BSNL Recharge Plans : రూ.100లోపు బీఎస్ఎన్ఎల్ 5 కొత్త రిఛార్జ్ ప్లాన్స్.. వ్యాలిడిటీ, డేటా ఎంతో చెక్ చేయండి
BSNL Recharge Plans : తన కస్టమర్లకు దగ్గరయ్యేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా రూ.100లోపు రిఛార్జ్ ప్లాన్స్ ఐదింటిని తెచ్చింది. వాటి వ్యాలిడిటీ, డేటా ఎంతో చూద్దాం..
టెలికాం కంపెనీలు ధరలు పెంచడంతో బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు చాలా తక్కువ ధరతో ఉన్నాయి. కంపెనీ దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో 4జీ సేవలను కూడా ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు తాజాగా శుభవార్త అందించింది. రూ.100లోపు ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల రేట్లను నిరంతరం పెంచుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) చాలా తక్కువ ధరలకు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టి కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
బీఎస్ఎన్ఎల్ క్రమంగా 4జీ వైపు అడుగులు వేస్తోంది. వినియోగదారులు చాలా వేగవంతమైన డేటా ప్రయోజనం పొందుతున్నారు. మీరు రూ.100లోపు ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే బీఎస్ఎన్ఎల్ 5 ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఆ 5 ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఏంటో వాటి గురించి తెలుసుకుందాం..
బీఎస్ఎన్ఎల్ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకటి రూ. 58 రిఛార్జ్. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు. లోకల్, ఎస్టీడీ కాల్స్ కోసం 200 నిమిషాల కాల్ సౌకర్యం ఉంటుంది. 2జీబీ డేటా పరిమితి తర్వాత, ఇంటర్నెట్ 40కేబీపీఎస్ వేగంతో పని చేస్తుంది.
మరో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.87గా ఉంది. రోజుకు 1జీబీ డేటాను అందిస్తుంది. ఇందులో మొత్తం 14జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ 40కేబీపీఎస్ వేగంతో పని చేస్తుంది. ఈ ప్లాన్‌లో హార్డీ మొబైల్ గేమ్‌ల సేవ అందుబాటులో ఉంది.
రూ.94 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 3జీబీ డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్ లోకల్, STD కాల్స్ కోసం 200 నిమిషాల కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది.
రూ.97 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రోజుకు 2జీబీ డేటాతో వస్తుంది. ఇది మొత్తం 30జీబీ డేటాతో రానుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 15 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్‌లు ఉంటాయి. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ 40kbps వేగంతో పని చేస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందిస్తుంది. ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. ఇందులో అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తారు. రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ 40కేబీపీఎస్ వేగంతో పని చేస్తుంది.