First Single from Prince Movie: 'ప్రిన్స్' మూవీ నుంచి మొదటి పాట వచ్చేసింది.. దుమ్మురేపిన శివ కార్తికేయన్
01 September 2022, 20:40 IST
- Bimbiliki Pilaapi Song From Prince: శివ కార్తికేయన్ హీరోగా.. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రిన్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. బింబిలికి పిలాపి అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.
ప్రిన్స్ మూవీలో శివకార్తికేయన్, ర్యాబోషప్క
Bimbiliki Pilaapi Lyrical Song From Prince Movie: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటిస్తున్న తాజా చిత్రం ప్రిన్స్(Prince). ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ(Anudeep KV) దర్శకత్వం వహిస్తున్నాడు. ఉక్రెయిన్ నటి ర్యాబోషప్క ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను రిలీజ్ చేసింది. బింబిలికి పిలాపి అంటూ సాగే ఈ పాటు ఆకట్టుకునేలా ఉంది.
పాట ఆద్యంత హుషారుగా సాగింంది. బింబిలికి పిలాపి అంటూ క్యాచీ పదాలతో ఆకట్టుకున్న ఈ సాంగ్‌లో శివ కార్తికేయన్ తన స్టెప్పులతో దుమ్మురేపాడు. హీరోయిన్ ర్యాబోషప్క కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. గురవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట యూత్‌ను ఆకర్షిస్తోంది.
ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల, రమ్య బెహర, సాహితి చాగంటి చక్కగా ఆలపించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలైన రెమో, డాక్టర్, కాలేజ్ డాన్ లాంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ఈ సినిమాను సురేశ్ బాబు, సునీల్ నారాంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. గతేడాది డాక్టర్ చిత్రంతో.. ఇటీవల డాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ కోలీవుడ్ నటుడు.. కెరీర్ పరంగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.