Sivakarthikeyan: శివకార్తికేయన్ ప్రిన్స్ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే...-sivakarthikeyan prince release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sivakarthikeyan: శివకార్తికేయన్ ప్రిన్స్ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే...

Sivakarthikeyan: శివకార్తికేయన్ ప్రిన్స్ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే...

Nelki Naresh Kumar HT Telugu
Jun 21, 2022 12:41 PM IST

డాన్ సక్సెస్ తర్వాత శివకార్తికేయన్ (sivakarthikeyan)హీరోగా నటిస్తున్న చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

శివకార్తికేయన్
శివకార్తికేయన్ (twitter)

డాన్(don movie) సినిమాతో వంద కోట్ల మైలురాయిని చేరుకున్నారు తమిళ హీరో శివకార్తికేయన్. మే నెలలో రిలీజ్ అయినా ఈ చిత్రం ఈ ఏడాది తమిళంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. డాన్ తర్వాత శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం ప్రిన్స్(prince). జాతిరత్నాలు ఫేమ్  కేవీ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందుతోంది. . మంగళవారం ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించింది. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ఫన్నీ వీడియోను విడుదలచేశారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో దర్శకుడు తెలుగులో మాట్లాడగా శివకార్తికేయన్ తమిళంలో ముచ్చటించారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లుగా చాలా మంది చెబుతున్నారు. పోస్ట్ పోన్ కాలేదు. రిలీజ్ ఆలస్యమవుతోంది. అంటూ దర్శకుడు ఈ వీడియోలో పేర్కొన్నాడు.  అందుకు గల కారణాల్ని దర్శకుడు, శివకార్తికేయన్ చెబుతుండగా సత్యరాజ్ వెనక నుండి సైలెంట్ గా వింటూ కనిపించారు. 

ఆ తర్వాత వారితో హీరోయిన్ మారియా ర్యాబోషపకా కూడా జాయిన్ అయ్యింది. ఏ ఫెస్టివల్ కు ఈ సినిమా రిలీజ్ చేయాలనే విషయంలో వారి మధ్య పలు చర్చలు జరిగాయి. చివరకు దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  క్రాస్ కల్చర్ కథాంశంతో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. పాండిచ్చేరి, లండన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రిలీజ్ కు ముందే భారీ మొత్తాన్ని వెచ్చించి డిస్నీ హాట్ స్టార్ హక్కులను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్