకు ఏ ఉద్యోగం లేదని అంటుంది.
భార్యాభర్తలు ఇద్దరు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని మనోజ్ అంటాడు. వెళ్లి బార్‌లో పనిచేయమని అవమానిస్తాడు. మీరు ఇలా తిండికి లెక్కలు వేస్తారని తెలిసి ఆయన మనసు చంపుకొని ఎలాంటి పనిచేస్తున్నాడో తెలుసా అని మీనా అంటుంది. మీనాను నిజం చెప్పకుండా బాలు అడ్డుకుంటాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.